సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇవాళ(మంగళవారం) మొదలైన కాసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. ప్రారంభమైన 20 సెకండ్లకే లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడడం విశేషం.
అదానీ వ్యవహారంపై జాయింట్‌పార్లమెంటీ కమిటీని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్యానెల్ స్పీకర్ మిథున్‌రెడ్డిపై పేపర్లు చించివేశారు విపక్షాల సభ్యులు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారాయన. మరోవైపు పెద్దల సభ(రాజ్యసభ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
#BudgetSession: #LokSabha adjourned till 2:00 PM pic.twitter.com/qZksUIX54s
— SansadTV (@sansad_tv) March 28, 2023
Comments
Please login to add a commentAdd a comment