Nehru Museum
-
నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ
న్యూడిల్లి: దేశ రాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ్యూజియం పేరు మార్పుపై స్పందిస్తూ నెహ్రుగారి గుర్తింపు ఆయన పేరులో కాదు ఆయన పనిలో ఉందని అన్నారు. లేహ్ వెళ్లబోయే ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మ్యూజియం పేరు మార్పుపై మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నెహ్రూ గారు ఆయన చేసిన పనికి ప్రసిద్ధి చెందారు తప్ప ఆయన పేరు వలన కాదని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇదే విషయంపై 'X' సోషల్ మీడియా వేదికగా రాస్తూ ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని విమర్శలు చేశారు. జైరాం రమేష్ తన X ఖాతాలో రాస్తూ.. ఈరోజు నుంచి ఒక దిగ్గజ సంస్థకు కొత్త పేరొచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇకపై ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పిలవబడుతుంది. అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ ప్రస్తావన వచ్చేసరికి ప్రధానికి ఎందుకో అనేక భయాలతోపాటు అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ప్రధానిది ఒక్కటే అజెండా నెహ్రూ ప్రతిష్టను మసక బారేలా చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి ఆ మహానేత ప్రస్థానాన్ని తెరమరుగయ్యేలా చెయ్యడమేనని రాశారు. జైరాం రమేష్ వ్యాఖ్యలకు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, జైరాం రమేష్ ఆలోచనలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకి చాలా వ్యత్యాసముంది. వాళ్ళ వరకు నెహ్రూ ఆయన కుటుంబం మాత్రమే పట్టింపు, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అలా కాదు.. అందుకే దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధానమంత్రులకు ఆయన ఈ మ్యూజియంలో సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు. From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 ఇది కూడా చదవండి: వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ -
నెహ్రూ మ్యూజియం కాదు.. ఇక ప్రధానమంత్రి మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్‌మూర్తి భవన్లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్) అని అధికారికంగా పేరు మార్చడం వివాదస్పదమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలు మంటలు చెలరేగాయి. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతూ ఉంటే, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. నెహ్రూ మ్యూజియం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే దీనిపై వివాదం రేగింది. కాగా మ్యూజియం పేరు మారుస్తూ సోమవారం నాడు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయి’’ అని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. 1966 , ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు. నెహ్రూని అప్రతిష్టపాల్జేయడమే మోదీ ఎజెండా: కాంగ్రెస్ నెహ్రూ వారసత్వాన్ని అప్రతిష్టపాల్జేయడమే ప్రధాని మోదీ ఎజెండా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని మోదీ అభద్రతా భావం, భయాందోళనల మధ్య నెహ్రూ మ్యూజియం పేరు మార్చారు. నెహ్రూ వారసత్వాన్ని విధ్వంసం చేయాలని ఆయన భావిస్తున్నారు. మ్యూజియం పేరులో ఎన్ స్థానంలో పీ అని మార్చారు. అందులో ‘‘పీ’’ అంటే చిన్నతనం, ఇబ్బంది పెట్టడం’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. నెహ్రూ పేరు మార్చారు కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్రను, భారత్‌ను లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆయన నడిపించిన విధానాన్ని చెరిపేయలేరని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రులందరి ఘనత చాటడానికే: బీజేపీ కాంగ్రెస్ చేసిన ఆరోపనల్ని బీజేపీ కొట్టిపారేసింది. దేశ ప్రధానమంత్రులందరి ఘనతలు ప్రపంచానికి చాటి చెప్పడానికే మ్యూజియం పేరుని మార్చినట్టు స్పష్టం చేసింది. లాల్‌బహదూర్ శాస్త్రి, పీ.వీ.నరసింహారావు, హెచ్.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఇలా ఎందరో భారత దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, ఈ మ్యూజియం ఏ ఒక్కరికో, ఒక కుటుంబానికో చెందినది కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. -
ఇక నెహ్రూ కాదు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
ఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎమ్ఎమ్ఎల్) పేరు మార్పుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత చరిత్రలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని అంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ రాజరిక స్వభావంపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉన్న నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మార్చాలని ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకోగా.. నేడు అధికారికంగా అమలుపరిచారు. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ(NMML) పేరును ‘ప్రధానమంత్రి మెమోరియల్’(PMML)గా మార్చేశారు. నెహ్రూ పేరుతో ప్రధాని మోదీ అభద్రతా భావానికి గురయ్యారని.. నెహ్రూ వారసత్వాన్ని దెబ్బతీయాలని 'N' స్థానంలో 'P'ను పెట్టారని చెప్పారు. P అంటే కేవలం చిన్నతనం, దుఖం అనే భావమేనని అన్నారు. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. జైరాం రమేశ్ విమర్శలను ధీటుగా తిప్పకొట్టారు బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా. దేశ ప్రధానులందరి విజయాలను సూచించే నిర్మాణాలకు కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానులందరూ దేశం కోసం పనిచేశారని చెప్పారు. ఒక్క నిర్మాణానికి దేశ ప్రధానులందరి పేరు పెట్టినంత మాత్రాన నెహ్రూ వారసత్వం దెబ్బతింటుందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భావజాలం ఏంటో అర్ధమవుతోందని అన్నారు From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 బ్రిటీష్ వారి కాలంలో సైన్యానికి అధిపతి కమాండర్ ఇన్ ఛీప్‌కు నిలయంగా ఉండేది ప్రస్తుతం నెహ్రూ మ్యూజియం. స్వాతంత్య్రం తర్వాత అది ప్రధాని నెహ్రూ నివాసంగా మారింది. ఆయన మరణాంతరం మ్యూజియంగా మార్చారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే.. మ్యూజియం ప్రాంగణంలో దేశ ప్రధానులందరి(నెహ్రూ-మోదీ) విజయాలు ప్రతిబింబించేలా ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని నిర్మించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
నెహ్రూ లైబ్రరీ ఇక ప్రధానమంత్రి లైబ్రరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీన్‌మూర్తి భవన ప్రాంగణంలో ఉన్న ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ పేరును కేంద్ర ప్రభుత్వం ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మార్చింది. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ప్రభుత్వం గత ఏడాది ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చిన సంగతి తెలిసిందే. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరును ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మారుస్తూ తీర్మానించినట్లు కేంద్ర సాంస్కృతిం శాఖ శుక్రవారం ప్రకటించింది. నెహ్రూ నుంచి మోదీ దాకా ప్రధానుల వివరాలు, వారి ఘనత, దేశ అభివృద్ధిలో వారి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ లైబ్రరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. సొసైటీ ఉపాధ్యక్షుడైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రూ తీన్‌మూర్తి భవన్లో 16 ఏళ్లకుపైగా 1964 మే 27న చనిపోయే దాకా ఉన్నారు. 1966లో ఇక్కడ ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ ఏర్పాటయ్యింది. అల్పబుద్ధిని చాటుకున్న ప్రభుత్వం: కాంగ్రెస్ నెహ్రూ లైబ్రరీ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అల్పబుద్ధిని చాటుకుందని అన్నారు. భవనాల పేరు మార్చినంత మాత్రాన మహోన్నత వ్యక్తుల పేరు ప్రఖ్యాతులను చెరిపివేయలేరని పేర్కొన్నారు. చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు. -
'ప్రతీకార చర్య..' నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై జైరాం రమేశ్ ఫైర్..
ఢిల్లీ:నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధోసంపత్తికి నిలయంగా ఉందని అన్నారు. అనేక పుస్తకాలకు,59 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. ఈ చర్య ప్రతీకారంతో కూడినదని ఆరోపించారు. 'భారతదేశ రూపశిల్పి పేరును, వారసత్వాన్ని రూపుమాపడానికి కావాల్సినవన్నీ ప్రధాని చేస్తున్నారు. సామాన్యుడు అభద్రతా భావంతో బతికేలా చేయడమే విశ్వగురువుగా అనాలా?' అని ప్రశ్నించారు. గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పేరు మార్చారు. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక భవనాన్నే మ్యూజియంగా మార్చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా.. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇదీ చదవండి:మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం -
‘నెహ్రూ స్మారకం’ వివాదం
న్యూఢిల్లీలో నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) కొలువై ఉన్న తీన్‌మూర్తి భవన్ స్వరూపస్వభావాలను మార్చాలనుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని, దీన్ని విరమించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా పనిచేసినప్పుడు నెహ్రూ తీన్‌మూర్తి భవన్‌లోనే ఉండేవారు. 1964లో నెహ్రూ కన్నుమూ శాక ఆయన స్మృతిలో ఎన్ఎంఎంఎల్ ఏర్పాటుచేసి తీన్‌మూర్తి భవన్ ప్రాంగణాన్ని అందుకు కేటాయించారు. మహానగరం నడిబొడ్డున 25 ఎకరాల విశాల ప్రాంగణంలో అది కొలువుదీరింది. ఎన్ఎంఎంఎల్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థే అయినా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. నవ భారత నిర్మాతగా దేశంపైనే కాదు...ప్రపంచంపై కూడా చెరగని ముద్రేసిన నెహ్రూను, ఆధునిక భారత చరిత్రను అధ్యయనం చేయటం కోసం దీన్ని స్థాపించినా ఇందులో మహాత్మా గాంధీ రచనలతోపాటు రాజగోపాలాచారి, సరోజినీ నాయుడు, బీసీ రాయ్, జయప్రకాష్ నారాయణ్ తదితరుల వ్యక్తిగత పత్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంగ ణంలో నెహ్రూ ప్లానిటోరియం, నెహ్రూ స్మారక డిజిటల్ లైబ్రరీ, నెహ్రూ స్మారక నిధి వంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రాంగణంలో తదనంతర కాల ప్రధానులకు కూడా చోటు కల్పించాలని ఎన్ఎంఎంఎల్ సొసైటీ కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. దీనిపై సర్వసభ్య సమావేశంలో వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగి తుది నిర్ణయం వాయిదా పడింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానికి లేఖ రాశారు. తమ దేశ నిర్మాణానికి కృషి చేసి దానికొక స్వరూపాన్నివ్వడానికి అహర్నిశలూ శ్రమపడిన నాయకులను గుర్తుంచుకోవటం, వారి వారసత్వం భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు అనువైన ఉన్నత స్థాయి సంస్థలను నెలకొల్పటం ఏ దేశం లోనైనా ఉండేదే. అయితే తీన్‌మూర్తి భవన్ ప్రాంగణంలో ఇతర ప్రధానులకు చోటు కల్పించటం నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించినట్టవుతుందా అన్నది ప్రధాన ప్రశ్న. నెహ్రూ పట్ల బీజేపీకి, దాన్ని నడిపిస్తున్న సంఘ్ పరివార్‌కు ఉండే అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. అందువల్లే తాజా ప్రయత్నాన్ని కాంగ్రెస్ శంకిస్తోంది. అయితే బీజేపీ నేతల వాదన వేరుగా ఉంది. అది ప్రధానికి కేటాయించిన ప్రాంగణం తప్ప నెహ్రూకు కేటాయించింది కాదని...పైగా ఎన్ఎంఎంఎల్ను 1964లో అక్కడ ప్రారంభించినా దాన్ని పాటియాల హౌస్‌కు తరలించాలని 1968లో ఇందిరా గాంధీ కేబినెట్ తీర్మానించిందని గుర్తు చేస్తోంది. అది నిజమే. అయితే ఆ నిర్ణయం అమలు కాలేదు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడు. అలాగని పార్టీ కేవలం ఆయన చెప్పుచేతల్లో మాత్రమే నడవలేదు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ లాంటి వారు సైతం పార్టీని ప్రభావితం చేశారు. ఆయనపై అలిగారు. తిరుగుబాటు చేశారు. స్వాతంత్య్రానంతరం కూడా ఆ ధోరణి కొనసాగింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్టీలో ఎదురులేని నేతగా రూపుదిద్దుకున్నా సర్దార్ పటేల్, బీసీ రాయ్, కామరాజ్ నాడార్ వంటి నేతలు సైతం తమ తమ స్వతంత్ర దృక్పథాలతో పార్టీపై ముద్రవేశారు. దేశ విభజన అనంతరం నెహ్రూ ప్రధానిగా ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలోనూ ఇది కొనసాగింది. విభజనానంతరం అనేకచోట్ల మత ఘర్షణలు పెల్లుబికాయి. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచాలన్న ఉద్యమాలు, తమ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తామని చెప్పే సంస్థానాధీశులు, కశ్మీర్ సమస్య, తీవ్ర పేదరికం, సామాజిక అసమానతలు, ఆర్థిక ఒడిదుడుకులు... వీటన్నిటినీ నెహ్రూ ప్రభుత్వం ఎదుర్కొనవలసి వచ్చింది. చైనాతో సరిహద్దు తగాదా, చివరికది యుద్ధానికి దారితీయటం, అందులో ఓటమి సంభవించటం లాంటి పరిణామాలు సంభవించాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే పంచవర్ష ప్రణాళికలొచ్చాయి. పారిశ్రామికీకరణ మొదలైంది. ఆనకట్టల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఉన్నతశ్రేణి సాంకేతిక విద్యాసంస్థల నిర్మాణం జరిగింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. అయితే ఈ కాలంలో తీసుకున్న అనేక నిర్ణయా లపై విమర్శలున్నాయి. సోవియెట్ అనుసరిస్తున్న పంచవర్ష ప్రణాళికల్లోని లోటుపాట్లేమిటో చూడ కుండానే వాటిని మన దేశానికి వర్తింపజేశారని, అవి దేశ ప్రగతికి అవరోధమయ్యాయని నెహ్రూ వ్యతిరేకులంటారు. ఉన్నత విద్యపై ఆయన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినా ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలున్నాయి. మానవ వనరుల సామర్థ్యాన్ని విద్య ద్వారా పెంచ డానికి తగినంత కృషి చేయకపోవటం వల్ల అనంతరకాలంలో అది దేశ ప్రగతికి, పేదరిక నిర్మూ లనకు అవరోధమైందని చెబుతారు. ఇక కేరళలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం వంటి చర్యలు నెహ్రూ ప్రజాస్వామిక దృక్పథాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇలా అనుకూల, ప్రతికూల అంశాలన్నిటిపైనా లోతైన చర్చ సాగడానికి, వాటినుంచి గుణపాఠాలు తీసుకోవడానికి ఎన్ఎంఎంఎల్ వంటివి తోడ్పడతాయి. నిజానికి నెహ్రూ విధానాల నుంచి అనంతర కాలంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు క్రమేపీ దూరం జరుగుతూ వచ్చాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే 1991లో ఆర్థిక సంస్క రణలు ప్రారంభించింది. ప్రణాళికా సంఘం ఎన్డీఏ సర్కారు వచ్చాకే రద్దయినా దానికి బీజాలు ఆ ఆర్థిక సంస్కరణల్లోనే ఉన్నాయి. ప్రణాళికా సంఘం ఎప్పుడో నామమాత్రావశిష్టంగా మారింది. నెహ్రూతోపాటు అనంతరకాల ప్రధానులను సైతం గుర్తించి గౌరవించాలన్న నిర్ణయాన్ని తప్పు బట్టాల్సింది లేదు. అయితే వారికి కూడా ఆ ప్రాంగణంలోనే చోటివ్వాలని పట్టుబట్టడంలో అర్ధం లేదు. నెహ్రూ కన్నుమూసేవరకూ అది ఆయన నివాసంగా ఉంటూ వచ్చింది గనుక దాన్ని ఆయన స్మృతి చిహ్నంగానే ఉంచి మరోచోట ఇతర ప్రధానుల కోసం స్థలాన్ని కేటాయించవచ్చు. ఉద్దేశ పూర్వకంగా, కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలిగించటం మంచిది కాదు. -
నెహ్రూ మ్యూజియంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)లో భారత మాజీ ప్రధానులందరికీ కేంద్రం చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనీ, మొత్తం దేశానికి సంబంధించిన వారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్ఎంఎంఎల్ ఉన్న తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో జోక్యం చేసుకోవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మన్మోహన్ లేఖ రాశారు. ‘ప్రజల మనోభావాలను గౌరవించి తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఉన్న నెహ్రూ స్మారక మ్యూజియంను అలాగే ఉంచండి. దీనివల్ల దేశ చరిత్రను, వారసత్వాన్ని గౌరవించినవారు అవుతారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం దేశానికి సంబంధించినవారు. నెహ్రూ ఔన్నత్యం, గొప్పతనాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం దీన్ని మార్చాలనుకుంటోంది’ అని మన్మోహన్ లేఖలో తెలిపారు. భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశం, ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపారని మన్మోహన్ వెల్లడించారు. -
నెహ్రూ మ్యూజియం,గాంధీ స్మృతి పునర్వ్యవస్థీకరణ
మోదీ ప్రభుత్వ నిర్ణయం; కాంగ్రెస్ మండిపాటు న్యూఢిల్లీ: గాంధీ స్మృతి, లలిత కళా అకాడెమీ, నెహ్రూ స్మారక మ్యూజియం, గ్రంథాలయం(ఎన్ఎమ్ఎమ్ఎల్) సహా 39 ప్రముఖ సంస్థలను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని కేంద్రం నిర్ణయించింది. సమకాలీన ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబించేలా వాటిలో మార్పులు చేస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కూడా అందులో భాగంగా ఉంటాయని, తద్వారా ఆ సంస్థలను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆ సంస్థల స్థాపన ఉద్దేశాలు కొనసాగుతాయని అన్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్తీవ్రంగా స్పందించింది. అది క్రూరమైన ఆలోచన అని, దాన్ని ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేసింది. ఆ నిర్ణయం దేశ వారసత్వ, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే ఆయా సంస్థల స్ఫూర్తిని, ఖ్యాతిని పలుచన చేసే కుట్ర అని పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. ‘ఎలాంటి ఘన వారసత్వ చరిత్రా లేని బీజేపీ, ఆరెస్సెస్‌లు స్వాతంత్య్ర పోరాటమనే ఘన వారసత్వ చరిత్రను తప్పుగా, అసంబద్ధంగా పునర్లిఖించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వలస పాలనపై పోరాటానికి, స్వాతంత్య్రానంతరం లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశంగా భారత్ రూపాంతరం చెందడానికి ప్రతీకగా నిలిచిన ఎన్ఎమ్ఎమ్ఎల్లో మార్పులు చేయాలనే ఆలోచన దారుణం. మ్యూజియం అంటేనే గత చరిత్రకు సాక్ష్యం. దాన్ని సమకాలీనతకు ప్రతిబింబంగా ఎలా మారుస్తారు? ప్రభుత్వ ప్రచార సాధానాలుగా ఎలా వాడుకుంటారు?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరోపణలను మంత్రి మహేశ్ శర్మ కొట్టిపారేశారు. నెహ్రూని కానీ, ఆయన ఆలోచనలను తక్కువ చేసే ఆలోచన తమకు లేదన్నారు. ఎన్ఎమ్ఎమ్ఎల్కు సంబంధించినంత వరకు ఆ భవనం, ఆడిటోరియం, గ్రంథాలయాలను నూతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా సంస్థల పేర్లు మార్చే ఆలోచన కూడా లేదన్నారు. -
గిరిగీతలు నగరికి
హత్తుకున్న ధన్యులు! వేష, భాష, నడక, నడతల్లోనే కాదు కళల్లోనూ కృత్రిమత్వానికి బహుదూరం! చిత్రరచనలోనూ వాళ్ల కుంచె ప్రకృతినే ప్రస్తుతిస్తుంది. అధునాతన హంగులు అద్దుకోని ఆ రంగులు గిరి దాటి నగరికి చేరుతున్నాయి. ఆ సహజ కళను నాగరిక ప్రపంచానికి పరిచయం చేయాలనే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా ‘ఆదిచిత్ర’ పేరుతో గిరిజన చిత్రకళాప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఈసారి దీనికి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తోంది. మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోని నెహ్రూ మ్యూజియం వేదికగా ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది. ప్రత్యేకమైన కళ గిరిజన చిత్రాలు ప్రత్యేకమైనవి. నిజానికి వీళ్ల చిత్రకళకు వాళ్ల గుడిసెల గోడలే క్యాన్వాసులు. వాళ్లు కొలిచే దేవుళ్లు, దైనందిన జీవితం, అది సాఫీగా సాగడానికి ప్రకృతిని వాళ్లు కోరే దీవెనలే.. ఆ కళకు వస్తువులు! జీవం ఉట్టిపడే ప్రతిగీతకు ప్రకృతి ప్రసాదించిన రంగులే అదనపు హంగులు సమకూరుస్తాయి. ఈ అందాలన్నీ ఈ చిత్రప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గోండులు, పర్ధానులు, పిథోరా, కోయ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సవర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రత్వా, భిలాల, నాయక్, భిల్ తెగల గిరిజన కళాకారులు పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘నాయకపోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించనున్నారు. టైఫెడ్.. ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కేంద్ర గిరిజనశాఖ అనుబంధ సంస్థ) గిరిజన ఉత్పత్తులు, హస్తకళలను ప్రమోట్ చేయడానికి.. వాటికి మార్కెటింగ్ కల్పించడానికి ఏర్పడిన సంస్థ. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ గిరిజన సంక్షేమానికే వినియోగిస్తారు. ఇక్కడ ‘ఆదిచిత్ర’ను నిర్వహిస్తున్నది ఈ టైఫెడే. ఈ చిత్ర కళాప్రదర్శనలో పాల్గొంటున్న వారంతా ఆదివాసీలే.