దేశ రాజధానిలో ఉల్లి ధరలకు చెక్ పెట్టే లక్ష్యంతో.. ఉల్లి గడ్డలతో నిండిన ఒక ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి చేరుకుంది. నాసిక్ నుంచి ప్రత్యేక గూడ్స్ రైలులో సుమారు 1,341 టన్నుల ఉల్లి ఢిల్లీకి చేరుకున్నట్లు.. నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.
పొలాల నుంచే నేరుగా ఉల్లి కొనుగోలు చేస్తే.. రవాణా సమయం, ఖర్చులు వంటివి కూడా తగ్గుతాయి. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా కొంత తక్కువ ధరకే ఉల్లిని విక్రయించవచ్చు. పలు నగరాల్లోని మార్కెట్‌లలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టన్నుల ఉల్లి.. ఢిల్లీకి చేరుకోవడంతో వారందరూ అధిక ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు.
గతంలో కూడా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ఉల్లి సరఫరా చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రజల మీద ధరల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతోనే సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేదించింది. ఏప్రిల్-జూన్‌లో పండించిన ఉల్లి మరి కొన్ని రోజుల వరకు వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment