లాలాజలంతోనే రుచి! | With the taste of saliva! | Sakshi
Sakshi News home page

లాలాజలంతోనే రుచి!

Oct 1 2015 11:42 PM | Updated on Sep 3 2017 10:18 AM

ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే టేస్ట్‌బడ్స్‌తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా?

మెడి క్షనరీ

 ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే టేస్ట్‌బడ్స్‌తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? అది ఒక అపోహ మాత్రమే. నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. ఒక పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్‌బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది.

వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. అంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది కాబట్టి జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు అలా ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఒకవేళ ఆ ప్రక్రియ సఫలం కానప్పుడు వాంతి (వామిటింగ్) అనే ప్రక్రియ ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement