ఢిల్లీ:నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. నెహ్రూ మ్యూజియం ప్రపంచ మేధోసంపత్తికి నిలయంగా ఉందని అన్నారు. అనేక పుస్తకాలకు,59 ఏళ్ల చరిత్రకు సాక్ష‍్యంగా ఉందని చెప్పారు. ఈ చర్య ప్రతీకారంతో కూడినదని ఆరోపించారు.
'భారతదేశ రూపశిల్పి పేరును, వారసత్వాన్ని రూపుమాపడానికి కావాల్సినవన్నీ ప్రధాని చేస్తున్నారు. సామాన్యుడు అభద్రతా భావంతో బతికేలా చేయడమే విశ్వగురువుగా అనాలా?' అని ప్రశ్నించారు.
గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో పేరు మార్చారు. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక భవనాన్నే మ్యూజియంగా మార్చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా.. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఇదీ చదవండి:మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment