అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని, విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌తో ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘అనంత’ ఉద్యోగ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. తెలంగాణ జేఏసీ నాయకులు 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చినా, ప్రభుత్వం ఆంక్షలు విధించినా జిల్లాలోని ఉద్యోగులు ఏమాత్రం లెక్క చేయలేదు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి రాజధానికి తరలివెళ్లారు. గెజిటెడ్ ఉద్యోగులు, రెవెన్యూ, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ, హెచ్‌ఎల్‌సీ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్, జేఎన్‌టీయూ, ఎస్కేయూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు 20 వేలమంది బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలలో వెళ్లారు. అనంతపురంతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తరలివెళ్లారు. వాహనాలకు బ్యానర్లు కట్టుకున్నారు. ‘విభజన వద్దు-సమైక్యాంధ్ర ముద్దు’, ‘జై సమక్యాంధ్ర -జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు.
ప్రాణాలైనా అడ్డేస్తాం
రాష్ర్టం విడిపోకండా సమైక్యాంగా ఉండేందుకు ఎందాకైనా పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలన ఫణంగా పెట్టేందుకు సిద్ధం. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమ నిర్వమణకు తెలంగాణ జేఏసీ అడ్డుంకులృ సష్టించడం సరికాదు. అలాంటి బెదిరింపులకు భయపడం. సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం చేసి తీరుతాం.
- నరసింహులు, విద్యా సంబంధ జేఏసీ కన్వీనర్
వారిది దురహంకారమే
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు అనుమతి ఇచ్చినా... అడ్డుకుంటామని తెలంగాణవాదులు చెప్పవడం వారి దురహంకారానికి నిదర్శనం. వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు. పోయేదారిలో ఎన్ని అడ్డంకులృ సష్టించినా ఎదుర్కొని సభావేదికకు చేరుకుంటాం. కార్యక్రమాన్ని విజయంతం చేసి తిరిగి వస్తాం. - రమణారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్
‘అనంత’ టు హైదరాబాద్
Published Sat, Sep 7 2013 4:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement