Jawahar lal nehru
-
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?
బడ్జెట్ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పడింది.1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్లను సమర్పించారు.1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు.ఇదీ చదవండి: 'ఇన్కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది. -
Chandrayaan -3: ఇదంతా నెహ్రూ ఘనతే: చత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్: మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపనున్న నేపధ్యంలో చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయమని ఈ ఘనత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూదేనని వ్యాఖ్యానించారు. భారతదేశం చంద్రయాన్-3 విజయవంతమవుతున్న వేళ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఇది గొప్ప విజయమని చెబుతూ ఈ ఘనత మొత్తం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1962లో నెహ్రూ హయాంలోనే స్థాపించబడిందని అప్పట్లో దీనిని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా పిలిచేవారని అన్నారు. ఆయన ముందుచూపుతో వ్యవహరించబట్టే ఈరోజు ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. మరికొద్ది గంటల్లో యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిని చేరుకోగా భారతదేశం ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలవనుంది. #WATCH | On Chandrayaan-3, Chhattisgarh CM Bhupesh Baghel says, "It's a big achievement for the country and the hard work of our scientists. 'Jo Aadharshila (foundation stone) Nehru Ji ne rakha, aaj world mein danka baja raha hai'. Best wishes to our scientists." (22.08) pic.twitter.com/KrGMuAJ29U — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 22, 2023 ఇది కూడా చదవండి: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చంద్రయాన్–3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడే -
నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ
న్యూడిల్లి: దేశ రాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ్యూజియం పేరు మార్పుపై స్పందిస్తూ నెహ్రుగారి గుర్తింపు ఆయన పేరులో కాదు ఆయన పనిలో ఉందని అన్నారు. లేహ్ వెళ్లబోయే ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మ్యూజియం పేరు మార్పుపై మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నెహ్రూ గారు ఆయన చేసిన పనికి ప్రసిద్ధి చెందారు తప్ప ఆయన పేరు వలన కాదని అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇదే విషయంపై 'X' సోషల్ మీడియా వేదికగా రాస్తూ ప్రధాన మంత్రి ఎంత ప్రయత్నించినా స్వాతంత్రం సమయంలో నెహ్రూ సాధించిన ఘనతలను సాధించలేరని విమర్శలు చేశారు. జైరాం రమేష్ తన X ఖాతాలో రాస్తూ.. ఈరోజు నుంచి ఒక దిగ్గజ సంస్థకు కొత్త పేరొచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇకపై ప్రధానమంత్రి మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పిలవబడుతుంది. అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నెహ్రూ ప్రస్తావన వచ్చేసరికి ప్రధానికి ఎందుకో అనేక భయాలతోపాటు అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ప్రధానిది ఒక్కటే అజెండా నెహ్రూ ప్రతిష్టను మసక బారేలా చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చి ఆ మహానేత ప్రస్థానాన్ని తెరమరుగయ్యేలా చెయ్యడమేనని రాశారు. జైరాం రమేష్ వ్యాఖ్యలకు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, జైరాం రమేష్ ఆలోచనలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకి చాలా వ్యత్యాసముంది. వాళ్ళ వరకు నెహ్రూ ఆయన కుటుంబం మాత్రమే పట్టింపు, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అలా కాదు.. అందుకే దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన అందరు ప్రధానమంత్రులకు ఆయన ఈ మ్యూజియంలో సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు. From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 ఇది కూడా చదవండి: వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ -
నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide . — Subramanian Swamy (@Swamy39) August 3, 2022 చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్ భూభాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. చదవండి: కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం! -
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
-
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
సాక్షి, హైదరాబాద్: నవంబరు 14 అనగానే చిన్నారులకు ఇష్టమైన పండుగ బాలల దినోత్సవం గుర్తుకొస్తుంది. చేతిలో జెండాలు, గుండెలమీద గులాబీలతో ఉత్సాహం ఉరకలు వేసే చిన్నారులు మన కళ్ల ముందు కదలాడతారు. మరోవైపు గనుల్లో, కార్ఖానాల్లో, ఇటుకబట్టీల్లో, గొడ్ల సావిళ్లలో, టీ దుకాణాల్లో మగ్గిపోతున్న బాల్యం. 75 వసంతాల అమృత మహోత్సవాల వేళ కనీస చదువుకు దూరమై, కట్టుబానిసల్లా బతుకులీడుస్తున్న దైన్యం. మరి వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న భావి భారతానికి నిజమైన బాలల పండుగ ఎపుడు? ఇపుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రత్యేకగా వేడుకలు నిర్వహించు కుంటాం. పిల్లలు స్వాత్రంత్య సమరయోధుల వేషధారణలో తమను తాము చూసుకొని మురిసిపోతారు. భావి భారతంకోసం ఎన్నో కలల్లో మునిగిపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ శుభవేళ రేపటి పౌరులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా దారిద్ర్యంలో మగ్గిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మిలియన్లకొద్దీ బాలల భవిష్యత్‌ను కాలరాస్తున్న బాల కార్మిక వ్యవస్థ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బడిలో ఉండాల్సిన బాల భారతం వెట్టి చాకిరీలో మగ్గిపోతోంది. ఇక నైనా వారి జీవితాల్లో మార్పు రావాలని, వెలుగులు నిండాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. -
మీ ముత్తాతను అడుగు: రాహుల్‌కు కేంద్రమంత్రి కౌంటర్
న్యూఢిల్లీ: చైనాకు భారత భూభాగాలు అప్పగించారని.. లేదు అంగుళం ఇవ్వడం లేదని అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. చైనాకు భారత భూభాగాలు ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. చైనా ప్రవేశించిన డెప్సాంగ్ మైదానాలపై రాజ్‌నాథ్ సింగ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ భారత సైన్యం త్యాగాలను పక్కనపెట్టి, ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయగా దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు బదులిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. చైనాకు భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారనేది మీ ముత్తాతను (జవహర్ లాల్ నెహ్రూ)ను అడగాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూగాన్ని చైనాకు అప్పగించారనే రాహుల్ వ్యాఖ్యలపై ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. చైనాకు భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారనేది మీ ముత్తాతను అడిగితే సమాధానం తప్పకుండా తెలుస్తుందని పేర్కొన్నారు. దేశభక్తి ఎవరికి ఉందో.. ఎవరికి లేదో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. భారతదేశ భూభాగం ఎవరి హయాంలో అక్రమణకు గురైందో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. He must ask his grandfather (Jawaharlal Nehru) about who has given India's territory to China, he will get the answer.. Who is a patriot and who is not, the public knows it all: MoS Home G Kishan Reddy on Rahul Gandhi's recent remarks on PM and India-China disengagement pic.twitter.com/0z4gLHAnNb — ANI (@ANI) February 12, 2021 ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం -
ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్ షా
సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తనపై చేసిన ఆరోపణలపై అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లోని శాంతికేతన్ పర్యటన సందర్భంగా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చీలో కూర్చొని అమిత్ షా అగౌరవపరిచారంటూ కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. దీనిపై స్పందించిన అమిత్ షా..తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, సీనియర్ నేత అయ్యిండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలే రవీంద్రనాథ్ ఠాగూర్ని అవమానించారని, ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. (మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన) గతంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ.. ఠాగూర్ కుర్చీలో కూర్చున్నారని, రాజీవ్ గాంధీ అక్కడ టీ కూడా సేవించారని షా తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన అనంతరం ఠాగూర్‌ను ఎవరు అగౌరవపరిచారో చెప్పాలని సవాల్ విసిరారు. తాను సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడానికి కిటికీ వద్ద కూర్చున్నానని, గతంలో ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ గాంధీ కూడా అక్కడ కూర్చున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అమిత్ షా సభ ముందు ఉంచారు. మరోవైపు షాపై అధిర్ రంజన్ చౌదరి చేసిన ఆరోపణల్ని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ బిద్యూత్ చక్రవర్తి కూడా తోసిపుచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. (గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ కన్నీరు) -
పండిట్ నెహ్రూపై విరుచుకుపడ్డ జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ : జన సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ మృతిపై విచారణ జరిపేందుకు దేశ తొలి ప్రధాని జవహరల్‌లాల్ నెహ్రూ నిరాకరించారని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా విమర్శించారు. ముఖర్జీ మృతిపై విచారణ జరిపించాలని దేశం యావత్తూ డిమాండ్ చేసినా పండిట్ నెహ్రూ అందుకు అంగీకరించలేదని చరిత్రే దీనికి ఆధారమని దుయ్యబట్టారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం వృధా కాదని, ఆయన సిద్ధాంతాలకు బీజేపీ కట్టుబడి ఉందని నడ్డా స్పష్టం చేశారు. ముఖర్జీ వర్ధంతి సందర్బంగా నడ్డా మాట్లాడుతూ దివంగత నేత ప్రదర్శించిన జాతీయవాదం దేశానికి సరైన దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. పండిట్ నెహ్రూ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ముఖర్జీ కాంగ్రెస్ పార్టీని వీడారని చెప్పారు. మరోవైపు డాక్టర్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, పలువురు బీజేపీ సీనియర్ నేతలు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. -
నెహ్రూ బీఫ్ తినేవారు.. ఆయన పండిట్ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బీఫ్ (పశుమాంసం), పందిమాంసం తినేవారని, ఆయన అసలు పండిటే కాదని రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్‌దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్వార్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాంసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రు పేరు ముందు పండిట్ అని చేర్చింది’ అని వ్యాఖ్యానించారు. అహూజా ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కులం పేరును వాడుకొంటుందని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలెట్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేవాలయాలను దర్శించుకోవడం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచే నేర్చుకున్నారని ఆయన తెలిపారు. అహుజా ఇదివరకు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవును చంపుట ఉగ్రవాదం కన్న పెద్ద నేరమని, హిందు బాలికలను లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు బలవంతంగా మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ గతంలో పేర్కొన్నారు. దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులకు 50శాతం బాధ్యత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులదే అని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. -
మోదీకి చరిత్ర చెప్పే మగాడే లేడా?!
సాక్షి, న్యూఢిల్లీ: మండుటెండలను కూడా లెక్కచేయకుండా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాపం! వడ దెబ్బ తగిలినట్లుంది. మెదడు పనిచేయట్లేదనుకుంటా! చరిత్రకు సంబంధించి ఏవో అవాకులు, చెవాకులు చెబుతున్నారు. అవి విన్నవాళ్లు అవాక్కవడమే కాదు, పిచ్చెక్కి జుట్టు పీక్కుంటున్నారు. ‘అరే, మోదీ గారికి చరిత్రను సరిగ్గా చెప్పే మాస్టారుని వెతకండ్రా!’ అంటూ కొందరు తిరుగుతున్నారు. కొందరేమో ఇలా....ట్వీట్ల మీద ట్వీట్లు విసురుతున్నారు. ‘రాజకీయాల కోసం చరిత్రను అడ్డదిడ్డంగా వక్రీకరించకండి, జైల్లో భగత్ సింగ్, ఆయన అనుచరులను నెహ్రూ కలుసుకోవడమే కాదు. ఆ తర్వాత వారి గురించి తన రచనల్లో పేర్కొన్నారు కూడా.........ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు! దయచేసి మమ్మల్ని ఇంకా ఇలా ఇబ్బంది పెట్టకండీ, తట్టుకోలేకపోతున్నాం. అయినా ఇది మీ తప్పుకాదు లెండీ, మీ పరిశోధక బందం పనితీరు అలా ఉందండీ, నెహ్రూ 1929, జూన్ లేదా ఆగస్టులో లాహోర్ జైలులో భగత్ సింగ్‌ను కలుసుకున్నారు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను........రాహుల్ గాంధీ భారత దేశ స్వాతంత్య్ర యోధుడు భగత్ సింగ్‌ను కలుసుకోకుండా జైల్లో ఉన్న లాలూను కలుసుకోవడం ఏమిటీ? అన్నది మీ ప్రశ్నగదా! ఎవరికి అర్థం కావండం లేదు.......అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పుట్టుకొస్తున్నాయి. ‘దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ జైలుకెళ్లిన భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్‌లను జైల్లో ఏ కాంగ్రెస్ నాయకుడైనా వెళ్లి కలుసుకున్నారా? జైలుకెళ్లిన అవినీతిపరులను మాత్రం కలుసుకోవడానికి వారికి సమయం కుదురుతుంది. అంటే కాంగ్రెస్ అవినీతిపరులనే సమర్థిస్తుంది. నేను అనుమతించను’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం కర్ణాటకలోని బీదర్‌లో మాట్లాడుతూ లాలూను రాహుల్ కలుసుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వెబ్సైట్లో కూడా ఈ వ్యాఖ్యలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. నెహ్రూ, భగత్ సింగ్, ఆయన అనుచరులను కలుసుకోవడమే కాకుండా వారి గురించి ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ వాల్యూమ్–4’ రాశారు. కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన న్యాయవాది అసఫ్ అలీ, భగత్ సింగ్ తరఫున వాదించారు. అయినా లాభం లేకపోయింది. 1931, మార్చి 23న భగత్‌ను ఉరితీశారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌ను స్వాతంత్య్ర యోధునిగా కూడా మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఆయన పుస్తకాలు రాశారు తప్ప, ప్రత్యక్షంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు. నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ‘జైల్లో ఉన్న భగత్ సింగ్‌ను కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు. భగత్ తరఫున వాదించిన న్యాయవాది కూడా కాంగ్రెస్ నాయకుడే. నీవాళ్లెవరో నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. యడ్యూరప్పను, గాలి సోదరులను మాత్రం కాంగ్రెస్ నాయకులు కలుసుకోలేదు. అది మాత్రం వాస్తవం. అవాకులు, చెవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకో!’ అని ట్వీట్ చేసింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనుభవం ఆరెస్సెస్‌కు లేకపోవడం వల్ల మోదీకి వాస్తవాలు తెలియడం లేదు..... జైల్లో ఉన్న భగత్ సింగ్‌ను కాంగ్రెస్ ఎందుకు కలుసుకోలేదు? ఎం. కృష్ణన్ మీనన్‌ను నెహ్రూ ఎందుకు అవమానించారు? పటేల్‌ను కాంగ్రెస్ ఎందుకు పీఎంను చేయలేదు? అంబేద్కర్‌కు వ్యతిరేకంగా నెహ్రూ ఎందుకు ప్రచారం చేశారు?–నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు 1952...... భగత్ సింగ్‌ను కలుసుకునేందుకు లాహోర్ జైల్లోకి నెహ్రూ జొరబడ్డారంటే, కర్ణాటక ఎన్నికల్లో మోదీని ఓడించడానికి పాక్‌తో కలిసి కుట్ర పన్నడమే......అంటూ ట్వీట్లు పేలుతూనే ఉన్నాయి. అదేమోగానీ మొదటి నుంచి నరేంద్ర మోదీ చరిత్రకు సంబంధించి అంశాలను తప్పుగానే చెబుతున్నారు. మొన్నటికి మొన్ను కరియప్ప, తిమ్మయ్యల గురించి తప్పుగా మాట్లాడినా ఆయన ఆ మధ్య కోణార్క్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు దాన్ని రెండువేల ఏళ్ల క్రితమే నిర్మించారని చెప్పారు. వాస్తవానికి దాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. కోణార్క్పై విగ్రహాలను చూస్తూ మన శిల్పకారులు ఆనాడే ఆధునిక మహిళ వేసుకునే స్కర్టు, హ్యాండ్ బ్యాగ్‌లను ఊహించి శిల్పాలు చెక్కారని తెగ మెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ విగ్రహాలకు వస్త్రాలే లేవు. అక్కడ అచ్చాదనగా ధరించిన నగల వరుసను చూసి మోదీ భ్రమపడ్డారు. 2014, ఫిబ్రవరిలో కూడా మోదీ ఓసారి భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ అండమాన్, నికోబార్‌లోని సెల్యూలార్ జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఆయన తొలుత ఢిల్లీ జైలులో, ఆ తర్వాత లాహోర్ జైలులో ఉన్నారు. -
నెహ్రూ, వాజ్‌పేయిలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత అశుతోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆయా నేతల జీవితాల్లో చీకటి కోణాలు ఉన్నాయని.. వారంతా మహిళలతో సంబంధాలు నెరిపారని అశుతోష్ తన బ్లాగులో ఓ వ్యాసం రాశారు. దీనిపై ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయం... 2016లో ఆప్ మంత్రి సందీప్ కుమార్ లైంగిక ఆరోపణల వ్యవహారం తెరపైకి వచ్చింది. సందీప్ ఓ మహిళతో అభ్యంతరకర స్థితిలో ఉన్న సీడీ ఒకటి బయటకు పొక్కటంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి ఆప్ బహిష్కరించింది. ఆ సమయంలో అశుతోష్, సందీప్‌కు అండగా నిలిచారు. తన బ్లాగులో ‘శృంగారం ప్రాథమిక అవసరాల్లో ఒకటి. సందీప్ తప్పేముంది’ పేరిట పెద్ద వ్యాసం రాశారు. దేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖులెందరు లేరు? నెహ్రూ ఎంతో మందితో సంబంధాలు నడిపారు. నెహ్రూ-లేడీ మౌంట్‌బాటెన్ సంబంధం జగమెరిగిన సత్యం. రవీంద్రుడి దూరపు బంధువు సరళాచౌదరి తన ఆత్మిక సతీమణి అని గాంధీజీ అంగీకరించలేదా?. వాజ్‌పేయి వివాహం చేసుకోకపోయినా స్నేహితురాలితో సహజీవనం చేశారు. ఆ మాటకొస్తే గాందీ, నెహ్రూ, వాజ్‌పేయి, రామ్ మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండేజ్ ఇలా అంతా మహిళలతో సంబంధాలు నడిపించారు. వారిని ఎవరూ నిలదీయలేదే?. వారి రాజకీయ ప్రస్థానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాయి కదా’ అంటూ విమర్శకులను తన బ్లాగ్‌లో ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశుతోష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయన మాత్రం ప్రతిపక్షాలతోపాటు ఆప్ నేతలను కూడా ఏకీపడేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఓ మహాత్మా! ఓ మహర్షి!!
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ ఈ రోజు అంటే, 1948, జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అనే ఆరెస్సెస్ కార్యకర్త హత్య చేశారనే వార్తను ఆకాశవాణిలో ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆకాశవాణిలో మాట్లాడుతూ ‘మన జీవితాల నుంచి ఓ దివ్య జ్యోతి వెళ్లిపోయింది. అంతటా చీకట్లు కమ్ముకున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఫిబ్రవరి 2వ తేదీన రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ, గాంధీ గురించి అద్భుతంగా మాట్లాడారు. ‘ఆయన జీవితానికి ఓ పిచ్చోడు ముగింపు పలికాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఆ వ్యక్తిని నేను పిచ్చోడనే సంబోధిస్తా. గత కొన్ని ఏళ్లుగా, నెలలుగా దేశంలో విషం వ్యాపించింది. అది ప్రజల మెదళ్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఆ విషాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. దాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సిందే. పిచ్చిగానో, చెడుగానో దాన్ని అంతం చేయాలనుకోవడం పొరపాటు. మనల్ని వీడిపోయిన మన ప్రియతమ టీచరు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పాడో, అచ్చం అలాగే ఎదుర్కోవాలి’..........ఆకాశవాణిలో నెహ్రూ. ‘పోయిన ప్రముఖులకు నివాళి అర్పించడం సభలో ఆనవాయితో కావచ్చు. ఈ సందర్భంగా ఈ సభలో నేనుగానీ, ఇతరులుగానీ ఎక్కువ మాట్లాడటం సబబు కాకపోవచ్చు. నేను మాత్రం ఓ వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా సిగ్గుపడుతున్నాను. అమూల్యమైన సంపదను పరిరక్షించుకోవడంలో మనం విఫలమయ్యాం. గత కొన్ని నెలలుగా అనేక మంది అమాయకులు, మహిళలు, పిల్లలను రక్షించుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాం. ఈ రోజు ఎంతో గొప్ప వ్యక్తిని రక్షించుకోలేకపోయామంటే అంతకన్నా సిగ్గుచేటు మనకు మరోటి లేదు. ఓ భారతీయుడు ఆయనపైకి చెయ్యెత్తినందుకు ఓ భారతీయుడిలా నేను సిగ్గుపడుతున్నాను. ఓ హిందువు ఆ పని చేసినందుకు ఓ హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. నిజంగా ఆ మహానుభావుడు ఎంతో బాధ పడి ఉంటారు. ఆయన బోధనా మార్గంలో నడవాల్సిన ఈ తరమే విఫలమైనందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చూపిన మార్గాన్ని కాదని మరో మార్గాన మనం నడుస్తున్నందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చేతులు పట్టుకున్న పిల్లాడి చేతులే ఆయన్ని పంపించినందుకు ఆయన బాధ పడి ఉంటారు.’ రాజ్యాంగ పరిషత్’ సభలో జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలోని ఓ భాగాన్ని గాంధీకి నివాళిగా ఇక్కడ ఇస్తున్నాం. -
పదవిలో ఉండి ప్రాణాలు కోల్పోయిన నేతలెవరంటే...
న్యూఢిల్లీ: పదవీ బాధ్యతల్లో ఉండి ప్రాణాలుకోల్పోయినవారి జాబితా భారత్‌లో కొంచెంకొంచెం పెరుగుతూ వస్తోంది. గతంలో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలా వరుసగా దాదాపు అన్ని స్థాయి పదవుల్లో ఉన్న నేతలు.. దురదృష్టవశాత్తు బాధ్యతల్లో ఉండగానే ఏదో ఒక ప్రమాదరూపంలో చనిపోతున్నారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహ్మద్ సయీద్ ఎయిమ్స్ లో కన్ను మూశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే చనిపోయారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండి ప్రాణాలుకోల్పోయిన నేతల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. జవహార్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889-మే 27, 1964) భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేత జవహార్ లాల్ నెహ్రూ. ఆయన స్వాతంత్ర్య భారతావనికి తొలి ప్రధాని. ఆయన పదవిలో ఉండగానే 1962లో అస్వస్థతకు గురై కశ్మీర్లో చికిత్స పొందుతూ మెల్లగా కోలుకున్నారు. ఆ తర్వాత పదవిలో ఉండగానే 1964 మే 27న గుండెపోటుతో చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి (అక్టోబర్ 2, 1904-జనవరి 11, 1966) జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నెహ్రూ అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ ప్రారంభించిన విధానాలను ఆయన అమలుచేసేందుకు పూనుకున్నారు. అయితే, పదవిలో ఉండగానే జనవరి 10, 1966లో గుండెపోటుతో తాష్కెంట్లో కన్ను మూశారు. విదేశాల్లో చనిపోయిన తొలి భారత ప్రధాని కూడా ఈయనే. జాకీర్ హుస్సేన్(ఫిబ్రవరి 8, 1897-మే 3, 1969) భారత్‌కు తొలి ముస్లిం రాష్ట్రపతిగా అతితక్కువకాలం పనిచేసి పదవిలో ఉండగానే చనిపోయారు జాకీర్ హుస్సేన్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాకీర్ ఆ వర్సిటీకి వీసీగా కూడా పనిచేశారు. అనంతరం భారత స్వాతంత్ర్య పోరులో కీలకంగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(జూలై 8, 1949-సెప్టెంబర్ 2, 2009) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత వైఎస్ రాజశేకర్ రెడ్డి. అందరూ ఆయనను ప్రేమగా వైఎస్ఆర్ అని పిలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన అఖండ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఏ నాయకుడు ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలిసారి 2004 నుంచి 2009వరకు సీఎంగా పనిచేసిన వైఎస్సార్ రెండోసారి కూడా సీఎంగా ప్రమాణం చేసిన (2009) కొద్ది రోజులకే అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు. డోర్జీ ఖండూ(19 మార్చి 1955-30 ఏప్రిల్ 2011) కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్జీ ఖండూ అరుణాచల్ ప్రదేశ్ కు ఆరో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు. -
ప్రధాని ఫకీర్! నిజాం యాచకుడు!
ప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ పర్యటనలో శ్రామికుల రోజుకూలీని ముప్పావలాకు పెంచుతూ ఆదేశాలిచ్చారని చెప్పుకున్నాం. ఆ నేపథ్యంలో ఆరో నిజాం ఆసక్తికరమైన ఆదేశాలను ప్రస్తావించుకున్నాం. వాటిల్లో ఒక ఒప్పందాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. అది అపూర్వమైంది! అప్పు కోసం ప్రధాని దరఖాస్తు! ఆరో నిజాం ప్రభువుకు కొంత విరామం తర్వాత ఏడో నిజాం నవాబుకు ప్రధానమంత్రిగా సేవలు అందించారు మహారాజా కిషన్‌ప్రసాద్. ఆయన వితరణశీలి. బండి మీద బయటకు వెళ్తూ డబ్బు సంచులను వెంట ఉంచుకునేవారు. ఆపన్నులు ఎదురైతే రెండు చేతులతో వెదజల్లేవారు. వారు చూపే కృతజ్ఞతాభావం తన కంట పడకముందే ముందుకు సాగిపోయేవారు. ఉపఖండంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కవులను, కళాకారులను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి, కానుకలిచ్చి పంపేవారు. ఆరో నిజాం హయాంలో ఇక్బాల్ వంటి ఎందరో అలా సహాయం పొందినవారే. ఈ వాతావరణంలో తనను తాను ఫకీర్‌గా అభివర్ణించుకునే ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్ నిజంగానే ఫకీర్ అయ్యారు. తన జీతభత్యాలు అత్తెసరుకూ సరిపోవడం లేదు. అతిథులను ఎలా ఆదరించడం? అందిన చోటల్లా అప్పు చేశారు. అప్పులు అలాగే ఉన్నాయి. అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు రెండు లక్షల రూపాయల రుణం కావాలని నిజాం నవాబుకు ప్రధానమంత్రి దరఖాస్తు చేసుకున్నారు, లిఖితపూర్వకంగా! నిజాంకు ప్రధానమంత్రి జీవనశైలి తెలుసు. ఎందుకు అప్పు అడిగారో తెలుసు. అప్పు తీర్చేందుకు అప్పు. దానధర్మాలు చేసేందుకు అప్పు. సరే అన్నారు, ఒక షరతుపై! ‘పుణ్యా’నికి రుణమాఫీ! కిషన్ ప్రసాద్ తాను ఆర్జించిన‘సవాబ్’ను తనకు బదలాయిస్తూ ప్రామిసరీ నోట్‌పై సంతకం చేస్తే అందుకు బదులుగా రెండు లక్షల రూపాయలు ఇస్తానన్నారు నిజాం! ‘సవాబ్’ అంటే? ఒక ధార్మిక సంపద! వెలకట్టలేనిది! భక్తుడు మంచి పనులను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. నిష్కామంగా అన్నమాట! ‘ఫలానా మేలు చేస్తే ఫలానా దానం ఇస్తాను’ వంటి మొక్కులు కామ్యార్థాలు. నిష్కామ భక్తి సంపదను తెలిపే దృష్టాంతం ‘కైశిక పురాణం’ అనే హిందూ మత గ్రంథంలో ఉంది. ఒక ‘అచ్యుతుడు’ కైశికి రాగంలో రోజూ వామనమూర్తిని