ఈ భూమి ఓ వింత ప్రపంచం. అలాగే ఇక్కడ పుట్టే వింత జబ్బులు మనుషులను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వందేళ్లకు ఓ సారి పుట్టుకొచ్చే జబ్బుల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోతే.. ఇప్పుడు కరోనా ప్రపంచ దేశాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ వస్తుందో.. ఏ కొత్త రకం వ్యాధి పుట్టుకొస్తుందో.. తెలియక ప్రపంచ జనులు హడలి చస్తున్నారు.
ఒట్టావా: కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.
అంతేకాకుండా బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment