CHOP
-
భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసిన భర్త!
ఇస్లామాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఝాంగ్ జిల్లాలో ఆదివారం జరిగింది. తన భార్యను బ్లాక్మెయిల్ చేస్తూ అతనితో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే కారణంతో నిందితుడు ముహమ్మద్ లిఫ్తీకర్ తన స్నేహితులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్పై ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ‘తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని కానిస్టేబుల్ కాసిమ్ హతయ్పై లిఫ్తీకర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాధితుడిని 12 మందితో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు.’ అని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. గతనెల పోలీస్ కానిస్టేబుల్ హయత్పై పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు ఇఫ్తీకర్. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ హయత్పై దాడి కేసులో ఇఫ్తీకర్తో పాటు అతడి అనుచరులను పట్టుకునే పనిలో పడ్డారు పంజాబ్ పోలీసులు. ఇదీ చదవండి: Nancy Pelosi Taiwan Tour: ‘తైవాన్‌లో అడుగుపెడితే మా సైన్యం చూస్తూ ఊరుకోదు’ -
షాకింగ్: తల్లి శవాన్ని కొరుక్కుతిన్న రాక్షస కుమారుడు
మాడ్రిడ్: కొన్ని నేర వార్తలు చదువుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సమాజంలో ఇలాంటి రాక్షసులు ఉంటారా అనిపిస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్పెయిన్‌లో చోటు చేసుకుంది. నరరూప రాక్షసుడైన ఓ వ్యక్తి కన్నతల్లిని చంపి.. ముక్కలుగా కోసి.. వాటిలో కొన్నింటిని తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దారుణం వివరాలు.. స్పెయిన్‌కు చెందిన అల్బెర్టో శాంచెజ్ గోమెజ్ అనే వ్యక్తికి, అతడి తల్లికి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహించిన గోమెజ్ తల్లిని చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్నింటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయట పడేశాడు. మరి కొన్ని భాగాలను టప్పర్‌వేర్ బాక్స్‌ల్లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసి 15 రోజుల పాటు తిన్నాడు. గోమెజ్ దారుణం గురించి తెలిసిన పోలీసులు ఫిబ్రవరి,2019న అతడిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌లో మాడ్రిడ్ కోర్టు అతడికి 15 సంవత్సరాల ఐదు నెలల శిక్ష విధించింది. జైలులో ఉన్న సమయంలో గోమెజ్ జరిగిన నష్టానికి గాను తన సోదరుడికి 73వేల డాలర్లు(53,87,976రూపాయలు) చెల్లిస్తానని.. విడుదల చేయాల్సిందిగా కోరాడు. కానీ కోర్టు అతడి అభ్యర్థనని తోసి పుచ్చింది. ఇలాంటి నరమాంస భక్షకులు బయట ఉండటం చాలా ప్రమాదం అని తెలిపింది. చదవండి: మాజీ భార్యపై పగ తీర్చుకోవటానికి సొంత బిడ్డల్ని.. -
ఎంత పని చేశావు కియారా..?!
ఆడపిల్లలకు జుట్టు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేశ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికి చాలామంది ఆడపిల్లలు జుట్టు కత్తింరించుకోవడానికి ఇష్టపడరు. కానీ నటి కియారా అద్వానీ మాత్రం ఓ కత్తేర పట్టుకుని స్వయంగా జుట్టు కత్తిరించేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. కియారా ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందట. ‘షూటింగ్‌లతో బిజీగా ఉండటం మూలానా నా జుట్టు గురించి పట్టించుకునే తీరిక దొరకడం లేదు. నా జుట్టును చాలా నిర్లక్ష్యం చేస్తున్నాను. ఇందుకు శిక్షగా స్వయంగా నా చేతులతో నేనే జుట్టు కత్తిరించుకున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘కొన్ని రోజుల క్రితం మా కజిన్ పెళ్లికి వెళ్లేటపుడు మా అమ్మ నన్ను చక్కగా చీర కట్టుకోమని కోరింది. కానీ అంతసేపు సింగారించుకునే టైం లేక మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే చీర కట్టుకున్నాను. ఇక బిజీ షెడ్యూల్స్‌తో క్షణం తీరిక లేని ఈ రోజుల్లో జుట్టు పెంచుకోవడం, దానికి మెరుగులు దిద్దడం కోసం నూనె రాసుకోవడం తెగ చిరాకుగా ఉంద’ని తెలిపిన కియారా.. కత్తెరతో టకా టకా తన జుట్టును తానే స్వయంగా కత్తిరించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో పట్ల నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram Guilty as charged!!! Just had to chop it off, been neglecting proper hair care for too long and thought this was the only solution ✂️🙈 A post shared by KIARA (@kiaraaliaadvani) on Apr 29, 2019 at 10:54pm PDT ‘మరి అంత చిరాకు అయితే ఎలా కియారా’.. ‘ఎంత పని చేశావు కియారా’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ‘పొట్టి జుట్టు కూడా నీకు చాలా బాగా సూట్ అయ్యింది. చాలా అందంగా.. కూల్‌గా ఉన్నావం’టూ కామెంట్ చేస్తున్నారు. -
భక్తురాలి సాహసం
భోపాల్ : తమ కోరికలు తీరడానికి, మొక్కుబడులు చెల్లించుకోవడానికి దేవుళ్లకు భక్తులు జంతు బలులు ఇస్తూంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నమైన పని చేసింది. తాను నిత్యం కొలిచే దేవున్ని తృప్తి పరచడానికి తన నాలుకనే కోసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన మధ్యప్రదేశ్, మొరేనా జిల్లాలోని తర్సామా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానిక బిజసాన్ మాతా ఆలయంలో రోజు పూజలు చేసేది. తన కోరికలను తీర్చిన దేవతకు మొక్కుబడి చెల్లించడం కోసం నాలుకను కోసుకుంది. నోటి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుండటం గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ‘తను అలా నాలుక కోసుకున్న సంగతి మాకు తెలియదు. తనీ పని ఆలయానికి వెళ్లినప్పుడు చేసింది. తనను ఆస్పత్రిలో చేర్చిన తరువాత మాకు సమాచారం ఇచ్చాకే ఈ విషయం తెలిసింద’ని కుటుంబ సభ్యులు అన్నారు. -
ముక్కలు చేసి.. సూట్‌కేస్‌లో పెట్టి
జైపూర్ : డబ్బు కోసం స్నేహితున్ని చంపి ముక్కలుగా చేసి సూట్‌కేస్‌లో పెట్టి రోడ్డు మీద పడేశారు. ఈ దారుణమైన సంఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన దుష్యంత్ శర్మ(29)కు సోషల్‌మీడియా ద్వారా బజాజ్ నగర్లో ఉండే ప్రియా సేథ్(27) అనే యువతి పరిచయం అయ్యింది. మే 2న ప్రియా సేథ్ దుష్యంత్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ప్రియ ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లిన దుష్యంత్‌ను తనకు పది లక్షల రూపాయల డబ్బు కావాలని డిమాండ్ చేసింది. అందుకు దుష్యంత్ ఒప్పుకోకపోవడంతో, అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. అంతేకాక అప్పటికే తన ఇంటికి పిలిపించుకున్న మరో ఇద్దరు స్నేహితులు దీక్షంత్ కుమార్(27), లక్ష్య వాలియా(25) సాయంతో ప్రియ దుష్యంత్‌ను బంధించింది. అనంతరం దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసి మీ కుమారున్ని విడుదల చేయాలంటే పదిలక్షల రూపాయలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు దుష్యంత్ తండ్రి తన దగ్గర అంత సొమ్ము లేదని, మూడు లక్షల రూపాయలను దుష్యంత్ బ్యాంకు అకౌంట్లో జమచేశాడు. నిందితులు దుష్యంత్ ఏటీఎమ్ నుంచి 20 వేల రూపాయలను డ్రా చేశారు. అనంతరం దుష్యంత్ బతికి ఉంటే తమకు అపాయమని భావించి అతన్ని చంపి ముక్కలు చేసి, సూటికేస్‌లో పెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు జెత్వార్ ఏసీపీ ఆస్ మహ్మద్ తెలిపారు. -
భర్త మర్మావయవాన్ని కోసేసింది..
హజారీబాగ్: భర్త తన సెల్ ఫోన్ లాక్కున్నాడని భార్య అతని మర్మావయవాన్ని కోసేసిన దారుణ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో గురువారం చోటు చేసుకుంది. బాధతో కేకలు పెడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని ఇరుగుపొరుగు వారు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్లు అతని మర్మావయం పూర్తిగా కోసేసి ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. ఆషిక్, తరన్నుమ్ లకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. ఈ నెల 22న భర్త ఇంటికి వచ్చేసరికి తరన్నుమ్ తన ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తోంది. చాటింగ్ ఆపమని భర్త చెప్పినా వినకపోవడంతో కోపగించుకున్న ఆషిక్ ఆమె వద్ద నుంచి ఫోన్ ను లాక్కున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన తరన్నుమ్ పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో ఆషిక్ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపాన్ని అణుచుకోలేని తరున్నుమ్ ఆషిక్ నిద్రపోయిన తర్వాత పదునైన కత్తితో అతని మర్మావయవాన్ని కోసేసింది. పెళ్లయిన నాటి నుంచి తరన్నుమ్ భర్తతో సరిగా ఉండేది కాదని, ఇంటి నుంచి పలుమార్లు పారిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. పెద్దల సమక్షంలో భార్యభర్తలిద్దరూ దాదాపు 18 సార్లు రాజీ ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేసినట్లు పోలీసులు వివరించారు. -
పిల్లల్లో కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధం!
గుర్తించిన పరిశోధకులు వాషింగ్టన్: బాల్యంలో వచ్చే ప్రాణాంతక కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. నాడీకణాలకు సంబంధించిన న్యూరోబ్లాస్టోమా కేన్సర్ చికిత్సకు వినియోగించే యాంటీకేన్సర్ ఔషధం క్రిజిటినిబ్పై చేసిన గత పరిశోధనల అనుభవాల ఆధారంగా కొత్త చికిత్సా విధానాలను ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రి (సీహెచ్ఓపీ) పరిశోధకులు గుర్తించారు. కొత్త ఔషధంపై తాము నిర్వహించిన తొలిదశ ఔషధపరీక్షల (ప్రీడ్రగ్ ట్రయల్స్) ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు ఔషధ పరీక్ష లు నిర్వహించాల్సి ఉందని సీహెచ్ఓపీ ఆంకాలజిస్ట్ యేల్ పి మోస్సే చెప్పారు. న్యూరోబ్లాస్టోమాకు దారితీసే అనప్లాస్టిక్ లింఫొమా కినాస్ (ఏఎల్కే) జన్యువుల ఉత్పరివర్తనలను, 2008లో అరుదైన, వంశపారంపర్య జన్యువులు న్యూరోబ్లాస్టోమాకు కారకాలంటూ మొదటిసారి తాము గుర్తించిన విషయాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఏఎల్కేలో వచ్చే అసాధారణ మార్పులు.. 14% ప్రాణాంతక న్యూరోబ్లాస్టోమాకు కారణమవుతున్నట్లు గుర్తించారు.