బీరకాయ బదులు...
పిట్ట గోడ
వనజ: పిన్నిగారూ, మా ఆయనకి బీరకాయ కూరంటే చాలా ఇష్టం.
పిన్నిగారు: అదికాదే అమ్మాయ్, అల్లుళ్లకి గుత్తి వంకాయ కూరంటే ఇష్టముండాలికానీ, ఈ బీరకాయ కూర గొడవేంటి..?
వనజ: అది కాదు పిన్నిగారూ, బీరకాయ కూరలో దండిగా ఉల్లిపాయలు తరిగి వేస్తే నాలుకకి బీరకాయ, పంటికి ఉల్లిపాయ తగిలి భేషుగ్గా ఉంటుందని ఆయనంటూ ఉంటారు.
పిన్నిగారు: ఇక్కడేదో తేడా కొడుతోందే అమ్మాయ్! ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు!
వనజ: మా వారు సహృదయులు. ‘ఎందుకులే వనజా! వెధవది, బీరకాయ ఊరికే దొరుకుతుంది కానీ, ఉల్లిపాయల ధర మండిపోతోంది. మరీ ఉల్లిపాయ లేకుండా బీరకాయ ఏం తింటాం... అందుకే ఇవాళ్టికి బీరకాయ బదులు బీరు కాయతో సర్దుకుపోదాం’ అంటూ అలా బజారులోకి వెళ్లారు.