ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తురాలు
భోపాల్ : తమ కోరికలు తీరడానికి, మొక్కుబడులు చెల్లించుకోవడానికి దేవుళ్లకు భక్తులు జంతు బలులు ఇస్తూంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నమైన పని చేసింది. తాను నిత్యం కొలిచే దేవున్ని తృప్తి పరచడానికి తన నాలుకనే కోసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన మధ్యప్రదేశ్, మొరేనా జిల్లాలోని తర్సామా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానిక బిజసాన్ మాతా ఆలయంలో రోజు పూజలు చేసేది.
తన కోరికలను తీర్చిన దేవతకు మొక్కుబడి చెల్లించడం కోసం నాలుకను కోసుకుంది. నోటి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుండటం గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ‘తను అలా నాలుక కోసుకున్న సంగతి మాకు తెలియదు. తనీ పని ఆలయానికి వెళ్లినప్పుడు చేసింది. తనను ఆస్పత్రిలో చేర్చిన తరువాత మాకు సమాచారం ఇచ్చాకే ఈ విషయం తెలిసింద’ని కుటుంబ సభ్యులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment