Morarji Desai
-
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?
బడ్జెట్ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పడింది.1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్లను సమర్పించారు.1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు.ఇదీ చదవండి: 'ఇన్కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది. -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
ప్రధాని పదవికి వయసు అడ్డంకి కాదేమో!
భారతదేశం సహా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభల సభ్యత్వం పొందడానికి రాజకీయ నాయకులకు ఎలాంటి వయోపరిమితి లేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టడానికి కూడా ఇంత వయసు దాటిన నేతలు అనర్హులు అనే నిబంధన ఏదీ లేదు. రాజ్యాంగ, రాజకీయ పదవులకు గరిష్ఠ వయోపరిమితి లేకపోవడం సబబేనని, మానసిక సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంత వయసువారైనా పదవుల చేపట్టడంలో తప్పేమీ లేదని ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజ్యాంగ నిపుణులూ, ప్రజాతంత్రవాదులూ అభిప్రాయపడుతున్నారు. 81 ఏళ్లకు ప్రధానిగా మొరార్జీ దేశాయి నిజమే, శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నంత వరకూ ప్రజలు ఎన్నుకున్నంత కాలం ఏ వయసు నాయకులైనా పదవులు అధిష్ఠించడం సక్రమమేనని రాజనీతి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇండియాలో 1977 మార్చి లోక్ సభ ఎన్నికల అనంతరం తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత మొరార్జీ దేశాయి వయసు 81 సంవత్సరాలు. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మాజీ కేంద్ర మంత్రి అయిన మొరార్జీ భాయ్ ఇంత పెద్ద వయసులో ప్రధాని పదవికి ఎన్నికకావడమేమిటని కొందరు వ్యాఖ్యానించారు. చరిత్రకెక్కిన రాజీవ్ గాంధీ మంకు పట్టుదల ఉన్న నేతగా అప్పటికే పేరున్న గాంధీయవాది మొరార్జీ 2 ఏళ్ల 4 మాసాలు ప్రధానిగా కొనసాగారు. 1896 ఫిబ్రవరి 29న జన్మించిన దేశాయి జీ 99 ఏళ్లు జీవించారు. ఆ తర్వాత మళ్లీ దేశ ప్రధాని అయిన ఏ నాయకుడి వయసు గురించీ చర్చ అంతగా జరగలేదు. 1984 చివరిలో తల్లి మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్ గాంధీ వయసు 40 ఏళ్లు. ఇండియాలో అత్యంత పిన్నవయస్కుడైన ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు. అనంతరం 1997లో 77 ఏళ్ల వయసులో ప్రధాని అయిన ఇందర్ కుమార్ గుజ్రాల్ గురించి కూడా అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. ఆయన దాదాపు 11 నెలలు పదవిలో కొనసాగారు. పదేళ్లపాటు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ గుజ్రాల్ తర్వాత 1996 మార్చిలో బీజేపీ తరఫున తొలి ప్రధాని అయిన అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 73 ఏళ్లు దాటాక అత్యున్నత పదవిని అధిష్ఠించారు. మళ్లీ వరసగా 1998, 1999లో ప్రధాని పదవి చేపట్టి 6 ఏళ్ల 2 మాసాలు కొనసాగిన వాజపేయి 79 సంవత్సరాల వయసులో పదవి నుంచి దిగిపోయారు. 2004 పార్లమెంటు ఎన్నికల తర్వాత తొలి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వయసు అప్పటికి 71 ఏళ్లు. పదేళ్లు ప్రధానమంత్రిగా కొనసాగాక 2014 మే నెలలో పదవి నుంచి దిగిపోయినప్పుడు మన్మోహన్ జీ వయసు 81 సంవత్సరాలు. 16వ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో 2014 మేలో 63 సంవత్సరాల వయసులో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు నరేంద్ర మోదీ. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఎన్నికైతే.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ జీ ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీపడి మూడోసారి ప్రధాని అయ్యే పక్షంలో ఆయన 78 ఏళ్ల ఆరు నెలల వయసులో 2029 మే నెలలో ఉన్నత పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన ప్రముఖుల వయసు గురించి ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రస్తావించడానికి కారణాలు లేకపోలేదు. అధ్యక్షుడి హోదాలో బైడెన్ 80వ పుట్టిన రోజు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ (జో) బైడెన్ పదవిలో ఉండగా 80వ పుట్టినరోజు జరుపుకున్న మొదటి దేశాధినేతగా చరిత్రకెక్కారు.అంతేగాక, ఈ వయసులో ఆయన కొద్ది నెలల క్రితం తాను రెండోసారి అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్టు ప్రకటించారు. ఒకవేళ బైడెన్ పార్టీ టికెట్ సంపాదించి 2024 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే–81 సంవత్సరాల వయసులో 2025 జనవరి 20న దేశాధ్యక్షునిగా ప్రమాణం చేసే తొలి నాయకుడిగా కొత్త రికార్డు నెలకొల్పుతారు. 1951లో పూర్తి చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా అమెరికా అధ్యక్ష పదవిని రెండుసార్లు మించి నిర్వహించకూడదనే నిబంధన అమలులోకి వచ్చింది. అంతేగాని, దేశాధ్యక్ష పదవికి పోటీపడడానికి అమెరికాలో గరిష్ఠ వయోపరిమితి లేదు. అంతేగాక, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు, గవర్నర్ పదవులు సహా అన్ని చట్టసభల పదవులుకు పోటీచేయడానికి ఎలాంటి వయోపరిమితి లేదు. ఇండియాలో ఏ పదవి కోసమైనా ఎన్నిసార్లయినా లేదా ఏ వయసులోనైనా పోటీచేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. పదవులకు పోటీపడే నాయకుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే నేతల వయసుపై జనం పెద్దగా చర్చించరు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై–బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై–బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై–బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై–బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్లెట్ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. -
‘పరీక్ష’లో విఫలమైన ప్రధాన మంత్రులు..!
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కూడా కొనసాగకుండానే శాసనసభలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన బీఎస్ యడ్యూరప్ప మాదిరిగానే దేశంలో పదవి నుంచి వైదొలిగిన ప్రధానులు ఉన్నారు. లోక్‌సభలో అతి పెద్ద పార్టీ నేతగా ప్రధాని పదవి చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి 1996 మే చివరి వారంలో విశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే రాజీనామా చేశారు. మెజారిటీ నిరూపణకు అప్పటి రాష్ట్రపతి రెండు వారాలు గడువిచ్చినా అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాక వాజ్‌పేయి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాలేదంటే మాతృభూమికి తక్కువ సేవ చేసినట్లు కాదని అన్నారు. ప్రసంగం చివరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొరార్జీ దేశాయి అలాగే.. 1977 మార్చి 24న జనతాపార్టీ తరఫున తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన మొరార్జీ దేశాయి రెండేళ్లు గడిచాక పార్టీలో చీలిక కారణంగా పదవి కోల్పోయారు. ఆ పార్టీ నుంచి ఎంపీలు భారీ సంఖ్యలో రాజీనామా చేసి చరణ్‌సింగ్ నాయకత్వాన ఏర్పడిన జనతాపార్టీ–ఎస్‌లో చేరిపోయారు. ఫలితంగా మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే 1979 జులై 12న రాజీనామా చేశారు. -
బోధించడానికి ఏముంటుంది?!
భగవాన్ శ్రీ రమణ మహర్షితో ఆయన జీవించి ఉన్న కాలంలో మౌనంగా ముఖాముఖీ జరిపినవారిలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఒకరు! మొరార్జీ 1977 నుండి 1979 వరకు భారత ప్రధాని. ఆయనకు 1935 ఆగస్టులో రమణ మహర్షిని చూసే భాగ్యం కలిగింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ లో రాసుకున్నారు. ఆ రోజు శ్రీ రమణ మహర్షి సోఫా మీద ఆసీనులై ఉన్నారు. ఆయన ఒంటిపై ఉన్నది ఒక్క కౌపీనమే (గోచీ). ఆ ప్రసన్న వదనం వెలిగిపోతోంది. ఆ వదనం మీద మొరార్జీకి ఒక జ్యోతిశ్చక్రం కనిపించింది. ఆయన ఎదురుగానే కూర్చొని ఉన్నారు ఈయన. ఏమీ అడగలేదు. ఆయనా ‘ఏమిటీ’ అని అడగలేదు. దాదాపు గంటసేపు అలా భగవాన్ ముఖాన్నే చూస్తూ కూర్చున్నారు మొరార్జీ. ఆ తర్వాత, వెళ్లేందుకు పైకి లేవగానే, భోజనం చేసి వెళ్లమని భగవాన్ సైగ చేశారు. ఆ దర్శనం మొరార్జీపై చెరగని ముద్రవేసింది. మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవం ఆత్మజ్ఞానంగా మొరార్జీకి ప్రత్యక్షమయ్యారట. అంటే, ఆత్మజ్ఞానంలో ఆయనకు దేవుడు సాక్షాత్కరించాడు. ఢిల్లీలోని శ్రీ రమణ మహర్షి కేంద్రం 1979లో శ్రీ రమణ మహర్షి 99వ జయంత్యుత్సవాన్ని నిర్వహించింది. ఆ వేడుకలకు భారత ప్రధాని హోదాలో మొరార్జీ దేశాయ్ అధ్యక్షత వహించారు. ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎప్పుడూ ఉద్బోధలు చేయలేదు. ‘నేను జ్ఞానినే అయితే ప్రతి వారినీ జ్ఞానిగానే భావిస్తాను. ఇంక బోధించడానికి ఏముంది?’ అనేవారు. ఎవ్వర్నీ మార్చడానికి ప్రయత్నించలేదు. అసలు వారి సన్నిధి వల్లనే పరివర్తన కలిగేది’’.. అని రమణ మహర్షి సామీప్యంలో తనకు కలిగిన అనుభూతులను తన ప్రసంగంలో మొరార్జీ వెల్లడించారు. నేడు ఆ మహర్షి జన్మదినం. -
రాజ్‌భవన్ టు రాష్ట్రపతి భవన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ రాజకీయ ప్రస్థానం ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిౖకైన రామ్‌నాథ్ కోవింద్ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. పెద్దగా ప్రచారంలో లేని ఆయన వివాదాలకు కూడా దూరం. న్యాయవాది నుంచి రాజ్యసభ ఎంపీ, గవర్నర్, రాష్ట్రపతి అభ్యర్థి వరకు సాగిన ఆయన ప్రస్థానమిదీ.. దళితుల కోసం.. కోవింద్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1977–79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సం బంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1980–93 మధ్య సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కాన్సుల్‌గా పనిచేశారు. కోవింద్ 1986లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆలిండియా కోలీ సమాజ్‌కు నాయకత్వం వహించారు. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 1997లో చేసిన ఆందోళనలో పాలుపంచుకున్నారు. రాజకీయాల్లో.. ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కోవింద్ కమలదళానికి అత్యంత విధేయుడు. బీజేపీ వివాదా స్పద హిందుత్వ రాజకీయాలతో ఆయనకు పెద్దగా సంబంధం లేదు. మతానికంటే బడుగు వర్గాలు సాధికారత రాజకీయాలవైపే ఆయన ప్రధానంగా ఆకర్షితులయ్యారని సన్నిహితులు చెబుతుంటారు. యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సన్నిహితునిగా పేరుంది. కోవింద్ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ బీజేపీ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన కోవింద్ 1998–2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ/ఎస్టీ, సామాజిక సాధికారత కమిటీ సహా ఐదు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. 2002లో ఐరాసకు భారత బృందం సభ్యునిగా వెళ్లి అక్కడ ప్రసంగించారు. టీవీ చానళ్లకు దూరంగా.. కోవింద్ బీజేపీ జాతీయ ప్రతినిధిగా పనిచేసినా ప్రచారా నికి దూరంగా ఉన్నారు. ఏ చానల్లోనూ కనిపించలేదు. పార్టీ, రాజ్‌నాథ్ పట్ల ఉన్న విధేయత కారణంగా 2014లో బీజేపీ అధికారం చేపట్టాక 2015లో కోవింద్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. రైతు కుటుం బంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి. ఊహకందని చాణక్యం! మోదీ–షాల రాజకీయం 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి.. అనూహ్య నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానిగా గెలిచిన తర్వాత కేబినెట్ కూర్పు దగ్గరినుంచి రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన వరకూ ప్రతీదీ ఎవరి ఊహకూ అందని నిర్ణయమే. అదే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమి త్ షాల వ్యూహచతురతకు నిదర్శనం. మూడేళ్లుగా ఈ ద్వయం ‘మీరు అంచనాలు వేసుకోండి. మేం వాటిని పటాపంచలు చేస్తాం’ అని నిరూపిస్తూ దూసుకెళ్తోంది. ఈ జోడి ఇలా నిర్ణయాలు తీసుకోవటం ఇదేం కొత్తకాదు. గుజరాత్లో సీఎం, హోంమంత్రులుగా ఉన్నప్పటినుంచీ ప్రత్యర్థుల అంచనాలకు ఏమాత్రం అందకుండా.. దెబ్బకొట్టడం వీరికి అలవాటు. మోదీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటినుంచి బాగా పరిచయం ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు.. కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముందు ‘మంత్రి వర్గంలో ఎవరెవరుండొచ్చు?’ అని మోదీని ప్రశ్నించా రు. దీంతో పెద్దగా నవ్విన మోదీ.. ‘మంత్రులకు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు వారిపేరుందో లేదో తెలీదు’ అని బదులిచ్చారు. హరియాణా సీఎంగా ఖట్టర్, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్‌ల ఎంపిక కూడా ఎవరి ఊహకూ అందనివే. మిషన్ ‘యూపీ 2019’! కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంలో యూపీ పాత్ర చాలా కీలకం. ఈ మూడేళ్లలో ప్రజాకర్షక పథకాలు ఎన్ని తెచ్చినా.. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు మరేదో కావాలి. ఇది మోదీ, అమిత్ షాలకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా యూపీలాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలను కాపాడుకోవటం అంత సులువేం కాదు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో దళితుల ఓటుబ్యాంకు బలంగా ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీలు కలిసి పోటీచేసే అవకాశాలు కనబడుతుండటంతో రాజకీయ సమీకరణాలకు కమలదళం ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. దీంతో మోదీ–షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన కోవింద్‌ను ఎంపిక చేశారు. ఇది కూడా 2019లో యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ–ఆరెస్సెస్ అనుసరిస్తున్న వ్యూహమేనని స్పష్టమవుతోంది. అంతేకాదు ఏకమై పుంజుకోవాలనుకుంటున్న యూపీలో ఇది విపక్షాలకు ఎదురుదెబ్బే. దీంతోపాటుగా రోహిత్ వేముల వివాదం, దళితులపై గోరక్షకుల దాడులు వంటివి బీజేపీ దళితులకు వ్యతిరేకమనే ముద్ర వేశాయి. ఈ సమయంలో యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఈ ముద్రను తొలగించుకోవటం బీజేపీకి అత్యంత ఆవశ్యకం అందుకే అన్ని సమీకరణాల తర్వాత వ్యూహాత్మకంగానే రామ్‌నాథ్ కోవింద్ పేరు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఎంతో ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌ను నేడు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి రైల్వే పద్దును, సాధారణ బడ్జెట్లో విలీనం చేసి దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు.... భారత తొలి బడ్జెట్ : జేమ్స్ విల్సన్ తొలిసారి ఇండియన్ బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్‌కు ఆర్థికమంత్రిగా పనిచేసేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ : స్వతంత్ర భారతంలో ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. 1947 నవంబర్‌లో ఆయన దేశీయ తొలి ఆర్థికమంత్రి. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకున్న కాలాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ చదవని మంత్రి : శెట్టి తర్వత 1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్‌గా పేరుగాంచింది. బడ్జెట్‌ను చదవకూడదని నిర్ణయించిన ఆయన, అన్ని వివరాలను వైట్ పేపర్లలో సర్క్యూలేట్ చేస్తున్నట్టు సభ్యులకు చెప్పారు. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే : ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. గరిష్టంగా 10 సార్లు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన బర్త్‌డే రోజే బడ్జెట్‌ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న మోరార్జీ దేశాయ్ బర్త్‌డే. బ్లాక్ బడ్జెట్ : రూ. 550 కోట్ల లోటు కారణంగా 1973-1974 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్‌కు బ్లాక్ బడ్జెట్‌గా పేరు. దీన్ని మాజీ ఆర్థికమంత్రి పీ. చిదంబరం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతులు : ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్లు మాత్రమే ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం వీరు రాష్ట్రపతులయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ : అత్యంత క్లిష్ట పరిస్థితుల సమయంలో రెండు ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. పోఖ్రాన్ రెండవ పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లో, గుజరాత్లో అత్యంత భీకరమైన భూకాపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశ్వంత్ సిన్హా బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఒకే ఒక్క మహిళే : ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశాయ్ రాజీనామా చేయడంతో దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రెండు బడ్జెట్ల విడిపోయిన కాలం: 1924లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. అప్పటి నుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , ప్రస్తుతం రెండు బడ్జెట్లను కలిపి మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేస్తూనే బడ్జెట్ తీసుకొచ్చారు. అతిపెద్ద బడ్జెట్ : 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అతిపెద్ద బడ్జెట్‌గా పేరు. అదేసమయంలో దేశీయ ఆర్థిక విధానాలన్నింటిల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమయం మార్పులు : ముందు వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అటల్ బిహార్ వాజ్‌పేయి కాలం 1999లో బడ్జెట్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. ఆ బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా బడ్జెట్ తేదీలనే మార్చేసి, ఒకనెల ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో నేతాజీ స్మృతి చిహ్నం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకాన్ని నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. నేతాజీకి చెందిన మరో 25 పత్రాలను బహిర్గతం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 1956-2009 మధ్య కాలానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 5 ఫైళ్లు, హోం శాఖకు సంబంధించిన 5 ఫైళ్లు, విదేశాంగ శాఖకు చెందిన 15 ఫైళ్లను బహిర్గతం చేసింది. జపాన్ కూడా 5 ఫైళ్లలో రెండింటిని బహిర్గతం చేసేందుకు అంగీకరించిదని సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. నేతాజీ స్మారకంతో పాటు మ్యూజియం కూడా నిర్మిస్తామని, పనులు మొదలయ్యాయని తెలిపారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశించిన మొరార్జీ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని గత ప్రభుత్వాలు నిర్ధారించినప్పటికీ.. నేతాజీ మరణంపై మరింత దర్యాప్తు చేయాలని 1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదేశించినట్లు మహేశ్ శర్మ వెల్లడించారు. -
ఇదొక పెద్ద కుట్ర!
అక్షర తూణీరం విశ్వనాథ వారిని కదిలిస్తే ‘‘ఇవన్నీ రామాయణ కాలంలోనే అఘోరించాయి. ముక్కుబేసరి నోటి మాటని గ్రహించేది. కర్ణాభరణాలు విషయాన్ని వినిపించేవి. వాటిలో అద్భుతమైన దివ్యశక్తి గల రవ్వలుండేవి. అవి ఏమిటో నేడు మనకు తెలియదు. వారికి తెలియును. ఇదియొక చమత్కారము’’ అని వివరిస్తారు. ‘‘అనుకున్నంతా అయింది! మొరార్జీ దేశాయ్‌కి బంగారం విలువ, దానిపై ఉన్న మోజు తెలియక ఆ రోజుల్లో గోల్డ్ కంట్రోల్ పెట్టాడు. ఇప్పుడు రాత్రి విలువ, సరదా తెలియ ని ప్రధాని మోదీ ఈ ‘జాగారం పథకం’ ప్రవేశ పెట్టారు’’ అంటూ ఒక సామాజిక తత్వ వేత్త కలవరపడ్డాడు. రేపు వచ్చే కార్మిక దినోత్సవం నించి, ‘‘ఇక మీ ఓపిక’’ నినాదంతో, భారత్ సంచార నిగమ్ రాత్రి పూట ‘‘ఉచిత’’ వాగుడు వేళల్ని జాతికి ధారాదత్తం చేయనుంది. దాని వల్ల - ఇప్పటిదాకా ప్రతిరాత్రీ వసంతరాత్రీ లాగా గడుస్తున్న వారికి ప్రతి రాత్రీ శివరాత్రి కాగల ప్రమాదం ఉంది. ఇదేదో ప్రభుత్వం కల్పించిన గొప్ప రాయితీ అనుకోవద్దు, దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నాడు మా రవిబాబు. మొన్న చంద్ర గ్రహణం వెనకాల, ఎల్లుండి రాబోయే పుష్కరాల వెనకాల కూడా కుట్ర ఉందని ప్రతిపాదించి, వాదించి తలవూపిస్తాడు రవిబాబు. బెరడుగట్టిన సామా జిక స్పృహ గల ఎర్రచందన వృక్షం ఆయన. ఎన్నో భయంకర సమస్యలను కప్పెట్టడానికి ఇదొక మంత్రం. మోదీ అనాలోచిత చర్యల్ని ప్రజల దృష్టి నుంచి తప్పించడానికి పన్నిన పన్నాగం. రాత్రంతా మాటలతో సరి. పగలు ఆవలింతలతో సరి. ఇలాగ ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంది. అయితే టీవి సీరి యల్స్కి దెబ్బే. ఎందుకంటే రాత్రి ఎనిమిది నుంచి ప్రైమ్స్ మొదలవుతాయి. అప్పట్నించి సద్దితే గాని తొమ్మిది నించి నిరంతర సంభాషణకి వీలుండదు. రాత్రి సినిమాలు బోసి పోతాయి. సామర్థ్యం గల చోట మిగతా సంసార పక్ష కార్యక్రమాలు కొంచెం మందకొడిగానే నడుస్తాయి. ఒకప్పుడు పెట్రోలు ధరలు పెరిగినప్పుడు, యిది కుటుంబ నియంత్రణకు గొడ్డలిపెట్టు అని మేధావులు అరిచారు. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం వుంది. ఏకాంతమన్నది వుండదిక. రామాయణంలో తాటక సంహార ఘట్టంలో, ‘‘రామా! బాణం సంధించు సంకోచించకు. ప్రొద్దు మీరిన కొద్దీ రాక్షసులు బలం పుంజుకుంటారు’’ అని హెచ్చరిస్తాడు. ఫ్రీ అనగానే జనం బలం పుంజుకుంటారు. పైగా రాత్రి. విశ్వనాథ వారిని కదిలిస్తే ‘‘ఇవన్నీ రామా యణ కాలంలోనే అఘోరించాయి. ముక్కుబేసరి నోటి మాటని గ్రహించేది. కర్ణాభరణాలు విష యాన్ని వినిపించేవి. వాటిలో అద్భుతమైన దివ్యశక్తి గల రవ్వలుండేవి. అవి ఏమిటో నేడు మనకు తెలియదు. వారికి తెలియును. ఇదియొక చమత్కా రము’’ అని వివరిస్తారు. దీని వెనుక పెద్ద వ్యాపారం వుంది. మొదలు పెట్టాక ఒక పని చేసినా చెయ్యొచ్చు. ఉచిత వేళలో అయిదు నిమిషాలు కాగానే టకీమని లైను కట్ అయిపోతుంది. వెంటనే ముప్పై సెకన్లు స్పాట్ పడుతుంది. వ్యాపార ప్రకటన లేదా మోదీ పథకాలు విధిగా వినాల్సిందే. మీరు లైను కట్ చేస్తే, మళ్లీ డయల్ చేసుకోవా ల్సిందే. అప్పుడు ప్రతి డయలింగ్కి ఒక రూపాయి తగిలిచ్చా రనుకోండి- తడిసి మోపెడవుతుంది. ‘‘ఇది నల్లమందు, గంజాయి కంటే ప్రమాదమైన వ్యసనం. సమాచార వ్యవస్థ వుండటం మంచిదే కాని మరీ యింత అవసరమా? ఇంతకంటే అత్య వసరాలు ఎన్నో వున్నాయ్’’ అంటూ ఆందోళన చెందు తున్న వారున్నారు. పొద్దున్నే పేపరు చదివి యీ వాగుడు విశేషం గురించి చెప్పగానే మా ఆవిడ మొహం సెల్ టవరంతైంది. అయితే, ఇహ రాంగ్ నంబర్లతో కూడా ఓ అరగంట మాట్లాడుకో వచ్చని సంతృప్తిగా నిట్టూర్చింది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ఆర్థికశాఖకు చిదంబరం టాటా
న్యూఢిల్లీ: మూడుసార్లు ఆర్థిక మంత్రి పదవిని అలంకరించిన పి.చిదంబరం గురువారం ఆ శాఖకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత ఉద్వేగానికి లోనయ్యూరు. నార్త్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్ధిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని హామీ ఇచ్చారు. ‘1966 నుంచి రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తున్నా. ఇదేవిధంగా ఇకముందు కూడా పనిచేస్తా..’ అని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో చిదంబరం పోటీ చేయని సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రిగా 9 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానికి ఉంది. అరుుతే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డులకెక్కారు. అదే విధంగా హోంమంత్రి షిండేకు ఆ శాఖ సిబ్బంది వీడ్కోలు పలికారు.