
ఓటుతోనే దేశానికి దిశానిర్దేశం
ఎమ్మెల్యే మోదుగుల
పాతగుంటూరు: దేశానికి దిశానిర్దేశం చేసేది ఓటు హక్కేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమాదేశ మందిరంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటును ఆభరణంలా కాకుండా ఆయుధంలా చూడాలని చెప్పారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియగా మారటం యువతకు సదవకాశమన్నారు.
ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం రావలసిన అవసరం ఉందన్నారు. డీఆర్‌వో కె.నాగబాబు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారు ఆన్‌లైన్ ద్వారా లేదా తహశీల్దార్, బూత్ స్థారుు అధికారి ద్వారా ఓటరుగా నమోదుకావచ్చని వివరించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లకు ఎమ్మెల్యే మోదుగుల గుర్తింపు కార్డులను అందజేశారు.
వివిధ అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు జేసీ వెంకటేశ్వరరావు, గుంటూరు ఆర్‌డీవో భాస్కర నాయుడు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, కాంగ్రెస్ నేత అడివి ఆంజనేయులు, అవగాహన సంస్థ ప్రతినిధి కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.