
దీర్ఘజిహ్వుడు
మామూలు మానవులకు నాలుక పొడవు ఎంత ఉంటుంది..? ఎంత బలంగా ముందుకు చాపినా రెండు మూడంగుళాలకు ....
తిక్క లెక్క
మామూలు మానవులకు నాలుక పొడవు ఎంత ఉంటుంది..? ఎంత బలంగా ముందుకు చాపినా రెండు మూడంగుళాలకు మించి ఉండదు. అయితే, నిక్ స్టోబెర్ల్ అనే కాలిఫోర్నియా కుర్రోడి నాలుక మాత్రం తెగబారెడు పొడవు ఉంటుంది.
చుబుకానికి దిగువ దాకా నాలుకచాపి చిత్ర విచిత్రాలు చేస్తుంటాడితడు. అతగాడి నాలుక పొడవు కింది పెదవి నుంచి కొలిచి చూస్తే, ఏకంగా 5.75 అంగుళాలు ఉండటంతో, గిన్నిస్‌బుక్ వారు కూడా ఈ ఘనతను గుర్తించి, అతడి పేరును తమ పుస్తకంలోకి ఎక్కించారు.