'సేవ్ ఆంధ్రప్రదేశ్'తో మార్మోగిన లోక్సభ | Lok Sabha adjourned again | Sakshi
Sakshi News home page

'సేవ్ ఆంధ్రప్రదేశ్'తో మార్మోగిన లోక్సభ

Published Fri, Aug 30 2013 12:40 PM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

లోక్సభ శుక్రవారం మరోసారి వాయిదా పడింది.


న్యూఢిల్లీ: లోక్సభ శుక్రవారం మరోసారి వాయిదా పడింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైంది. దాంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో లోక్సభ మార్మోగింది. అనంతరం ఆ నినాదాలు చేసుకుంటూ  ఎంపీలు లోక్సభ వెల్లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలు తమ వైఖరి మార్చుకోవాలని స్పీకర్ మీరాకుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అయినా సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ విజ్ఞప్తిని బేఖాతరు చేశారు. దాంతో సీమాంధ్ర ఎంపీల వ్యవహారిస్తున్న తీరు పట్ల స్పీకర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement