Taiwan is China's Taiwan: తైవాన్ స్వయం పాలన, ప్రజాస్వామ్య దేశం. ఐతే చైనా ఈ తైవాన్ని తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది కూడా. ఈ మేరకు సింగపూర్‌లో జరిగిన మూఖముఖి సమావేశంలోయూఎస్ రక్షణాధికారి లాస్టిన్‌తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే చైనాను తైవాన్ నుంచి విడదీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ ఎవరైన విడదీయడానికి ధైర్యం చేస్తే ఖర్చుతో నిమిత్తం లేకుండా యుద్ధం ప్రారంభించడానికీ చైనా వెనుకాడదని హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ స్వాతంత్ర్యం కావాలని ప్రకటిస్తే బీజింగ్ తప్పక యుద్ధం ప్రారంభించడానికి వెనుకాడదు అని కూడా తేల్చి చెప్పారు. తైవాన్ చైనాకి సంబంధించినదేనని నొక్కి చెప్పారు. చైనాను నియంత్రించడానికి తైవాన్‌ని ఉపయోగించుకోవాలని చూడొద్దంటూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఆ సమావేశంలో అమెరికా రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పెట్టే చర్యలకు చైనా చాలా దూరంగా ఉండాలంటూ ఆ దేశ రక్షణ మంత్రికి గట్టి కౌంటరిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment