
నాలుకల రికార్డు
వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా..!
న్యూయార్క్: వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా..! మరి ఆ నాలుకతోనే వీళ్లు సెలబ్రిటీలు అయ్యారు.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఈ తండ్రీ కూతుళ్లకు ప్రపంచంలో అతి వెడల్పయిన నాలుక ఉంది. అందుకే వీరి పేర్లు గిన్నిస్ రికార్డులోకెక్కాయి.
బైరన్ ష్లీన్‌కర్ అనే ఈ పెద్దాయన 8.6 సెంటీమీటర్ల వెడల్పు నాలుకతో పురుషుల విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆయన 14 ఏళ్ల కూతురు ఎమిలీ కూడా 7.3 సెం.మీ వెడల్పు నాలుకతో మహిళల విభాగంలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.