
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు.
పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది.
వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్‌లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...)
Comments
Please login to add a commentAdd a comment