ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్‌ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా? | These Prime Ministers Have Presented Union Budget Instead Of Finance Ministers | Sakshi
Sakshi News home page

ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్‌ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?

Published Fri, Jul 19 2024 2:47 PM | Last Updated on Fri, Jul 19 2024 3:22 PM

These Prime Ministers Have Presented Union Budget Instead Of Finance Ministers

బడ్జెట్‌ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై పడింది.

1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.

నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు.

1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్‌లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు.

ఇదీ చదవండి: 'ఇన్‌కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?

ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్‌. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement