సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి | Stone pelting on Seemandhra Employees Bus in Khamma District | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి

Published Fri, Sep 6 2013 9:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

Stone pelting on Seemandhra Employees Bus in Khamma District

 
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం మండలపాడు వద్ద జరిగింది. రాళ్లదాడిలో చింతలపూడి ఈవోకు స్వల్పగాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనపై పెనుమల్లి పీఎస్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. 
 
ఇదిలాఉండగా, నల్గొండ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  హైదరాబాద్లో శనివారం జరిగేసభకు తెలంగాణవాదులు అడ్డుతగలకుండా చర్యలు తీసుకున్నారు.  జాతీయరహదారులపై 10-15 కి.మి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఐజీ నవీన్‌చంద్ తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement