ప్రియంగా మాట్లాడాలి! | Talk dearly! | Sakshi
Sakshi News home page

ప్రియంగా మాట్లాడాలి!

Published Fri, May 5 2017 11:54 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

ప్రియంగా మాట్లాడాలి! - Sakshi

ప్రియంగా మాట్లాడాలి!

ఆత్మీయం

కొందరికి ఎదుటి వాళ్లకి ఏమాత్రం ఇష్టంలేని మాటలు మాట్లాడటం సరదా. మన మాటలు వినలేక చెవులు మూసుకుంటుంటే చూడాలనుకుంటారు. మన మాటలు ప్రియం కలిగించినా లేకపోయినా... అప్రియం మాత్రం కలిగించకూడదు. అందుకే చావు కబురు కూడా చల్లగా చెప్పాలన్నారు పెద్దలు. మధురంగా మాట్లాడటం ఒక కళ. మధురంగా మాట్లాడలేకపోయినా ఫరవాలేదు కానీ, చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు. చక్కగా, ఆహ్లాదకరంగా  ఉన్న వాతావరణంలో నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి ఒకడు ‘‘అమ్మో! ఇప్పుడు వర్షం పడిందంటే మన పని గోవిందా’’ అనో, ఈ ఏసీ గదికి కనక పొరపాటున నిప్పంటుకుందనుకోండి, మనలో ఒక్కడు కూడా మిగలడు’’ అనో అంటాడు.

అంతే! వాతావరణం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతుంది. మనం మాట్లాడేది సత్యమే అయినప్పటికీ, అది హితవుగా ఉండాలి. కఠినంగా అనిపించకూడదు. మన కళ్లు ఎప్పుడూ మంచి దృశ్యాలనే చూడాలి, చెవులు ఎల్లప్పుడూ మంచి మాటలనే వినాలి. చేతులు ఎప్పుడూ మంచి పనులే చేయాలి, నాలుక ఎప్పుడూ మధురంగానే మాట్లాడాలి... అని కోరుకునేవారు పెద్దలు. మనం మంచి మాటలు వినాలంటే, మంచి మాటలనే పలకాలి. ‘అబ్బే! నాకు మెరమెచ్చు మాటలు చెప్పడం చేతకాదండీ, ముక్కుసూటిగా... ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం నా నైజం’ అని గొప్పలు చెప్పుకునేముందు అవతలి వారు కూడా అలాగే మాట్లాడితే మన మనసుకు ఎలా అనిపిస్తుందో ఆలోచించాలి. చిలకలా ముద్దు మాటలు మాట్లాడలేకపోయినా, కోకిలలా పాటలు పాడలేకపోయినా, కాకిలా కర్ణకఠోరంగా మాత్రం మాట్లాడకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement