Nehru Museum Renamed BJP Congress War Of Words - Sakshi
Sakshi News home page

నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం..

Aug 16 2023 7:08 PM | Updated on Aug 16 2023 8:11 PM

Nehru Museum Renamed BJP Congress War of Words - Sakshi

ఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ(ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్‌) పేరు మార్పుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత చరిత్రలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని అంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ రాజరిక స్వభావంపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉన్న నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మార్చాలని ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకోగా.. నేడు అధికారికంగా అమలుపరిచారు.

ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ(NMML) పేరును ‘ప్రధానమంత్రి మెమోరియల్‌’(PMML)గా మార్చేశారు. నెహ్రూ పేరుతో ప్రధాని మోదీ అభద్రతా భావానికి గురయ్యారని.. నెహ్రూ వారసత్వాన్ని దెబ్బతీయాలని 'N' స్థానంలో 'P'ను పెట్టారని చెప్పారు. P అంటే కేవలం చిన్నతనం, దుఖం అనే భావమేనని అన్నారు. 

ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..

జైరాం రమేశ్ విమర్శలను ధీటుగా తిప్పకొట్టారు బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా. దేశ ప్రధానులందరి విజయాలను సూచించే నిర్మాణాలకు కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానులందరూ దేశం కోసం పనిచేశారని చెప్పారు. ఒక్క నిర్మాణానికి దేశ ప్రధానులందరి పేరు పెట్టినంత మాత్రాన  నెహ్రూ వారసత్వం దెబ్బతింటుందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భావజాలం ఏంటో అర్ధమవుతోందని అన్నారు

బ్రిటీష్ వారి కాలంలో సైన్యానికి అధిపతి కమాండర్ ఇన్ ఛీప్‌కు నిలయంగా ఉండేది ప్రస్తుతం నెహ్రూ మ్యూజియం. స్వాతంత్య్రం తర్వాత అది ప్రధాని నెహ్రూ నివాసంగా మారింది. ఆయన మరణాంతరం మ్యూజియంగా మార్చారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే.. మ్యూజియం ప్రాంగణంలో దేశ ప్రధానులందరి(నెహ్రూ-మోదీ) విజయాలు ప్రతిబింబించేలా ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని నిర్మించారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌..ఎల్జీ అభ్యంతరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement