
జియోగ్రాఫిక్ టంగ్!
ప్రపంచపటం అంతా నాలుకమీదే ఉంటుందనుకొని పొరపాటు పడకండి. దేశాలు, రాజధానుల పేర్లు నోట్లో
మెడి క్షనరీ
ప్రపంచపటం అంతా నాలుకమీదే ఉంటుందనుకొని పొరపాటు పడకండి. దేశాలు, రాజధానుల పేర్లు నోట్లో ఆడుతుంటాయని అపోహ చెందకండి. ‘జియోగ్రఫిక్ టంగ్’ అనేది నాలుకకు వచ్చే ఒక రకమైన జబ్బు. దీన్నే వాండరింగ్ ర్యాష్ ఆఫ్ టంగ్ అనికూడా పిలుస్తారు. అంటే నాలుకమీద వచ్చే ర్యాష్... జిహ్వ మీద అటూ ఇటూ సంచరిస్తూ ఉంటుందని అర్థం.
నాలుక మీద ఉండే పాపిల్లే అనే నాలుక పైపొర చివరలకు ఇన్‌ఫ్లమేషన్ వచ్చి... అది ఎర్రబారుతుంది. అంతేకాదు... ప్రపంచపటంలోని ద్వీప సమూహాల షేపుల్లో రూపు సంతరించుకుంటూ ఉంటాయి. వాటి రూపు మారిపోతూ కూడా ఉంటుంది. ఈ కండిషన్ హానికరం కాదు. తరచూ రూపుమార్చుకునే ద్వీపసమూహాల్లా మారిపోతుండటం వల్ల దీన్ని ‘బినైన్ మైగ్రేటరీ గ్లాసైటిస్’ అని కూడా అంటారు.