Kalimata
-
ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!
ఇటీవల కాలంలో మన నగరాల్లో కూడా చిన్ని చిన్న మ్యూజిక్ బ్యాండ్లు వచ్చాయి. ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు కూడా. అయితే పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచే ఉంది. అక్కడ పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగించే రాక్ మ్యూజిక్‌కి క్రేజ్ ఎక్కువ. 60ల కాలంలో ఓ ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. ఇప్పటికీ వివిధ పాటల ఆల్బమ్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఒక ఐకానిక్ మ్యూజిక్ బ్యాండ్. దీని నుంచి విడుదలై ప్రతి మ్యూజిక్ హిట్. అలాంటి ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ లోగో డిజైన్ చూస్తే కంగుతింటారు. ఆ డిజైన్‌కి ప్రేరణ మన హిందువుల ఆరాధ్య దైవమైన కాళిమాత అట. 1962లో, ది రోలింగ్ స్టోన్స్ పేరుతో బ్రిటిష్ రాక్ బ్యాండ్ స్థాపించారు కొందరూ పాప్ గాయకులు. ఆ బ్యాండ్‌లోని సభ్యులు మిక్ జాగర్, కీత్ రిచర్డ్స్, బ్రెయిన్ జోన్స్, బిల్ వైమాన్, చార్లీ వాట్స్ తదితరులు. బ్రిటన్‌లో 1963 ఆ టైంలో వీరి బ్యాండ్ నుంచి విడుదలైన 'కమ్ ఆన్' అనే మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. దీంతో తమ బ్యాండ్ అని తెలిసేలా ఓ ప్రత్యేక లోగో ఉంటే బాగుంటుందని బ్యాండ్ సభ్యులు భావించారు. కానీ సరిగ్గా ఆ టైంలో ఉన్న యూరోపియన్ పర్యటన ఉండటంతో ఫేమస్ బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాన్ పాస్చేచే హడావిడిగా యూరప్‌లో ఉండే మిస్టీరియస్ స్టోన్స్నే లోగోగా డిజైన్ చేయడం జరిగింది. అయితే బ్యాండ్‌కి అనతి కాలంలో మంచి పేరు రావడంతో తమ మ్యూజిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీ గ్రాఫిక్‌ని డిజైన్ చేసేలా జాన్ పాస్చేకే మళ్లీ పని పురమాయించారు బ్యాండ్ సభ్యులు. అప్పుడే మంచి లేబుల్‌తో కూడిన లోగో ఉండాలి. అంది తమ బ్యాండ్ దర్పాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేట్టు ఉండాలనుకున్నారు బ్యాండ్ సభ్యులు. ఆ దిశగా రాక్ అండ్ రోల్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్ లోగోని ఆవిష్కరించమని పాస్చేకి చెప్పారు. అయితే ఆ బ్యాండ్ సభ్యుల్లో ఒకరైన మిక్ జాగర్‌ని కాళి దేవత రూపం ఎంతగానో ఆకర్షించింది. ఆ రూపం చిహ్నమైన నాలుక, పెదాలనే లోగోగా తీసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్నే డిజైనర్ జాన్ పాస్చేకే చెప్పి డిజైన్ చేయించాడు. ఆ బ్యాండ్ ధరించే టీ షర్ట్‌లపై కూడా ఆ లోగోనే ఉంటుంది. ఇక జాగర్‌కి హిందూ దేవత కాళిమాత గురించి ఎలా తెలిసిందంటే..తన తమ్ముడు ద్వారా తెలుసుకున్నాడు. ఆయన భారతదేశ పర్యటనలు చేస్తుంటాడు. అలా అతడు భారత్ నుంచి తెచ్చిన కొన్ని పుస్తకాలను జాగర్‌కి ఇస్తుండేవాడు. అందులో కనిపించిన కాళి మాత రూపం జాగర్‌ని బాగా ఆకర్షించింది. దీంతో ఆమె చిహ్నలతోనే లోగో తయారు చేయాలనే ఆలోచన జాగర్‌కి తట్టడం జరిగింది. ఆయన కోల్‌కతాలో కాళీ పూజలు చేసి వచ్చి మరీ ఈ లోగోని డిజైన్ చేయించుకున్నారట. ఈలోగో కాళిమాత విగతమైన నాలుక, పెదాలతో ఉంటుంది. అయితే అందరూ మత్రం ఆబ్యాండ్ అసలు సభ్యలైన గాయకుడు జాకర్ పెదాలుగా భావిస్తుంటారు. అసలు కాళీమాత అంటే.. ధిక్కారణ, స్థితిస్థాపకత, శక్తిని సూచిస్తుంది. అలానే తమ బ్యాండ్ ఉనికిని చాటుకుంటూ.. ప్రజలను ఆకట్టుకునేలా.. శక్తిమంతమైన మ్యూజిక్‌ని అందించే బ్యాండ్ అని అర్థం ఇచ్చేలా ఈ విధంగా లోగోని డిజైన్ చేయించినట్లు తెలిపారు. అందుకుగానూ డిజైనర్ పాస్చేకి అప్పట్లో సుమారు రూ. 5 వేల రూపాయలకు పైనే చెల్లించారట. అయితే 1976లో ఆ లోగో ఆ బ్యాండ్ అధికారిక చిహ్నంగా మారడంతో పాస్చేకి దాదాపు రూ.27 లక్షలు చెల్లించి మరీ కాపీరైట్ హక్కలును తీసుకుంది ది రోలింగ్ స్టోన్స్ బ్యాండ్.(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
బెంగాల్లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. కాళీమాతను బెంగాల్లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు. స్వామి ఆత్మస్థానంద శతజయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ.. రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద ఎంతో గొప్ప వ్యక్తి అయినా.. కాళీమాత పూజ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లాడిలా మారిపోయేవారని తెలిపారు. స్వామి ఆత్మస్థానంద కూడా కాళీమాతను పూజించేవారన్నారు. కాళీమాత తన దృష్టిలో మాంసం తిని మధ్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్లు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. చదవండి: కాళీమాత వివాదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -
'హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా?'
బెంగాల్: కాళీమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. బీజేపీపై విమర్శలతో విరుచకుపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆ పార్టీ ఏమైనా లీజుకు తీసుకుందా? అని ప్రశ్నించారు. ఏం చేయాలో కమలం పార్టీ ఇతరులకు ఎందుకు బోధిస్తోందని నిలదీశారు.. బెంగాలీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన ఎజెండాను, అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇతరులు దీన్ని ప్రతిఘటించి దేశం కోసం ఒక్కసారి మాట్లాడాలి' అని మహువా అన్నారు. బీజేపీ తన సొంత వెర్షన్ హిందూయిజాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయాలని చూస్తోందని మహువా మెయిత్రా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని హిందువులు వందల ఏళ్లుగా సుస్థిరమైన ఆచారాలను పాటిస్తున్నారని గుర్తు చేశారు. కాళీమాతను ఇలానే పూజించాలని బీజేపీ చెప్పడమేంటన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు కేవలం ఆ పార్టీకే చెందినవారు కాదన్నారు. హిందుత్వ రాజకీయాలను బలవంతంగా తమపై రుద్దాలని చూసిన బీజేపీని బెంగాల్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని మహువా అన్నారు. కాళీమాతను ఎలా పూజించాలో ఆ పార్టీ తనకు చెప్పొద్దని, 2000 ఏళ్లుగా తాము ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అన్నారు. ►చదవండి: TMC Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత -
చంపేస్తామంటూ బెదిరింపులు.. షకీబ్ క్షమాపణ
ఢాకా/కోల్‌కతా: కాళీమాత పూజలో పాల్గొనడంపై వివాదం చెలరేగడంతో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్షమాపణలు కోరాడు. తన మతాన్ని తాను గౌరవిస్తానని, తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కకుర్‌గచ్చిలో ఈ నెల 12న కాళీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షకీబ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతా నా ఇల్లు వంటిది. ఇక్కడికి వచ్చే ఏ అవకాశాన్ని నేను వదులుకోను. మనుషుల మధ్య బంధాలు అనేవి బలంగా ఉంటే ఎలాంటి భేద భావాలు ఉండవు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: అండర్-19 బంగ్లాదేశ్ మాజీ ఆటగాడి ఆత్మహత్య) ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ ఆల్‌రౌండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గం.. ముస్లిం అయి ఉండి పూజలో ఎలా పాల్గొంటావు అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ క్రమంలో మోషిన్ తలుక్దార్ అనే వ్యక్తి.. ఏకంగా షకీబ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షకీబ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. ముస్లిం అయినందుకు గర్విస్తున్నానని, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ‘‘నా మతాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ఆ వేదిక మీద మతం గురించి గానీ, అందుకు సంబంధించిన విషయాల గురించి గానీ నేను మాట్లాడలేదు. ఇస్లాం శాంతిని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తాను. నా మతాచారాలన్నింటిని పాటించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయితే తప్పు చేయడం మానవ సహజం. నేను కూడా అంతే. నా ప్రతీ పొరబాటును సరిచేసుకుంటూ ఉన్నతమైన ముస్లింగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అయితే ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. మనుషులను విడదీసే ఏ విషయం గురించైనా మాట్లాడకపోవడమే మంచిది. ఐకమత్యమే మహాబలం. ముస్లింలంతా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. నిజానికి ఆరోజు నేను పూజను ప్రారంభించలేదు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అంతే. పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం పూజను ఆరంభించారు. ఏదేమైనా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి’’ అని వివరణ ఇచ్చాడు. గత ఏడాది అక్టోబర్ 29న షకీబ్‌పై ఐసీసీ విధించిన బ్యాన్ గడువు నవంబర్ 10తో ముగిసిన విషయం తెలిసిందే. కాగా బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్గతేడాది అక్టోబర్ 29న షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఇందులో భాగంగా ఓ ఏడాది పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపింది. నవంబరు 10తో నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్ మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది. Youth from Sylhet threatens to slaughter Bangaldesh cricketer @Sah75official over his recent visit to a Kali Puja pandal in Kolkata last Thursday. Bangaldesh police have now arrested the person pic.twitter.com/RA3pnE3TFQ — Indrajit Kundu | ইন্দ্রজিৎ - কলকাতা (@iindrojit) November 17, 2020 -
కాళీమాత అభిషేకానికి భారీగా మనుషుల రక్తం
తిరువనంతపురం : పాలాభిషేకంతోపాటు వివిధ తైలాలతో ఆలయాలకు, అందులోని విగ్రహాలకు అభిషేకం చేయడం విన్నాం. కొన్ని ఆలయాల్లో జంతువులను బలిచ్చి వాటి రక్తంతో అభిషేకం చేయడం చూశాం.. ఇక మనుషుల రక్తంతో అభిషేకం చేయడం మాత్రం సినిమాల్లో మాత్రమే అప్పుడప్పుడు చూశాం. కానీ, విస్మయం చెందేలాగా కేరళలో చేసిన ఓ బహిరంగ ప్రకటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్కడి కాళీమాత ఆలయానికి అభిషేకం చేసేందుకు భారీగా రక్తం కావాలని, అందుకోసం భక్తులు వీలయినంత త్వరగా వారి రక్తాన్ని దానం చేసి పంపిచాలంటూ తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధుర అనే గ్రామ ఆలయ అధికారులు బహిరంగంగా ప్రకటన చేశారు. పోస్టర్లు కొట్టించారు. ఈ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో భాగంగా రక్తాభిషేకం చేయాల్సి ఉన్నందున భక్తులంతా త్వరగా వారి రక్తాన్ని దానం చేసి ఆలయానికి పంపించాలంటూ అందులో ప్రకటించారు. అంతేకాదు.. భక్తుల వద్ద నుంచి ప్రభుత్వ ఆమోదంపొందిన వైద్యులే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. మార్చి పన్నెండున సాయంత్రం 6గంటలకు ఈ ఉత్సవం జరగనుందట. ఆ నోటీసులో పేర్కొన్న ప్రకారం ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. మొత్తం పద్నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలోని రెండో రోజున కాళీమాతకు రక్తాభిషేకం నిర్వహిస్తారు. ఈ తంతును కాళీయుత్తు మహోత్సవం అని పిలుస్తారు. కాళీమాత ఆకలిని తీర్చే గొప్ప వేడుకగా దీన్ని పేర్కొంటారు. -
కెమెరా హమారా
నాలుగొందల ఏళ్ల చారిత్రక వైభవాన్ని ఒడిసిపట్టుకోవాలంటే ఎన్ని జతల కళ్లు అలసటను మర్చిపోవాలి? నవ నాగరిక వర్తమాన విశేషాలను నిక్షిప్తం చేసుకోవాలంటే ఎన్ని వందల కెమెరాలు క్లిక్‌మంటూనే ఉండాలి? మన సిటీ..ఫొటోగ్రాఫర్లకు పెన్నిధి అయింది అందుకే. అరుదైన ఛాయాచిత్రాల అపురూప‘భాగ్య’మైంది అందుకే. ..:: ఎస్.సత్యబాబు సంప్రదాయాలకు పెట్టని కోట లాంటి నగరమిది. అత్యాధునిక పోకడలకు పెట్టిన పేరు లాంటి సిటీ ఇది. ప్రార్థన మందిరాల్లో పవిత్ర సందేశాల నుంచి.. పబ్బుల్లో విచిత్ర సంగీతాల దాకా.. అడుగడుగునా వైవిధ్యమే. అణువణువునా వినూత్నమే. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు, అబ్బురపరిచే జీవనశైలులకు నిలయమైన ఈ నగరం సహజంగానే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ‘చేతి’నిండా పనిపెడుతోంది. ఎంత చూసినా, ఎన్నిసార్లు తీసినా తనివి తీరడం లేదంటున్నారు వేర్వేరు రంగాల్లో, వృత్తి వ్యాపకాల్లో మునిగితేలుతూ ప్రవృత్తిగా కెమెరాను చేతబట్టిన పలువురు సిటిజనులు. విశేషాలను వెతికే కళ్లు.. మనకు నిత్యం కనిపించే చారిత్రక కట్టడాలు, ప్రాంతాల్లోని ఎవరికీ తెలియని విశేషాలను వెతికిపట్టుకోవడమే తన క్లిక్కు కిక్ ఇస్తుందంటున్న బిజినెస్ మేన్ ఉదయన్... గోల్కొండ కోటలో పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరికీ అంతగా తెలియని కాళిమాత ఆలయాన్ని కెమెరాలో బంధించాడు. కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చెబుతున్న ఈ రెండు పెద్ద కొండరాళ్ల మధ్య ఉన్న కాళి టెంపుల్... వైవిధ్యంగా అనిపిస్తుంది. సిటీ ఆఫ్ లైట్... ‘హైదరాబాద్ ఒక కాంతివంతమైన నగరం. ఫొటోగ్రాఫర్లకు దారి చూపే లైట్లాంటిదీ సిటీ’ అంటాడు అవినాష్. లైట్ల వెలుతురులో బిర్లామందిర్ అందాలను, అవి హుస్సేన్‌సాగర్ నీళ్లలో ప్రతిఫలించే వైనాన్ని తన కెమెరాలో బంధించిన అవినాష్... సిటీకి సంబంధించి తాను తీసిన బెస్ట్ పిక్చర్లలో దీనికి స్థానం ఇస్తాడు. సికింద్రాబాద్‌కు 10కి.మీ దూరంలో ఉన్న మౌలాలి సమీపంలోని ఒక పర్వతం మీద నుంచి వెలుగులీనుతున్న సిటీ అందాన్ని కెమెరాలో బంధించిన చిత్రం కూడా తనకెంతో ఇష్టమైనదని చెబుతాడు. బుద్ధం చిత్రం గచ్ఛామి.. సిటీలో కెమెరా ఫస్ట్‌టైమ్ పట్టుకున్న ఎవరికైనా వెంటనే క్లిక్మనిపించాలనే స్పాట్లు.. ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, బుద్ధ విగ్రహం పరిసరాలు. ‘బుద్ధ విగ్రహం దాని చుట్టుపక్కల సాగర్ జలాలు నా ఫేవరెట్ స్పాట్. ఎన్ని సార్లు కెమెరాలో బంధించినా ఇంకా తీయాలనిపిస్తుంది’ అంటాడు కరణ్. తను తీసే ఫొటోల్లో ప్రొఫెషనలిజం కనబరిచే ఈ యువకుడు.. ఫొటోగ్రఫీ ప్రయోగాలకు సిటీ బెస్ట్ ప్లేస్ అంటున్నాడు. చార్మినార్.. కెమెరాకి ప్యార్... చార్మినార్ ప్రస్తావన తేని వాడు రాష్ట్ర చరిత్రకారుడెలా కాడో చార్మినార్ ఫొటో తీయని వాడు ఫొటోగ్రాఫర్ కాలేడంటోంది ఛాయా చిత్ర ప్రపంచం. ‘రంజాన్ సమయంలో చార్మినార్‌ను చూడాలంటే ఎన్ని కళ్లున్నా సరిపోవు. ఆ మెమొరీ కోసం ఎన్ని సార్లయినా కెమెరాను క్లిక్‌మనిపించవచ్చు’’అని చెప్పింది నమ్రత. కాలేజీ విద్యార్థిని అయిన ఈ యువతి... సిటీ ఫొటోగ్రాఫర్లకు హాట్‌స్పాట్ అంటోంది. చిత్రాల కోట రాజరిక వైభవానికి చిహ్నం లాంటి గోల్కొండ కోట నా ఫేవరెట్ స్పాట్ అంటాడు సమర్. తరచుగా గోల్కొండకు రౌండ్స్ కొట్టే ఈ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్... ఎంత తవ్వినా తరగని వి-చిత్రాల గనిగా నగరాన్ని అభివర్ణిస్తాడు. గోల్కొండ, దాని పరిసరాలను భిన్న కోణాల్లో చిత్రీకరించడం తనకిష్టమని చెబుతున్నాడు. -
పోరాడి మరీ సాధించుకున్నారు
దేశంలో దసరా నవరాత్రులు సందడిగా, ఘనంగా జరిగే ప్రాంతాల్లో కోల్‌కతా కూడా ముఖ్యమైనది. అక్కడ కొలువైన కాళీమాతకు ప్రతియేటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కోల్‌కతాలోని ప్రతివీధిలోనూ మంటపాలు ఏర్పాటు చేసి కాళీమాత ప్రతిమలను పెట్టుకొని పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంలోని కాళీమాతకు తోడు వీధుల్లోని కాళీ మాత మంటపాలు కోల్‌కతాకు కొత్త కాంతిని తీసుకు వస్తాయి. ఆ మహానగరంలో భిన్నమైన వర్గాల ప్రజలు తమకు చేతనైంత స్థాయిలో, ఇష్టమైనట్టుగా నవరాత్రుల వేడుకలను జరుపుకొంటారు. ఇది ఎన్నో యేళ్లుగా జరుగుతున్న ప్రక్రియే. ఈ మంటపాల విషయంలో ప్రభుత్వం, పోలీసులు కూడా సహకారాన్ని అందిస్తుంటారు. అయితే నవరాత్రి వేడుకల నిర్వహణ విషయంలో అందరికీ సహకారం అందించే పోలీసులు సోనాగంజ్ ప్రాంతంలోని కొంతమంది మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుకున్న విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చారు. అనుమతిని ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీనికి వారు చెప్పిన కారణం ఒక్కటే.. ‘మీరంతా సెక్స్‌వర్కర్లు. అందుకే అనుమతిని ఇవ్వడం లేదు...’ అవును.. సోనాగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళలంతా సెక్స్‌వర్కర్లే. కోల్‌కతాలో ప్రసిద్ధి పొందిన రెడ్‌లైట్ ఏరియా ’సోనాగంజ్’. అక్కడ పడుపువృత్తిలో ఉన్న మహిళలు నవరాత్రి మంటపాన్ని ఏర్పరుచుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దుర్బర్ మహిళా సమన్యాయ సమితి(డీఎమ్ఎస్సీ) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి ఇవ్వకపోవడం గురించి పోలీసు శాఖను ప్రతివాదులుగా చేర్చి వారు న్యాయపోరాటం చేసి మరీ, అనుమతిని సాధించుకొన్నారు. ఈ సందర్భంగా కోర్టు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి వారిలోని అనర్హత ఏమిటో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. అయితే ఎటువంటి సమాధానం లేదు వారిదగ్గర. దాంతో, తానే చొరవ తీసుకుని, నవరాత్రి మంటపాలు ఏర్పాటు చేయడం గురించి మార్గదర్శకాలను పరిశీలించి సెక్స్ వర్కర్లు ఏర్పాటు చేయదలిచిన మండ పానికి అనుమతి మంజూరు చేసింది. ఈ విధంగా దుర్గమ్మను కొలవడానికి సోనాగంజ్ మహిళలు అనుమతి సాధించుకొన్నారు.