నిష్కామంగా అర్చించేవాడు. తన గాన నీరాజనంతో అతడు ఆర్జించిన సంపదను త్యాగం చేసి ఒక ‘బ్రహ్మరాక్షసు’డికి విముక్తి కలిగిస్తాడు. లోకరీతిలో ఎన్నో పాపాలు, తప్పులు చేసేందుకు ఆస్కారం ఉన్న వ్యక్తులకు మతగ్రంథాలు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించాయి. మంచివారి పుణ్యసంపదను గ్రహించి మరణానంతరం స్వర్గ ప్రవేశం పొందవచ్చని ముస్లిం మత గ్రంథాల్లో ఉదహరించారు. ‘ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా దానం చేసినవారిని, సజ్జనులను రుణ విముక్తులను చేసినవారిని అల్లా తన నీడకు చేర్చుకుంటారు. తీర్పు చెప్పే రోజు మరే ఇతర దోషాలు అంటకుండా రక్షిస్తారు’ అని పవిత్ర గ్రంథం పేర్కొంది. ఈ పుణ్యఫలం బదిలీని ఉర్దూలో ‘సవాబ్’ అంటారు. అరబ్బీలో ‘తవాబ్’ అంటారు. మహా రాజా కిషన్‌ప్రసాద్ లోకులకు తాను బాకీ పడ్డ అప్పు తీర్చేందుకు నిజాంను అప్పు అడిగారు. కిషన్‌ప్రసాద్ హిందువా? ముస్లిమా? అతడేమిటో అతనికే తెలుసు! ఇరు మతాల ప్రజానీకానికీ తెలుసు. అతడు చేతిలో పైసాలేని మహారాజు! నిస్సంశయం గా బీదవాడు! సజ్జనుడు! ‘దొరకునా ఇటువంటి సేవ’ అనుకున్నారు నిజాం! తన ధార్మిక సంపదను పెంపొందించుకునేందుకు కిషన్‌ప్రసాద్ అంగీకారాన్ని ప్రామిసరీ నోట్ సాక్షిగా అడిగారన్నమాట! ఇరువురి సంతకాలతో ‘ఇహ-పర రుణాలు’ అలా సయోధ్యను కుదుర్చుకున్నాయి. కనిపించని సంపద! కిషన్‌ప్రసాద్ 76వ ఏట 1940లో మరణించారు. ఒకప్పుడు ఆయన నివాసం ‘షాద్ మ్యాన్షన్’ వైభవోజ్వలంగా ప్రకాశించింది! ఆయన నివాసపు ప్రధాన ద్వారంలో రెండు సింహాలుండేవి. కొన్నాళ్ల తర్వాత అవి అదృశ్యమయ్యాయి. పాతబస్తీలో కిషన్‌ప్రసాద్ రోడ్ ఉంది. ఆయన నివాసాన్ని గుర్తించడం కష్టమే! మానవాళి సంపదను కనిపించేది-కనిపించనిదిగా (టాంజిబుల్-ఇన్‌టాంజిబుల్) యునెస్కో విభజించింది. భవనాలు కనిపించేవి. అవి కనిపించకపోయినా ఫర్వాలేదు. విలువలు కనిపించనివి. అవి అనుభవంలోకి మాత్రమే వస్తాయి. కిషన్‌ప్రసాద్ సమాజానికి అందజేసిన ధార్మిక సంపద ఇన్‌టాంజిబుల్. అమూల్యమైనది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో నివసించే ఇరుమతాలకు చెందిన ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఇంటర్నెట్ ద్వారా ‘హలో’ అనుకుంటున్నారు! - ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి