ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆర్టీసీ కార్మిక సంఘం నేత చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్యాంధ్ర సభలో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ..విభజన జరిగితే వెంటనే ఆర్టీసి మూత పడుతుంది అని అన్నారు. చిన్న రాష్ట్రాలలో ఆర్టీసిని నడపడం కష్టం అవుతుంది. అందువల్లనే స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వంలో భాగంగానే నడపవలసి వస్తుంది. అని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి కర్నూలును త్యాగం చేయబట్టే హైదరాబాద్ రాజధానిగా వెలుగుతోందని తెలిపారు. వేల కోట్ల రూపాయలను రాయలసీమ వాసులు నష్టపోయారని, రాజధాని వదులుకోవడమంటే మాటలు కాదని.. సమైక్య రాష్ట్ర కోసం రాయలసీమ వాసులు రాజధానిని వదులుకున్నారని..బళ్లారిని కూడా కోల్పోయామని, తుంగభద్రను వదలుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని.. సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చెప్పాలని కాంగ్రెస్ పెద్దలు చెప్పడాన్ని తప్పు పట్టారు. ఏమి కావాలో కోరుకోండని అంటున్న నేతలు కర్నూలు రాజధాని ఇస్తారా, అత్యంత విలువైన వనరులున్న బళ్లారి ప్రాంతాన్ని ఇస్తారా అని నిలదీశారు. హైదరాబాద్ ను కూడా కోల్పోతే అరవై ఏళ్ల తర్వాత కట్టుబట్టలతో బయటకు పోవాలా అని ప్రజలు నేతలను నిలదీస్తున్నారని. హైదరాబాద్ లో తప్పిస్తే..పదమూడు జిల్లాలలో ఎక్కడైనా అబివృద్ది జరిగిందా? ఒక పరిశ్రమ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతమంతా ఏడారి అవుతుందని ఆయన హెచ్చరించారు.
Published Sat, Sep 7 2013 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement