బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిల్లో అతి పురాతన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో చూడవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ (వెచ్చని) జలాలకు వలసపోతాయి. బ్లూవేల్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు.
♦ బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు . దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం.
♦ బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి.
♦ బ్లూ వేల్ నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది.
♦ నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు.
♦ నీలి తిమింగలం గుండె మినీ కూపర్ (కారు) పరిమాణంలో ఉంటుంది.
♦ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం మరియు వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం
♦ ఇది గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకదానిని క్రిల్ (రొయ్యల లాంటిది) తింటుంది
♦ బ్లూ వేల్ ప్రతిరోజూ 4 నుండి 6 టన్నుల క్రిల్ తింటుంది. ఫీడింగ్ సీజన్‌లో, బ్లూ వేల్ ప్రతిరోజూ 3600 చేపలను తింటుంది.
♦ గర్భం దాల్చిన ఒక సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బుల్లి వేల్ దాదాపు 3 టన్నుల బరువు ఉంటుంది.
♦ ఈ బేబీ వేల్ ప్రతిరోజూ 100 గ్యాలన్ల పాలు తాగుతుంది, ప్రతి గంటకు 9 పౌండ్లు (రోజుకు 200 పౌండ్లు) పెరుగుతుంది.
♦ ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు మెదడులో సగం మాత్రమే ఉపయోగిస్తాయట.
Comments
Please login to add a commentAdd a comment