వారికి రాచ మర్యాదలు ...మాకు అవమానాలా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ సభ్యులను శాసనసభ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతి నిరాకరించటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య శాసనసభ్యుల హక్కులను కాలరాసిన చీకటి సందర్భమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సొంత గడ్డపై తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రల సభకు అనుమతి ఇచ్చిన... ప్రభుత్వం ...ర్యాలీకి అనుమతించకపోవటం దారుణమన్నారు. వారికి రాచ మర్యాదలు... మాకు అవమానాలా అంటూ ఈటెల మండిపడ్డారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో దీక్ష చేపట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోగా, దీక్షకు అసెంబ్లీ అధికారులు అనుమతించలేదు. దాంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోల సభ సీమాంధ్ర రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల సభకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు నిధులెక్కడవని ఆయన ప్రశ్నించారు. పోలీసుల చర్యలపై శాసనసభ స్పీకర్రు ఫిర్యాదు చేస్తామని హరీష్ రావుత తెలిపారు.