![CP Anjani Kumar Instruction For Students At OU University - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/22/CP.jpg.webp?itok=pYxKESgq)
ఉస్మానియా యూనివర్సిటీ: ‘కాలానుగుణంగా ప్రభుత్వాలు, పరిస్థితులు, వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, జీవన విధానం మారుతూనే ఉంటాయి. మనం తొందరపడి చేసే ఆందోళన కార్యక్రమాలతో తెల్లారేలోగా మార్పులు సంభవించవు. ప్రజాస్వామ్యంలో లోపాలుంటే వాటి పరిష్కారం కోసం శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలపాలి. సమాజంలోని ప్రజల గురించి కూడా ఆలోచించాలి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండటం మంచిది. పోలీసులకు ఎవరిపైనా కోపం ఉండదు.
రాబోయే రోజుల్లో కాబోయే పాలకులు మీరే. సమయాన్ని వృథా చేయకుండా అవకాశాలను అందిపుచ్చు కోండి’అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు, విద్యార్థి నాయకులతో పోలీసు అధికారులు సమావేశం అయ్యారు. పలువురు విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధా నం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment