ఆర్థికశాఖకు చిదంబరం టాటా | Chidambaram says goodbye for finance | Sakshi
Sakshi News home page

ఆర్థికశాఖకు చిదంబరం టాటా

Published Fri, May 16 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

ఆర్థికశాఖకు చిదంబరం టాటా

ఆర్థికశాఖకు చిదంబరం టాటా

న్యూఢిల్లీ: మూడుసార్లు ఆర్థిక మంత్రి పదవిని అలంకరించిన పి.చిదంబరం గురువారం ఆ శాఖకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత ఉద్వేగానికి లోనయ్యూరు. నార్త్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ధిక శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్ధిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని హామీ ఇచ్చారు. ‘1966 నుంచి రోజుకు 16 గంటల చొప్పున పని చేస్తున్నా. ఇదేవిధంగా ఇకముందు కూడా పనిచేస్తా..’ అని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో చిదంబరం పోటీ చేయని సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రిగా 9 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానికి ఉంది. అరుుతే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డులకెక్కారు. అదే విధంగా హోంమంత్రి షిండేకు ఆ శాఖ సిబ్బంది వీడ్కోలు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement