మానవపాడు, న్యూస్‌లైన్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హైదరాబాద్‌కు తరలివెల్లిన సీమాంధ్ర ఉద్యోగులు కొందరు తిరుగు ప్రయాణంలో మండలంలోని పుల్లూరు టోల్‌ప్లాజాపై దాడికి పూనుకున్నారు. టోల్‌చార్జీలు ఇవ్వబోమని కౌంటర్లు, కుర్చీలను ధ్వంసంచేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది.
టోల్‌గేట్ సిబ్బంది కథనం మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు సీమాంధ్రుల ఉద్యోగులు హైదరాబాద్‌లో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు పుల్లూరు టోల్‌ప్లాజా నుంచి భారీసంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో టోల్‌చార్జీలు చెల్లించమని కొందరు ఉద్యోగులు సిబ్బందితో వాదనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న టోల్‌ప్లాజాలకుటోల్‌చార్జీలు ఎక్కడా చెల్లించమని, తమకు అన్యాయం చేశారని దురుసుగా ప్రవర్తించారు. ‘ జై సమైక్యాంధ్ర’ అని నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో టోల్‌ప్లాజా యాజమాన్యం వారి వాహనాలను వదిలేసింది. ఇదిలాఉండగా.. తిరుగు ప్రయాణంలో కూడా శనివారం అర్ధరాత్రి తరువాత మరోసారి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు (ఏపీ 02 టీఆర్ 2299 మునిరత్నం ఎన్‌ఎంఆర్ ఓల్వో సెమీస్లీపర్)బస్సులో పుల్లూరు టోల్‌ప్లాజాకు చేరుకున్నారు. టోల్‌చార్జీలు ఇవ్వబోమని మళ్లీ వాదనకు దిగారు. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇంతలో కొందరు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేస్తూ కౌంటర్‌లోకి దూసుకెళ్లారు. అందులో ఉన్న సీసీ కెమెరాలను లాక్కెళ్తూనే.. 8వ నెంబర్ కౌంటర్‌ను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కంప్యూర్ ఆపరేటర్‌కు సమైక్యాంధ్ర జెండా చూపుతూ బెదిరించి వెళ్లిపోయారు. టోల్‌ప్లాజా స్టాఫ్‌గేట్‌ను, కుర్చీలను విరగొట్టి బస్సును పోనిచ్చారు. ఈ సంఘటన మొత్తం టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది.
పట్టించుకోని పోలీసులు: శనివారం అర్ధరాత్రి కళ్లముందే టోల్‌ప్లాజా కౌంటర్లను ధ్వంసంచేసిన పోలీసులు పట్టించుకోలేదు. దాదాపు 200 మంది పోలీస్ బలగాలు టోల్‌ప్లాజా చుట్టూ మోహరించినా లాభం లేకపోయింది. సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేస్తూ పోలీసుల ముందే టోల్‌ప్లాజాను ధ్వంసంచేసినా ఎవరిని వారించలేకపోయారు. కనీసం వారు ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య సెగ!
Published Mon, Sep 9 2013 5:03 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement