న్యూడిల్లి: దేశ రాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ్యూజియం పేరు మార్పుపై స్పందిస్తూ నెహ్రుగారి గుర్తింపు ఆయన పేరులో కాదు ఆయన పనిలో ఉందని అన్నారు.
లేహ్ వెళ్లబోయే ముందు ఢిల్లీ ఎయిర్పోర్టులో మ్యూజియం పేరు మార్పుపై మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నెహ్రూ గారు ఆయన చేసిన పనికి ప్రసిద్ధి చెందారు తప్ప ఆయన పేరు వలన కాదని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇదే విషయంపై 'X' సోషల్ మీడియా వేదికగా రాస్తూ ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని విమర్శలు చేశారు.
జైరాం రమేష్ తన X ఖాతాలో రాస్తూ.. ఈరోజు నుంచి ఒక దిగ్గజ సంస్థకు కొత్త పేరొచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇకపై ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పిలవబడుతుంది. అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ ప్రస్తావన వచ్చేసరికి ప్రధానికి ఎందుకో అనేక భయాలతోపాటు అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ప్రధానిది ఒక్కటే అజెండా నెహ్రూ ప్రతిష్టను మసక బారేలా చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి ఆ మహానేత ప్రస్థానాన్ని తెరమరుగయ్యేలా చెయ్యడమేనని రాశారు.
జైరాం రమేష్ వ్యాఖ్యలకు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, జైరాం రమేష్ ఆలోచనలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకి చాలా వ్యత్యాసముంది. వాళ్ళ వరకు నెహ్రూ ఆయన కుటుంబం మాత్రమే పట్టింపు, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అలా కాదు.. అందుకే దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధానమంత్రులకు ఆయన ఈ మ్యూజియంలో సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.
From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023
Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first…
ఇది కూడా చదవండి: వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment