అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అమలాపురంలో ఈనెల 22న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించాలని కోనసీమ జేఏసీ నిర్ణయించింది. ఆదివారం రాత్రి జిల్లా జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధరావు ఆధ్వర్యంలో అమలాపురం కాటన్ అతిథిగృహంలో కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన కోనసీమ జేఏసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. అమలాపురం బాలయోగి ఘాట్‌లో ఈనెల 22న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. లక్షమందికి పైగా జనాన్ని సమీకరించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును ఈ సభకు ఆహ్వానించారు.