హజారీబాగ్: భర్త తన సెల్ ఫోన్ లాక్కున్నాడని భార్య అతని మర్మావయవాన్ని కోసేసిన దారుణ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో గురువారం చోటు చేసుకుంది. బాధతో కేకలు పెడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని ఇరుగుపొరుగు వారు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్లు అతని మర్మావయం పూర్తిగా కోసేసి ఉండటం చూసి షాక్ కు గురయ్యారు.
ఆషిక్, తరన్నుమ్ లకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. ఈ నెల 22న భర్త ఇంటికి వచ్చేసరికి తరన్నుమ్ తన ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తోంది. చాటింగ్ ఆపమని భర్త చెప్పినా వినకపోవడంతో కోపగించుకున్న ఆషిక్ ఆమె వద్ద నుంచి ఫోన్ ను లాక్కున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన తరన్నుమ్ పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో ఆషిక్ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కోపాన్ని అణుచుకోలేని తరున్నుమ్ ఆషిక్ నిద్రపోయిన తర్వాత పదునైన కత్తితో అతని మర్మావయవాన్ని కోసేసింది. పెళ్లయిన నాటి నుంచి తరన్నుమ్ భర్తతో సరిగా ఉండేది కాదని, ఇంటి నుంచి పలుమార్లు పారిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. పెద్దల సమక్షంలో భార్యభర్తలిద్దరూ దాదాపు 18 సార్లు రాజీ ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేసినట్లు పోలీసులు వివరించారు.
భర్త మర్మావయవాన్ని కోసేసింది..
Published Thu, Jun 23 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement