చిలకలూరిపేట, ఓటు హక్కు వినియోగించుకొన్న ఓ వృద్ధురాలు కొద్దినిమిషాల వ్యవధిలోనే మరణించిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ వార్డుకు చెందిన షేక్ మౌలాబీ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాను ఓటు వేయాలని అభ్యర్థించటంతో బంధువులు వార్డు పరిధిలో శ్రీశారద ప్రాథమిక పాఠశాలకు తీసుకువెళ్లారు. ఓటు వేసి ఇంటికి వచ్చిన మౌలాబీ కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఆమె ఆఖరి కోరిక తీరినట్టయింది
తీరిన చివరి కోరిక
Published Mon, Mar 31 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement