బదిలీ అయినా ఓటు హక్కు! | The transfer of the right to vote! | Sakshi
Sakshi News home page

బదిలీ అయినా ఓటు హక్కు!

Published Mon, Mar 10 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

బదిలీ అయినా ఓటు హక్కు!

బదిలీ అయినా ఓటు హక్కు!

వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 2008 ఆగస్టు 4 నుంచి 2009 జూలై 20వ తేదీ వరకు శివకోటిప్రసాద్, 2011 నవంబర్ 1 నుంచి 2013 అక్టోబర్ వరకు వివేక్‌యాదవ్ పనిచేశారు. వివేక్‌యాదవ్ ఇక్కడ నుంచి గుం టూరు జేసీగా బదిలీపై వెళ్లి కొన్ని నెలలే అవుతున్నా శివకోటి ప్రసాద్ వెళ్లి ఐదేళ్లు పూర్తికావొస్తుంది.

అయినప్పటికీ వారికి ఇంకా వరంగల్ నగరంలో ఓటు హక్కు ఉంది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌‌స సమీపంలోని కమిషనర్ క్యాంప్ ఆఫీస్ ఇంటి నంబర్  6-1-1పై వివేక్‌యావ్-రోలీయాదవ్ దంపతులతో పాటు శివకోటిప్రసాద్-సాయినిర్మల దంపతులకు ఓటు హక్కు నమోదై ఉంది.
 

సర్వే చేశారా..

 నకిలీ ఓట్లతో పాటు స్థానికంగా నివాసముండని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కొందరు స్వచ్ఛందంగా ఓటుహక్కు తొలగించుకున్నా.. మరికొందరి పేర్లను సిబ్బంది సర్వే చేసి తొలగించాలి. ఇలాంటి ప్రక్రియ నగరంలో పలుమార్లు జరిగింది. అయినా బదిలీపై వెళ్లిన అధికారుల పేర్లనే తొలగించలేదంటే సాధారణ ప్రజలు ఎందరు ఓటర్ల జాబితాలో ఉన్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూతూ మంత్రంగా సర్వే జరిగిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలేమో!
 

 ప్రస్తుత కమిషనర్ పేరు లేదు..

 ప్రస్తుత  నగర  ప్స్తుపాలక సంస్థ కమిషనర్ సువర్ణ పండాదాస్ పేరు ఓటర్ల జాబితాలో లేదు. నాలుగు నెలల క్రి తం విధుల్లో చేరిన ఆయన నమోదు చేసుకోలేదా, దరఖాస్తు ఇచ్చినా నమోదు కాలేదా అనే విషయం తెలియరావడం లేదు. ఒకవేళ దరఖాస్తు ఇచ్చినా నమోదు చేయలేదంటే సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి. మరో నాలుగు రోజుల్లో తుదిజాబితా ఇబ్బంది కానున్న నేపథ్యంలో.. సువర్ణ పండాదాస్ దరఖాస్తు చేసుకోలేదంటే కారణమేమిటో తెలియాల్సి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement