Blue whale
-
బ్లూ వేల్స్ నాలుక అంత బరువా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు
బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిల్లో అతి పురాతన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో చూడవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ (వెచ్చని) జలాలకు వలసపోతాయి. బ్లూవేల్స్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. ♦ బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు . దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం. ♦ బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ♦ బ్లూ వేల్ నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది. ♦ నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. ♦ నీలి తిమింగలం గుండె మినీ కూపర్ (కారు) పరిమాణంలో ఉంటుంది. ♦ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం మరియు వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం ♦ ఇది గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకదానిని క్రిల్ (రొయ్యల లాంటిది) తింటుంది ♦ బ్లూ వేల్ ప్రతిరోజూ 4 నుండి 6 టన్నుల క్రిల్ తింటుంది. ఫీడింగ్ సీజన్లో, బ్లూ వేల్ ప్రతిరోజూ 3600 చేపలను తింటుంది. ♦ గర్భం దాల్చిన ఒక సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బుల్లి వేల్ దాదాపు 3 టన్నుల బరువు ఉంటుంది. ♦ ఈ బేబీ వేల్ ప్రతిరోజూ 100 గ్యాలన్ల పాలు తాగుతుంది, ప్రతి గంటకు 9 పౌండ్లు (రోజుకు 200 పౌండ్లు) పెరుగుతుంది. ♦ ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు మెదడులో సగం మాత్రమే ఉపయోగిస్తాయట. -
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
ఇంటర్నెట్ను కుదిపేస్తోన్న ఫోటో..
వాషింగ్టన్ : బిడ్డకు ఏమైనా అయితే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. బిడ్డ తిరిగి మామూలు మనిషి అయ్యేదాకా తల్లి బిడ్డను వదిలి ఉండలేదు. ఒక వేళ ఆ బిడ్డ మరణిస్తే.. తల్లి కడుపుకోతను ఎవరు తీర్చలేరు. మాతృప్రేమ అంటేనే అలా ఉంటుంది. దీనికి మనుషులు, జంతువులు, జలచరాలు ఏవి అతీతం కావు. దీన్ని నిరూపించే ఓ రెండు సంఘటనలు వాషింగ్టన్‌లోని ఒలంపిక్ ద్వీపకల్పంలో చోటు చేసుకున్నాయి. జే35 అనే 20 ఏళ్ల నీలి తిమింగలం రెండు వారాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లి అయిన సంతోషం దానికి ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే రెండు వారాలు గడిచేలోపు ఆ బిడ్డ మరణించింది. కానీ జే మాత్రం ఈ నిజాన్ని నమ్మలేకపోతుంది. తన బిడ్డ నిద్ర పోతుందనుకుందో ఏమో.. దాన్ని మేల్కోల్పడం కోసం వీపు మీద ఎక్కించుకుని ఆ ద్వీపకల్పం అంతా తిరుగుతుంది. కానీ ఆ బిడ్డ మాత్రం లేవడం లేదు. హృదయాన్ని కలచివేసే ఈ దృశ్యాన్ని మైల్స్టోన్ అనే ఎన్ఓఏఏ (జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం) అధికారి ఒకరు గమనించారు. మరణించిన బిడ్డతో తిరుగుతున్న జే ఫోటోలను తీసి ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోల గురించి ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగమైన చర్చ నడుస్తోంది. ఇలాంటిదే మరో సంఘటన గురించి కూడా చెప్పారు మైల్స్టోన్. జే50 అనే నీలి తిమింగలం మూడున్నరేళ్ల చిన్నారికి జబ్బు చేసింది. మనుషులమైతే మన బాధను చెప్పుకోగలుగుతాం.. వైద్యం కూడా చేయించుకోగలుగుతాం. కానీ మూగ జీవాల పరిస్థితి అలా కాదు కదా. అవి తమ బాధను ఎవరితోను చెప్పుకోలేవు. పాపం జే పరిస్థితి కూడా అలానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోక బిడ్డను తనతో పాటే తిప్పుకుంటోంది. ఇది గమనించిన మైల్స్టోన్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రసుత్తం వైద్యుల బృందం గాయపడిన జే50 బిడ్డకు వైద్యం చేయడం కోసం ద్వీపకల్పం అంతటా గాలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో బ్లూవేల్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్‌కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజేంద్ర నగర్ సన్సిటీలోని మిఫుల్ టౌన్ విల్లాకు చెందిన వరుణ్(19) బ్లూవేల్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ బిట్స్పిలానీలో రెండో సంత్సరం చదువుతున్న వరుణ్ సెలవుల కారణంగా వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. గత మూడు రోజుల నుంచి తన రూమ్ నుంచి బయటకు రాకుండా బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. అయితే కుమారుడి ప్రవర్తను గమనించిన తల్లి పరిస్థితిని గురించి వరుణ్ తండ్రికి వివరించింది. విషయం తెలుసుకున్న వరుణ్ తండ్రి ఇంట్లో ఇంటర్నెట్ను తీసేయించాడు. దీంతో మనస్థాపానికి గురైన వరుణ్ తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని, ఊపరి ఆడకుండా గొంతుకు తాడుతో గట్టిగా బిగించుకుని గతరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రోజు మొత్తం వరుణ్ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వరుణ్ గదిని తనిఖీ చేయగా విగతజీవుడిగా పడిఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వరుణ్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్లూవేల్ గేమ్ కారణంగానే వరుణ్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో వరుణ్ గేమ్స్ ఆడిన లాప్టాప్, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం వరుణ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
బ్రిడ్జిపై నుంచి దూకబోయాడు!
సాక్షి, బెంగళూరు : ప్రమాదకర బ్లూవేల్ గేమ్ మరో యువకుడిని బలిగొనబోయింది. టాస్క్ పూర్తి చేయాలని బ్రిడ్జిపై నుంచి దూకబోయిన అతడిని పోలీసులు రక్షించారు. బిహార్‌కు చెందిన అజయ్ (25) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతూ ఐటీసీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొద్దికాలంగా అతడు బ్లూ వేల్ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో బ్రిడ్జిపై నుంచి కిందకు దూకాలనే టాస్క్‌ను పూర్తి చేయడానికి ఐటీసీ సమీపంలోని విండ్సన్ మ్యానర్ బ్రిడ్జిపైకి ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇది గమనించి అతడిని రక్షించారు. అనంతరం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. త్వరలో బాధితుడికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, కొద్దిరోజులు తల్లిదండ్రులతో గడపడానికి అతడిని స్వస్థలానికి పంపిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్!
-
క్రమశిక్షణ
-
ఆన్లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్!
► విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న గేమ్స్ ► అత్యంత ప్రమాదకరంగా 23 రకాల ఆటలు ► పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ► పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు ► తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులతో విద్యాశాఖ భేటీ ► పిల్లల ప్రవర్తనను పరిశీలించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు ఆన్లైన్లో, కంప్యూటర్లు, మొబైల్ఫోన్లలో ఆడే మరెన్నో గేమ్స్ విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హింసా ప్రవృత్తి, విపరీత ధోరణులు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాము ఏదైనా చేయగలమనే అత్యుత్సాహం, ఇవి ప్రమాదకర అంశాలనే విచక్షణను కోల్పోవడం వంటి లక్షణాలు నెలకొనడంతోపాటు చివరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికీ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తోపాటు గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), వైస్సిటీ, మారియన్, స్వార్డ్, డెడ్లీ తదితర 23 రకాల ఆటలు కూడా యుక్త వయసు పిల్లల్లో ప్రమాదకర ధోరణులకు కారణమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. బ్లూవేల్ గేమ్‌తో పాటు విద్యార్థుల రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై శుక్రవారం పాఠశాల విద్యాశాఖ తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో అవగాహన, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించి పాఠశాలలకు పంపించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రమాదకర గేమ్స్‌ను నిషేధించాల్సిందే.. బ్లూవేల్ గేమ్‌తో పాటు అలాంటి ప్రమాదకర ఆటలను నిషేధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అది పిల్లలు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే కౌన్సెలింగ్ ఇప్పించడం, వారు వినియోగించే మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు, ఐటీ నిపుణులు సూచించారు. జీటీఏ కూడా ప్రమాదకరమే.. బ్లూవేల్ గేమ్ మాత్రమేకాదు.. గ్రాండ్ థెఫ్ట్ ఆటో (జీటీఏ), జీటీఏ సాన్ ఆండ్రూస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, మారియన్, స్వార్డ్, డెడ్లీ వంటివి గేమ్స్ కూడా ప్రమాదకరమేనని నిశ్చిత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా జీటీఏ గేమ్ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటోందని తెలిపారు. ఆ గేమ్ పిల్లలను తనకు తానే హీరో అన్న భావనలోకి తీసుకెళుతుందని... పోలీసులను వెంబడించి చంపేలా, రోడ్లపై ఇష్టానుసారంగా వెళ్లేలా ఉండే ఆ గేమ్ కారణంగా పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఈ గేమ్ ప్రభావంతో ఢిల్లీలో ఓ విద్యార్థి తనకు తాను హీరోగా భావించి.. తన తాతనే చంపేశాడని వివరించారు. ఈ యాప్‌తో పిల్లల ఫోన్లపై నిఘా పిల్లలను టార్గెట్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు, ఈ–మెయిళ్లు వంటి రకరకాల మార్గాల్లో బ్లూవేల్ గేమ్ వెబ్‌లింకును పంపుతున్నారని ఐటీ సంస్థ నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు బ్లూవేల్ గేమ్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన గేమ్స్‌ను అడ్డుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్లు, యాప్‌లను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాము కూడా పిల్లల ఫోన్లను నియత్రించేందుకు, నిఘా పెట్టేందుకు తోడ్పడే మొబైల్ యాప్‌ను రూపొందించామని నిశ్చిత్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతిని«ధి రాఘవ్ చెప్పారు. తల్లిదండ్రులు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని.. తమ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని, తర్వాత పిల్లల ఫోన్లలోనూ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలని వివరించారు. అప్పటి నుంచి పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చని... వారు చూసే వెబ్సైట్లు, ఆడుతున్న గేమ్స్ వంటి వాటిని బ్లాక్ చేయవచ్చని చెప్పారు. తమ సేవలు వినియోగించుకునేందుకు ఏడాదికి రూ.182 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సమస్యను అధిగమించేందుకు రెండు మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం సైబర్, డిజిటల్ సెక్యూరిటీకి ప్రాధాన్యమిస్తోందని.. అందుకు తగిన చర్యలు చేపడుతోందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. బ్లూవేల్ గేమ్ యుక్త వయసు పిల్లలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, టీచర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని.. పిల్లల ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వాటి నుంచి పిల్లలను దూరం చేయవచ్చన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిని గమనిస్తూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందించడం ఒక మార్గమని... విద్యార్థులు వినియోగించే సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పకడ్బందీగా నియంత్రించే చర్యలు రెండో మార్గమని తెలిపారు. పిల్లల రక్షణకు ప్రాధాన్యం.. ‘‘పిల్లల రక్షణకు విద్యా శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బ్లూవేల్ గేమ్‌పై ఈ అవగాహన, చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐటీ రంగ నిపుణులను కూడా ఇందులో భాగస్వాములను చేశాం..’’ – పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ -
జోధ్‌పూర్‌లో మరో 'బ్లూవేల్' దారుణం
చెరువులోకి దూకేసిన 17 ఏళ్ల అమ్మాయి.. అదృష్టవశాత్తు పోలీసులకు సమాచారం.. సాక్షి, జోధ్‌పూర్: దేశంలో ’బ్లూవేల్’ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఓ 17 ఏళ్ల అమ్మాయి చేతిపై ’బ్లూవేల్’ ఆకృతిని కత్తితో గీసుకొని.. చెరువులోకి దూకేసింది. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి చెరువులో దూకినప్పటికీ.. అదృష్టశాత్తు అక్కడ ఉన్న స్థానికులు గుర్తించడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గజ ఈతగాళ్లు చెరువు నుంచి ఆమెను కాపాడారు. పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధిత అమ్మాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను కూతురు. సోమవారం సాయంత్రం మార్కెట్‌కు వెళుతున్నానంటూ స్కూటర్ మీద బయటకు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే.. రోడ్డుపై దొరికిందంటూ ఎవరో ఓ వ్యక్తి ఫోన్ ఎత్తి మాట్లాడారు. దీంతో అమ్మాయి గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను వెతకడం ప్రారంభించారు. సాయంత్రం సమయంలో చెరువు సమీపంలో ఆమె స్కూటర్ మీద చక్కర్లు కొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో సమీపంలో ఉన్న కొండమీద నుంచి ఆమె చెరువులోకి దూకేసింది. అక్కడే ఉన్న కొంతమంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో వచ్చిన పోలీసులు అమ్మాయి ప్రాణాలు కాపాడారు. అమ్మాయి చేతిమీద బ్లూవేల్ ఆకృతి కత్తితో గీసి ఉందని, తన చివరి ట్కాస్ పూర్తి చేసేందుకు చెరువులోకి దూకానని ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ ’బ్లూవేల్ చాలెంజ్’ బారినపడి టీనేజ్ బాలబాలికలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ గేమ్‌పై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. -
బ్లూవేల్ భూతం!
♦ పుదుచ్చేరిలో విద్యార్థి ఆత్మహత్య ♦ కోవై, నెల్లై ఆస్పత్రుల్లో మరో ఇద్దరు ♦ ఆండ్రాయిడ్ సెల్ఫోన్లతో అరచేతుల్లో ప్రాణాంతక క్రీడ ♦ బ్లూవేల్ ఉచ్చులో పదివేల మంది యువత ♦ తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త ‘బ్లూవేల్’. దేశ ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న మూడుఆన్లైన్ క్రీడాక్షరాలు ఇవి. ‘నీవు చనిపో లేకుంటే మీకుటుంబంలోని వ్యక్తిని మేమే చంపేస్తాం’ అనే సందేశాలనుఅందుకున్న భయంతో బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్లైన్ క్రీడ మోజులోఅశువులుబాస్తున్నారు. మదురైకి చెందిన విఘ్నేష్ అనే డిగ్రీ విద్యార్థి బ్లూవేల్ క్రీడలో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మొత్తం రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందేపుదుచ్చేరిలో ఎంబీఏ విద్యార్థి శశి హంబాబోరీ గురువారం రాత్రిఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ అంటే ఏమిటి, తమిళనాడులో దాని ప్రభావం.. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: రష్యాలో పుట్టి ఐరోపా, అమెరికా ఖండాంతరాలను దాటి తమిళనాడులోకి ప్రవేశించి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడువేల మందిని పొట్టనపెట్టుకుంది బ్లూవేల్. ఆన్లైన్ గేముల అలవాటున్న యువత, విద్యార్థులు బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఊబిలోకి దిగుతున్నారు. బ్లూవేల్ క్రీడతో ఆత్మహత్యకు పురిగొల్పుతున్న నేరానికి రష్యాకు చెందిన 17 ఏళ్ల బాలికను ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారంటే ఈ రాక్షస క్రీడలోని తీవ్రత తెలుసుకోవచ్చు. గేమ్‌లోని ప్రమాద తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉండే ఈ క్రీడలోకి యువత ఆదే ఉత్సాహంతో దిగుతున్నారు. ఈ వరుసలో మదురైకి చెందిన విఘ్నేష్ ఈ క్రీడకు బానిసగా మారి 19 ఏళ్లకే రెండు రోజుల క్రితం ప్రాణాలు వదిలాడు. 50 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడలో రోజుకొక టాస్క్‌ను ఇస్తారు. ఈ బ్లూవేల్‌లో 50 టాస్క్‌లు ఉంటాయి. ఈ సమయంలో బ్లూవేల్ నిర్వాహకుల వైపు నుంచి ఏదో ఒక సందేశం వస్తుంది. అందులో చేతి మీద బ్లేడుతో మూడు సార్లు కోసుకొని ఆ ఫొటోను పంపాలని, అలాగే తెల్లవారుజామున మిద్దెపైకి వెళ్లి అక్కడి ఏదో ఒక భయంకరమైన సన్నివేశాన్ని ఫొటో తీసి పంపాలని, అర్ధరాత్రి వేళల్లో శ్మశానాలకు వెళ్లాలని, తాము చెప్పిన వారికి సంబంధించిన నాలుగు గోడల మధ్య రహస్య సన్నివేశాల ఫొటోలను పంపాలని, వంటి టాస్క్‌లు ఇస్తారు. ఈ క్రీడలో 30వ టాస్క్ సమయంలో సదరు వ్యక్తి ఆత్మహత్య దశకు చేరుకుంటాడు. ఇవన్నీ తాను ఎందుకు చేయాలని నిర్వాహకులను నిలదీయగానే వారి వికృత భావాలను భయటపెడతారు. క్రీడలోకి ఒక సారి వస్తే వెనుకకు వెళ్లడానికి వీలుకాని పరిస్థితులను కల్పిస్తారు. క్రీడాకారుని సెల్‌ఫోన్‌ను బ్లూవేల్ (అడ్మిన్) నిర్వాహకులు హ్యాక్ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇంత కాలంగా సెల్‌ఫోన్ ద్వారా చేసిన సంభాషణలు, చూసిన వెబ్సైట్లు, ఇతర గోప్యమైన వివరాలన్నీ నిర్వాహకులు తెలుసుకుని ఆ జాబితాను పంపుతారు. తాము చెప్పినట్టు చేయకుంటే ఈ విషయాలన్నీ బాహ్య ప్రపంచానికి చేరవేస్తామని భయపెడతారు. ఉదాహరణగా కొన్ని విషయాలను బయటపెడతారు. దీంతో భీతిల్లిన యువత తమ పరువు పోతుందనే ఆందోళనతో ఉరివేసుకోవడం తదితర ఆత్మహత్యలకు పాల్పడతారు. ఒంటరిగా, మానసిక న్యూనతకు లోనైన యువత ఎక్కువగా ఈ క్రీడ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇదేందో చూద్దాం అనే ఉత్సాహంతో బ్లూవేల్లోకి చొరబడి బయటకు రాలేకపోతున్నారు వీరిలో అత్యధిక శాతం ఉన్నత విద్యావంతులు కావడం విషాదకరం. పుదుచ్చేరి విద్యార్థి బలి ఇదిలా ఉండగా, అసోం రాష్ట్రం జామాజీ ప్రాంతానికి చెందిన రామ్‌కుమార్ బోరీ కుమారుడైన శశి హంబాబేరీ (21) పుదుచ్చేరి కాలాపట్టు యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీకే చెందిన హాస్టల్లోని ఒక పెద్ద హాలులో కొందరు విద్యార్థులతో కలిసి నాలుగు నెలలుగా ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్లైన్ గేమ్‌లు ఆడడం అతనికి హాబీ. యథాప్రకారం గురువారం రాత్రి తన తోటి స్నేహితులను బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌కు పిలిచాడు. ప్రమాదకరమైన ఈ గేమ్ గురించి తెలిసిన ఇతర విద్యార్థులు అతనితో ఆడేందుకు నిరాకరించారు. దీంతో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి వెళ్లిన శశి ఒంటరిగా కూర్చుని బ్లూవేల్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటికి హాస్టల్ గదికి వచ్చి తన సెల్‌ఫోన్‌ను పెట్టి వెళ్లిపోయాడు. శశి ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన విద్యార్థులకు హాస్టల్‌కు 50 మీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో వేప చెట్టుకు ఉరివేసుకుని శవంగా వేళాతుండగా గుర్తించారు. మృతుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా బ్లూవేల్ వల్లనే శశి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. పోస్టుమార్టం తరువాత పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో పదివేల మంది బ్లూవేల్ బాధితులు– ఆస్పత్రుల్లో మరో ఇద్దరు విద్యార్థులు: గురు, శుక్రవారాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనల ఆధారంగా విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు రాష్ట్రంలో పదివేల మంది విద్యార్థులు బ్లూవేల్ గేమ్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. బ్లూవేల్ గేమ్ మోజులో పడి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులను శుక్రవారం సకాలంలో గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించారు. తిరునెల్వేలి జిల్లా వెల్లియూర్లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి బ్లూవేల్ గేమ్‌లోకి దిగి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో గుర్తించారు. అతని చేతిపై బ్లేడుతో గాట్లు, ఒంటి నిండా వాతలు పెట్టుకున్న గాయాలను గుర్తించి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా ఎస్పీ అరుణ్శక్తి కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అలాగే కోయంబత్తూరు జిల్లా కులియముత్తూరులోని ఒక ప్రయివేటు మెట్రిక్ స్కూల్ విద్యార్థి తన చేతిపై బ్లూవేల్ చిహ్నాన్ని చేతిపై బ్లేడుతో గీసుకుని ఉండడాన్ని గుర్తించిన పాఠాశాల యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనికి కౌన్సిల్ ఇచ్చి పంపివేయగా, ఆన్లైన్ ఆటలో కొనసాగాలని బ్లూవేల్ నిర్వాహకుల నుంచి సదరు విద్యార్థికి బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ గేమ్‌లో ఏముందో అనే ఆసక్తితో దిగాం, ఆ తరువాత బైటకు రాలేకపోయామని బాధిత విద్యార్థులు పోలీసులకు వివరించారు. తన కుమారునితో 75 మంది విద్యార్థులు బ్లూవేల్ గేమ్ అడుతున్నట్లు తనకు తెలుసని మదురైలో గురువారం ఆత్మహత్యకు పాల్ప డిన విఘ్నేష్ తల్లి జయమణి మీడియాకు తెలిపారు. విద్యాసంస్థల్లో హెచ్చరికలు: బ్లూవేల్ క్రీడలోని ప్రమాదపు పోకడలను వివరిస్తూ, మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనే సందేశంతో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బోర్డులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశింది. విద్యార్థుల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ టీకే రాజేంద్రన్ ఆదేశించారు. -
బ్లూవేల్స్ భూతం: బాలుడి ఆత్మహత్య
లఖ్‌నవూ: గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్ ఆన్లైన్ గేమ్ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హమీపూర్ జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని మౌదహా గ్రామానికి చెందిన పార్థ్సింగ్(13) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్తానని చెప్పిన కుమారుడు గదిలో నుంచి బయటకు రాకపోవడం గుర్తించిన తండ్రి తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించగా.. అక్కడ తండ్రి సెల్‌ఫోన్ లభించింది. ఫోన్లో బ్లూవేల్ 50 ఛాలెంజ్ పూర్తిచేసినట్లు నమోదైంది. దీంతో బ్లూవేల్ బారిన పడే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తమ కుమారుడు గత కొన్ని రోజులుగా మొబైల్లో ఆటలు ఆడుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. -
ఆ క్రీడ నా కుమారుడిని బలితీసుకుంది!
కేరళ: బ్లూవేల్ గేమ్ వలనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే గత నెల 26న తిరువనంతపూర్కు చెందిన మనోజ్(16) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ గత ఏడాది బ్లూవేల్ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకుని, గేమ్‌కు సంబంధించి రోజుకో టాస్క్ పూర్తి చేస్తూ చివరి దశకు వచ్చాడు. అతనిలో రోజుకో మార్పు చోటుచేసుకునేదని తల్లి చెప్పింది. ఎవరినైనా చంపాలి లేకపోతే నేనైనా చావాలి అంటూ అందరిని ఆశ్చర్యపరిచే మాటలనే వాడని ఆమె పెర్కొన్నది. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడని కాకపోతే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడన్నది. చనిపోయే ముందు అతని ఫోన్లో ఆ గేమ్‌ని డిలీట్ చేశాడని చెప్పింది. బ్లూవేల్ గేమ్ వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. -
వామ్మో.. బ్లూ వేల్.!
► టీనేజర్ల ప్రాణాలు తీస్తోన్న వికృత క్రీడ ► టాస్క్‌ల పేరిట బ్లాక్‌మెయిలింగ్ ► ఆత్మహత్య చేసుకునే దాకా వదలరు ► తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లలకు శ్రీరామరక్ష అంటున్న పోలీసులు పుణె: మీ పిల్లలు ఆన్లైన్ గేములు ఆడుతున్నారా? ఐతే వారిని ఓ కంట కనిపెట్టండి. ఎందుకంటే.. బ్లూవేల్ అనే ఆట ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇది ఆడినవారు దీనికి బానిసలవడం, తరువాత ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. రష్యాకు చెందిన 23 ఏళ్ల మానసిక వ్యాధిగ్రస్తుడు ఈ వికృత క్రీడను రూపొందించాడు. 15 ఏళ్లలోపు విద్యార్థులే లక్ష్యంగా ఈ గేమ్ నిబంధనలు ఉండటం గమనార్హం. వీరికి లోకజ్ఞానం అంతగా లేకపోవడం, ప్రతీది తెలుసుకోవాలన్న కూతూహలం అధికంగా ఉండటమే ఈ ఆటకు బానిసలుగా మారుస్తోంది. నిన్న మొన్నటిదాకా ప్రపంచదేశాలని గడగడలాడించిన ఈ వికృతక్రీడ ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. మొన్న ముంబైలో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో బ్లూవేల్ గేమ్ మనదేశంలోనూ ఉందన్న కలకలం రేగింది. మన్‌ప్రీత్ గేమ్‌కు బానిసయ్యాడు. రూల్స్‌లో భాగంగా ఆఖరు టాస్క్ విధించారు. దాని ప్రకారం.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. దానికి ముందు ఓ ఫోటోను నెట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చేసి ప్రాణాలు తీసుకున్నాడు ఆ అమాయక బాలుడు. కన్నవారికి తీరనిశోకం మిగిల్చాడు. తాజాగా షోలాపూర్‌లోనూ దీని ఆనవాళ్లు వెలుగుచూడటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. 9వ తరగతి విద్యార్థి ప్రవర్తనలో తేడాలు తల్లిదండ్రులు గమనించారు. ఓ రోజు లేఖరాసి అదృశ్యమవడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాలుడి ఫొటోతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బ్లూవేల్ గేమ్ టాస్క్ పూర్తిచేయడానికి తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్నట్లు బాలుడు చెప్పడంతో వారు హతాశయులయ్యారు. తాజాగా ఇండోర్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్కూలు బిల్డింగు మీద నుంచి దూకేందుకు ప్రయత్నించడం కలకలం రేగింది. తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు బలవంతంగా ఆపితేగానీ వారికి అతడిని నిలువరించడం సాధ్యపడలేదు. దీంతో పిల్లలకు ఆన్లైన్ గేమ్స్ అందుబాటులో ఉంచకూడదని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడు మొదలైంది? ఆన్లైన్ వేదికగా సాగే ఆట. దీన్ని రూపొందించిన వ్యక్తి ఓ మెంటల్. వాడిని రష్యా పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టినా.. అప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ అవడంతో ప్రపంచమంతా పాకిపోయింది. అతడిలానే మానసికంగా గతితప్పినవాళ్లు దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఆందోళనకరంగా మారింది. ఏకంగా 130మందికి పైగా రష్యన్ టీనేజర్లు ఈ గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఎలా ఆడతారు? బ్లూవేల్ ఆడాలంటే ముందు ఇందులో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 50 దశలు ఉంటాయి. టాస్క్‌లు అప్పగించేందుకు మెంటార్లు ఉంటారు. వీరు తొలుత చాలా సులభమైన టాస్క్‌లు అప్పజెబుతారు. టాస్క్ పూర్తికాగానే అందుకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేస్తే మరో దశకు చేరుకుంటారు. అలా ఆఖరు దశ 50 వ దశ. ఇందులో ఆత్మహత్య చేసుకోవాలి. చేసుకునే ముందు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలి. చేయకపోతే ఏం చేస్తారు? 1. మొదట్లో సులువైన పనులే అప్పజెబుతారు. 2. క్రమంగా డోసు పెంచుతూ పోతుంటారు. 3. తాము ఇదివరకు చేయని పనులు కావడంతో విద్యార్థులు సైతం ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. తీవ్రత పెరిగే కొద్ది అసభ్యకరమైన పనులు చేయమంటారు. ప్రతీదానికి ఆధారంగా ఫొటో తీసిపెట్టాలి. అపుడే, మరో టాస్క్ అప్పజెబుతారు. 5. జీవితంపై అవగాహన ఉన్న, తెలివైన విద్యార్థులు దీన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. కొందరు మాత్రం కొత్తటాస్క్పై ఆసక్తితో ఆడుతున్నారు. 6. మరికొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారు. టాస్క్‌లో భాగంగా అసభ్యకరమైన పనులు చేయించుకుని ప్రతీది ఫొటో అప్లోడ్ చేయమంటారు కాబట్టి.. గేమ్ మధ్యలో ఆపితే వాటిని ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తారు. దీంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. ఇష్టం లేకున్నా గేమ్‌లో కంటిన్యూ అవుతున్నారు. 7. బ్లూవేల్ ఆడుతున్నట్లు ఎవరికీ చెప్పకూడదు గేమ్రూల్స్లో ఇదే కీలకం. అందుకే, విద్యార్థులు చనిపోయే వరకు ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఎలా గుర్తించాలి? 1. ఈ గేమ్ ఆడే విద్యార్థులు అన్యమనస్కంగా ఉంటారు. ఎవరితో మాట్లాడరు, రాత్రుళ్లు మేల్కొంటారు. తమను తాము గాయపరుచుకుంటారు. 2. టాస్క్ పూర్తి చేసిన ప్రతీసారి ఏదో సాధించామని, అంతులేని ఆనందంతో కనిపిస్తుంటారు. 3. ఆందోళనతో, నిద్రలేమితో బాధపడుతుంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. 4. నిత్యం ఆన్లైన్, ఇంటర్నెట్ కోసం వెంపర్లాడుతుంటారు. -
బ్లూవేల్ భూతం: బాలుడిని రక్షించిన పోలీసులు
ముంబైః ప్రపంచదేశాలనే గడగడవణికిస్తున్న మృత్యు క్రీడ ‘బ్లూ వేల్’ బారిన పడిన ఓ 14 ఏళ్ల బాలున్ని పోలీసులు రక్షించారు. ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్ గేమ్ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు. వివరాల్లోకి వెళ్తే షోలాపూర్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుధీర్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. అయితే అయిదారు రోజుల నుంచి సుధీర్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తల్లిదండ్రులు గమనించారు. సెల్ ఫోన్లో బిజిగా ఉండడం కూడా గమనించారు. ముఖ్యంగా అస్వస్థతతోపాటు సరిగా నిద్రపోకపోవడం తదితరాలను గమనించి సుధీర్‌కు నిద్రపోయేందుకు రోజు తలకి ఆయుర్వేదం అయిల్‌తో మసాజ్ చేసేవారు. అయితే ఈ బ్లూ గేమ్ బారిన పడ్డాడన్న సంగతి వారికి తెలియలేదు. చెప్పపెట్టకుండానే బస్సెక్కాడు... కొన్ని రోజులుగా సరిగా నిద్రపోకుండా ఉన్న సుధీర్ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోవారికి ఎవరికి ఏమి చెప్పకుండానే ఇంట్లోనుంచి బయటపడ్డాడు. క్రికెట్ అకాడమి కోసమని తీసుకున్న రూ. మూడు వేల రూపాయలతోపాటు, సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరాడు. తాను ఇళ్లు వదిలి వెళ్తున్నానని తనను వెదికించేందుకు ప్రయత్నం చేయవద్దని లేదంటే తానేమైన చేసుకుంటానని బెదిరిస్తూ రాసిన లేఖను చూసి ఇంట్లో సు ధీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగారు. సెల్‌ఫోన్‌తోనే ఆచూకి లభ్యం....! సుధీర్ ఇళ్లు విడిచి వెళ్లడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సుధీర్ వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి పుణే దిశలో టేంబూర్ణీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. దీన్నిబట్టి పుణే దిశగా సుధీర్ ప్రయాణిస్తున్న భావించిన పోలీసులు బస్సు డిపోతో పాటు అటువైపు బయలుదేరిన బస్సు డ్రైవర్లు కండక్టర్లతో సంప్రదింపులు జరిపి బాలున్ని వివరాలు చెప్పి ఇలాంటి బాలుడు బస్సులో ఉన్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నంచేశారు. ఇంతలో ఓ బస్సులో వీరు చెప్పిన వివరాలనుసారం ఓ బాలుడు ఉన్నట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లో భిగవాన్ బస్సుస్టాండ్‌కు చేరుకోనున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి పోలీసులకు సమచారం అందించారు. అనంతరం ఆ బస్సులోని సుధీర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దర్యాప్తులో ఇదంత బ్లూ బెల్ గేమ్ ఆడడం వల్లే జరిగిందని తెలిసింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఘోరం జరగకముందే పోలీసులు సుధీర్‌ను రక్షించగలిగారు. -
ఈగేమ్ ప్రాణాలు తీస్తోంది..!
న్యూఢిల్లీ: ఓ ఆండ్రాయిడ్ గేమ్ ప్రాణాలు తీసుకొనేల యువతను పేరేపిస్తుంది. చిన్న చిన్న పనుల నుంచి మొదలు పెట్టి చివరకు మనతో ఆత్మహత్య చేసుకొనేలా చేస్తుంది. దాని పేరే 'బ్లూ వేల్ ఛాలెంజ్'. ఈ గేమ్ ఆడిన వారిలో సుమారు ఎక్కువ శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ఆండ్రాయిడ్ గేమ్స్ లాగే ఇదీ ఓగేమ్. దీనిలో మొదట రిజిస్టర్ అవగానే 50 రోజల పాటు ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి పనికి ప్రూఫ్ చూపించాలి. మొదట్లో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మొదలై పోను పోను నరకాన్ని చూపిస్తాయి. ఉదయం నాలుగు గంటలకే భయానక వీడియోలు చూడమని, డాబా మీదకు వెళ్లమని, చేతిమీద కోసుకోమని ఇలా అనేక విధాలుగా చేయాల్సిన టాస్కుల లిస్టు చెబుతుంది. ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటుంది. 50వరోజు వచ్చేసరికి చనిపోమని ఆదేశిస్తుంది. దీంతో మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు చివరికి ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటికే ఈ గేమ్ వల్ల రష్యాలో పలువురు టీనేజ్ యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. మనం ఇంట్లో పిల్లలకు మొబైల్ ఇచ్చే ముందు ఇలాంటివి లేకుండా చూడాలి. తరచుగా వారి ఫోన్లు తనిఖీ చేస్తుండాలి. లేకపోతే వారిని కోల్పోవాల్పి వస్తుంది. ఇందులో వచ్చే కొన్ని టాస్కులు చూడండి. కానీ మీరు మాత్రం ట్రై చేయకండి