డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు.
మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట.
ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు.
ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
Comments
Please login to add a commentAdd a comment