మాతృభాషను మరువొద్దు
Published Mon, Sep 19 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
హన్మకొండ కల్చరల్ : సామాజిక చైతన్యానికి ఓరుగల్లు కేంద్రంగా నిల్చిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సౌజన్యంతో మి త్రమండలి, సహృదయ సాహిత్య సాం స్కృతిక సంస్థ, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసై టీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హోటల్ అశోకాలో ‘ఓరుగల్లు సాహిత్యం సంస్కృతి’ అనే అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డా.అంపశయ్య నవీన్ అధ్యక్షత వహించ గా, సీపీ సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంగ్లం మాట్లాడటంలో తప్పులేదని, కానీ మాతృభాషను మరువకూడదని సీపీ అన్నారు. ఇకపై ప్రతి ఆదివారం ఇలాంటి సదస్సులు నిర్వహించాలని ఉందన్నారు. అలా వీలుకాని పక్షంలో నెలలో ఏదైనా ఓ ఆది వారం సాహిత్య సమావేశాలు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. సదస్సులో సమర్పించిన పత్రాలను పుస్తక రూపంలోకి తేనున్నామని వెల్లడించారు. అనంతరం రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ వరంగల్ చరిత్రలో తొలిసారిగా పోలీసుల ఆధ్వర్యంలో సాహిత్య సమావేశం జరగడం అభినందనీయమన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. రెండో సమావేశానికి అధ్యక్షత వహించిన సహృదయ సాహితీ, సాం స్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ ప్రతి సా హిత్య ప్రక్రియకు సంబంధించిన ప్రయోగాలు ఓరుగల్లు నుంచే ప్రారంభమయ్యాయన్నారు. ఈసందర్భంగా డా.వేలూరి శ్రీదేవి, డా.వీరాచారి, వాసిరెడ్డి కృష్ణారెడ్డి, డా.ఎన్వీఎన్.చారి, గిరిజా మనోహర్‌బాబు పత్ర సమర్పణ(పేపర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమ అతిథులుగా ప్రముఖ కవి వి.ఆర్. విద్యార్థి, సిరాజుద్దీన్, డా.అనీస్‌సిద్దిఖీ, కె. కృష్ణమూర్తి హాజరయ్యారు. సమావేశంలో హన్మకొండ ఏసీపీ శోభన్కుమార్, క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు, ఇన్స్పెక్టర్ సంపత్‌కుమార్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సాహితీవేత్తలు డా.జి.వి.రత్నం, వరిగొండ కాంతారావు, బాసిరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement