municipal elections 2014
-
మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాల జారీ
-
ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు..
సాక్షి, కరీనంనగర్/రామగుండం: రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ప్రకటించింది. కొత్త చట్టం మేరకు కౌన్సిలర్‌గా పోటీ చేసే వ్యక్తికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా పోటీ చేయవచ్చని పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల వ్యయాన్ని దాని ద్వారానే నిర్వహించాలని తెలిపింది. మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.1,250, ఇతర కులాలవారు అయితే రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు.. వార్డు, డివిజన్లో సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత పురపాలక, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదై ఉండాలి. ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి. 21 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు. మునిసిపాలిటీలో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. మునిసిపాలిటీ ఆస్తులు లీజుకు తీసుకోకూడదు. బాకీ ఉండొద్దు. మునిసిపాలిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు. దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించుకున్న వారు పనికిరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. గతంలో పోటీ చేసిన ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండరాదు. అనర్హత గడువు ముగియకున్నా పోటీకి అనర్హుడు. నాలుగు కంటే ఎక్కువ సార్లు నామినేషన్ వేయకూడదు. ప్రతీ నామినేషన్ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి రూ.20 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ నామినేషన్ సమయంలో సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఇకదానికి డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున మధ్యాహ్నం 3 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి ‘బి’ ఫాం అందించాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసినా, వార్డులో మినహా ఇతర వార్డుల్లో నామినేషన్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు. -
నిధులు రావు.. పనులు కావు..
మండపేట, న్యూస్‌లైన్ : వివిధ కారణాలవల్ల 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రూ.43.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంతవరకూ ప్రతిపాదనల దశ కూడా దాటని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు మూడు వాయిదాల్లో ఆర్థిక సంఘం నిధులు విడుదలవడం పరిపాటి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని ఆయా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు రూ.19.38 కోట్లు,2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.23.89 కోట్లు వార్షిక కేటాయింపులు చేశారు. మొత్తం రెండేళ్లకు కలిపి రూ.43.27 కోట్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్నా ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరపకపోవడంతో పట్టణాల్లో స్థానిక సంస్థలు ఏర్పడలేదు. అలాగే 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల నిధుల వినియోగానికి సంబంధించిన నివేదికలు అందజేయడంలో పలు మున్సిపాల్టీలు తాత్సారం చేశాయి. ఈ రెండు కారణాలవల్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల వినియోగానికి లభించని అనుమతులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్), లే అవుట్ రెగ్యులేజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సమకూరిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన తర్వాత వాటిని బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధులకు సర్దుబాటు చేసేవిధంగా అప్పట్లో పురపాలన సంచాలకుల (డీఎంఏ) నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు పురపాలక సంఘాల్లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీంల ద్వారా వచ్చిన సుమారు రూ.21.37 కోట్లతో వివిధ పనులకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. కానీ, డీఎంఏ నుంచి ఇప్పటివరకూ అనుమతులు రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.25.63 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.25.63 కోట్లు కేటాయించింది. రాజమండ్రి కార్పొరేషన్‌కు రూ.7.55 కోట్లు, కాకినాడకు రూ.8.28 కోట్లు, అమలాపురం మున్సిపాల్టీకి రూ.1.17 కోట్లు, మండపేటకు రూ.1.18 కోట్లు, సామర్లకోటకు రూ.1.25 కోట్లు, తునికి రూ.1.18 కోట్లు, పిఠాపురానికి రూ.1.16 కోట్లు, పెద్దాపురానికి రూ.1.09 కోట్లు, రామచంద్రపురానికి రూ.96.4 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతీకి రూ.55.99 లక్షలు, గొల్లప్రోలుకు రూ.52.73 లక్షలు, ఏలేశ్వరానికి రూ.70.85 లక్షలు కేటాయించింది. కాగా, ఈ నిధుల్లో డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్, సర్వీస్ లెవెల్ బెంచ్ మార్కుల కోసం ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లలో రూ.17 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ.13.4 లక్షల నుంచి రూ.14.6 లక్షల వరకూ, నగర పంచాయతీల్లో రూ.13.4 లక్షల చొప్పున వెచ్చించాలని సూచించింది. మిగిలిన నిధులను పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తాగునీటి అవసరాలు, పైప్లైన్ల మార్పు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాలి. ఈ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులపై ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి డీఎంఏ ప్రతిపాదనలు తీసుకున్నారు. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. త్వరితగతిన నిధులు విడుదల చేయడం ద్వారా పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పల్స్’ ఉండదు
* ఆయా నియోజకవర్గాల మొత్తం ఓట్లకు, ఆ పరిధిలోని మున్సిపోల్స్‌లో పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం వివరాలు * సీమాంధ్ర మొత్తం ఓటర్లు 3.68 కోట్లు * 92 మున్సిపాలిటీల్లోని ఓటర్లు 44.83 లక్షలే * కేవలం పట్టణ ఓటరు మనోగతానికే పరిమితం * స్థానిక అంశాలకే ఓటరు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటమవుతాయా? లేక స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సార్వత్రిక ఫలితాలకు తేడా ఉంటుందా? సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,67,62,975 ఓట్లుండగా... 44,82,714 ఓట్లు మాత్రమే ఉన్న 92 మున్సిపాలిటీల ఫలితాలను చూసి సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని పరిశీలకులు చెబుతున్నారు. అందులోనూ 33,49,076 ఓట్లు మాత్రమే పోలైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే మొత్తంగా స్థానిక అంశాలే ప్రధాన పాత్ర పోషించినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే సాగగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. * సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలోని 92 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ 92 మున్సిపాలిటీలు 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అలాగే ఏడు కార్పొరేషన్లు 12 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నాయి. అంటే మొత్తం 99 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే మున్సిపాలిటీలున్నాయి. ఇవి కాకుండా 76 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదు. * 92 మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 44,82,714 మాత్రమే. కానీ ఈ మున్సిపాలిటీలున్న 87 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,86,000. అంటే 87 నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో మున్సిపల్ ఓటర్లు 24 శాతమే. మిగతా 76 శాతం(1,40,03,286) మందిని పరిగణించకుండా మొత్తం ఫలితాలను విశ్లేషించడం సాధ్యం కాదు. * వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటరు మనోగతాన్ని ప్రతిబింబించని మున్సిపల్ ఎన్నికల సరళినే మొత్తం ఫలితాల సరళిగా భావించడంలో అర్థం లేదని పరిశీలకులు విశ్లేషించారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. మొత్తం 92 మున్సిపాలిటీల్లో కలిపి వైఎస్సార్సీపీకన్నా టీడీపీకి 1,55,211 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో పోలయ్యే ఓట్లకన్నా తక్కువే. మరోవైపు 21 మున్సిపాలిటీల్లో ఒకటి రెండు ఓట్లతో చైర్పర్సన్లు దక్కే పార్టీ మారే అవకాశాలున్నాయి. * రాష్ట్రస్థాయి అంశాలు కానీ, పార్టీల సిద్ధాంతాలు, ఆయా పార్టీల నాయకత్వాలపై ఉండే విశ్వసనీయత తదితర అంశాలు కాకుండా స్థానికాంశాలే ఎక్కువ ప్రభావం చూపించాయి.గతంలో కాంగ్రెస్ లేదా టీడీపీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంలోకి వచ్చినా ఆ తరువాత జరిగే స్థానిక ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పాలైన సందర్భాలున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. -
స్ట్రాంగ్ రూంలకు ‘మున్సిపల్’ ఈవీఎంలు
* భారీ భద్రత మధ్య తరలించాలని ఈసీ ఆదేశం * లెక్కింపు కేంద్రాల నుంచి తరలించే సమయంలో అభ్యర్థులు వెంట ఉండొచ్చు * బాక్సులు భద్రపర్చిన ప్రదేశంలో అభ్యర్థుల అనుచరులూ ఉండేందుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు, ఫలితాలు మే రెండో వారం వరకు వాయిదాపడడంతో... మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత నెల 30న రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేషన్లు, 145 మున్సిపాలిటీలకు ఈవీ ఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపునకు వీలుగా ఈవీఎంలను ఇప్పటివర కు లెక్కింపు కేం ద్రాల్లో ఉంచారు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో వీటిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో సంప్రదించి స్ట్రాంగ్‌రూంలకు తరలించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. ఈవీఎంలను లెక్కింపుకేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించే సమయంలో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమతమ వాహనాల్లో వెనుక రావడానికి అనుమతించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూంల వద్ద అభ్యర్థుల అనుచరులు ఉండడానికి వీలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, మున్సిపల్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను కూడా జిల్లా కేంద్రంలో ఒకే దగ్గర భద్రపరచనున్నట్లు సమాచారం. స్ట్రాంగ్ రూంలలో లైటింగ్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చూడాలని నవీన్‌మిట్టల్ సూచించారు. ఒక మున్సిపాలిటీ ఈవీఎంలను ఇతర మున్సిపాలిటీలతో కలపకుండా జాగ్రత్తపడాలని, 24 గంటలపాటు స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
తీరిన చివరి కోరిక
చిలకలూరిపేట, ఓటు హక్కు వినియోగించుకొన్న ఓ వృద్ధురాలు కొద్దినిమిషాల వ్యవధిలోనే మరణించిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ వార్డుకు చెందిన షేక్ మౌలాబీ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాను ఓటు వేయాలని అభ్యర్థించటంతో బంధువులు వార్డు పరిధిలో శ్రీశారద ప్రాథమిక పాఠశాలకు తీసుకువెళ్లారు. ఓటు వేసి ఇంటికి వచ్చిన మౌలాబీ కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఆమె ఆఖరి కోరిక తీరినట్టయింది -
ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
మాచర్ల: పోలింగ్ స్టేషన్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టిన గుంటూరు జిల్లా మాచర్ల తాజా ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు. పోలింగ్ స్టేషన్లో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ బెదిరించిన సంఘటనలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అరెస్ట్‌కు ఆదేశించింది. మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా 29వ వార్డులో లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
ఈవీఎం పగలగొట్టి.. నరికేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే వీరంగం
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29వ వార్డులో తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. సాయంత్రంలోపు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముంది. -
ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు
-
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి : ఎస్పీ
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషిచేయూలని ఎస్పీ జె.ప్రభాకరరావు పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలపై పోలీసుల నిఘా ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, నిబంధనలను అతిక్రమించినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఎలక్షన్ డేటా కార్డులను లేదా పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత అధికారుల నుంచి పొందాలని సూచించారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, అనుమానాస్పదవ్యక్తులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయూలని, లెసైన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారులు అవగాహనతో మెలగాలి డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శృంగవరపుకోట, పందిరిపల్లిగూడెం, గుమ్మళ్ళపాడు వంటి ద్వీప గ్రామాలలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలపై అవగాహన అవసరం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులు ముందుగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించుకోవాలని కోరారు. సంబంధిత రూట్ మ్యాప్‌లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు. -
సమరానికి సై
సాక్షి, మచిలీపట్నం : మున్సిపల్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించి తలపడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోను మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 218 వార్డుల్లో బహుముఖ పోరు నెలకొంది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పుతో ఆయా పార్టీల అభ్యర్థుల బలాబలాలు తేల నున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోను వైఎస్సార్సీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ పోటీపడి బరిలోకి దించింది. ఇప్పటికే రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఓటమి భయం వెంటాడడంతో కాంగ్రెస్ తరఫున పోటీకి అంతా వెనుకడుగు వేశారు. ఉయ్యూరులో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దించితే ఓటమి తప్పదని భావించి వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థులను బరిలో దించారు. ఉయ్యూరు నుంచి 20 వార్డులకు సారథి అభ్యర్థులను పెట్టడం గమనార్హం. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టిన జైసమైక్యాంధ్ర పార్టీకి ఒకే గుర్తు వచ్చే అవకాశం లేనందున జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సమైక్య తెలుగు రాజ్యం పార్టీ పేరుతో అభ్యర్థులను బరిలో దించారు. బందరు, నందిగామ టాప్.. బందరు మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను ఏకంగా 156 మంది అభ్యర్థులు, నందిగామలో 20 వార్డులకు 158 మంది పోటీలో ఉండడం రికార్డు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేస్తున్న రికార్డు నందిగామ, బందరు మున్సిపాలిటీలకు దక్కింది. బందరుతోపాటు పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో త్రిముఖ పోరు నెలకొంది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోను 218 వార్డులకు గాను 859 మంది బరిలో ఉన్నారు. పోటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 209 మంది ఉన్నారు. మిగిలిన వార్డుల్లో సీపీఎంకు వైఎస్సార్సీపీ మద్దతు పలికింది. 216 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి నిలిచారు. కాంగ్రెస్ కేవలం 103 మందిని మాత్రమే బరిలో దించింది. బీజేపీ 30 వార్డుల్లో పోటీ చేస్తోంది. సమైక్య తెలుగురాజ్యం పార్టీ తరపున 16 మంది పోటీ చేస్తున్నారు. లోక్‌సత్తా 7, సీపీఎం 16, సీపీఐ 8, బీఎస్పీ మూడు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మూడు వార్డుల్లోను పోటీ చేస్తున్నాయి. స్వతంత్రులు 248 మంది బరిలో నిలిచారు. స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల బీ ఫారం సమర్పించిన అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. మిగిలిన వారిని స్వతంత్రులుగా పరిగణించి గుర్తులు కేటాయించారు. పోలింగ్ తేదీకి ప్రచార గడువు మరో పది రోజులే ఉండడంతో అభ్యర్థులు ఇక ప్రచారబాట పట్టారు. -
రూ.200 పింఛన్‌ను 700 చేస్తా: వైఎస్ జగన్
* రాజమండ్రి రోడ్‌షోలో తనను కలిసిన వృద్ధులు, వితంతువులకు జగన్ భరోసా * నాన్న ఓ పెద్దకొడుకులా మీ కోసం ఆలోచించారు.. * రూ.75గా ఉన్న పింఛన్‌ను రూ.200 చేశారు * వైఎస్ వెళ్లిపోయాక ప్రభుత్వం ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు * నేను మీ మనవడిలా మీ కోసం ఆలోచిస్తున్నాను.. * సీఎం కాగానే రెండో సంతకం పెన్షన్ల ఫైలుపైనే చేస్తా.. * నాన్నలాగే ఒకటో తేదీనే పింఛను ఠంఛనుగా అందిస్తా.. సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: వృద్ధులు, వితంతువులకు రూ.200గా ఉన్న పింఛన్‌ను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.700 చేసి వారిని ఆదుకుంటానని, వికలాంగులకు రూ.1000 పింఛన్‌ను అందేలా చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాను సీఎం కాగానే పెన్షన్ల ఫైలు మీదే రెండో సంతకం చేస్తానని, చంద్రబాబులా అబద్ధపు హామీలివ్వనని, మాట తప్పనని ఉద్ఘాటించారు. ‘‘చంద్రబాబు రాక్షస పాలనలో.. ముష్టివేసినట్లు రూ.75 పింఛను ఇచ్చేవారు. అప్పటికే పింఛను పొందుతున్న వారెవరైనా చనిపోతే కానీ కొత్తవారికి ఇచ్చేవారు కాదు. ఆసరా లేని వారికి అండగా ఉండాలన్న సంకల్పంతోనే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అర్హులైనప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేశారు. అది కూడా రూ.75 ఉండే పింఛన్‌ను రూ.200కు పెంచి ప్రతి నెలా ఠంచన్‌గా 1వ తేదీనే ఇంటిముంగిటికే వచ్చేలా చేశారు. ఆపన్నుల మోములో ఆనందం చూడాలని ఆయన తపించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఆ మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం కాదు కదా కనీసం ఉన్న వారికి కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. నాడు మా నాయన ఓ పెద్దకొడుకులా మీకోసం ఆలోచిస్తే.. మీ మనవడిలా నేను మీకోసం ఆలోచిస్తున్నాను’’ అని జగన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మంగళవారం రాజమండ్రి నగరంలో రోడ్‌షో నిర్వహించారు. దారిపొడవునా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు జగన్‌ను కలసి తమకు పింఛను అందడంలేదని, వచ్చే పింఛను సరిపోవడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు. రెండు నెలలు ఓపిక పట్టండి: ‘‘నాయనా మాకు పింఛన్ అందడం లేదు.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ఆసరా లేకుండా ఉన్నాను.. పింఛన్ ఇప్పించి ఆదుకోండి బాబూ’’ అంటూ గోరక్షణపేట సెంటర్లో వృద్ధులు షేక్ బేగం, డి.నాగ వేణి, పి.వరలక్ష్మి తదితరులు జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ‘‘మరో రెండు నెలల్లో మనం కలలుగనే రాజన్న రాజ్యం వస్తుంది.. అప్పుడు వృద్ధులకు ఏడొందలు.. వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పిస్తాను’’ అంటూ జగన్ వారిలో మనోధైర్యం నింపారు. అలాగే మేదరపేటకు చెందిన పాటి నాగేశ్వరరావు జగన్‌ను కలిసి.. స్కూటర్ ఢీకొట్టడంతో కాలు పోయిందని, వికలాంగుల పింఛన్ కూడా రావడంలేదని, ఆదుకోవాలని కోరగా ‘‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది.. నీకు వెయ్యి పింఛన్ వస్తుంది. ధైర్యంగా ఉండు’’ అని ఆయన భరోసా ఇచ్చారు. మందులు కొనుక్కోమంటున్నారయ్యా: ‘‘అయ్యా మీ నాయన దయ వల్ల రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. కొంతకాలం మందులు ఉచితంగానే ఇచ్చేవారు. ఇపు్పుడు మందులు కొనుక్కోమంటున్నారు. నా దగ్గర డబ్బుల్లేవు.. ఎలా కొనుక్కుంటాను? నేను ఎలా బతకగలను?’’ అంటూ జాంపేట మార్కెట్లోని బాలయోగి వీధికి చెందిన బోనుల పసమ్మ జగన్ వద్ద బావురుమంది. అజాద్‌చౌక్ సెంటర్లో జననేతను కలిసి ఆదుకోవాలని మొరపెట్టుకుంది. త్వరలోనే మంచిరోజులు వస్తాయని జగన్ ఆమెకు అభయమిచ్చారు. ప్రజాభిమానం ముందు చిన్నబోయిన భానుడు రాజమండ్రి నగరంలో జగన్ రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. నడినెత్తిన సూరీడు నిప్పులు చెరుగుతున్నప్పటికీ జనం లెక్కచేయకుండా జగన్ కోసం రోడ్లకిరువైపులా బారులు తీరారు. దీంతో రోడ్‌షో సాగిన దారులన్నీ జనగోదారులయ్యాయి. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన జగన్ రోడ్‌షో నగర పురవీధుల మీదుగా 10 కిలోమీటర్ల మేర ఎనిమిది గంటలపాటు సాగింది. ప్రజలు వరద గోదావరిలా వెల్లువెత్తడంతో పర్యటన ఆద్యంతం తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. రోడ్ షో అనంతరం వేమగిరి, కడియపులంక, జొన్నాడ, రావులపాలెం మీదుగా 9.30 గంటలకు అమలాపురం చేరుకున్న జగన్.. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిట్టబ్బాయి ఇంటిలో బస చేశారు. జగన్ బుధవారం అమలాపురంలో రోడ్‌షో, ముమ్మిడివరం సభలో పాల్గొననున్నారు. వైఎస్సార్ రుణం తీర్చుకుంటా: ముత్యాలపాప విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప మంగళవారం రాజమండ్రిలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్‌ను కలిసి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ తనను పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్లేనన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలోకి చేరికలు విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కందుల రఘుబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న రాజమండ్రిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బేబీనాయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జగన్ తన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జగన్ పర్యటనలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, విజయనగరం, శ్రీకాకుళం పార్టీ జిల్లా అధ్యక్షులు పెన్మత్స సాంబశివరాజు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, విజయనగరం, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకులు బేబి నాయన, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, రాజమండ్రి నగర , రూరల్ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. నాన్నతో ఫోన్లో మాట్లాడన్నా.. రాజమండ్రి ఐఎల్టీడీ సెంటర్లో జగన్ రోడ్‌షో సాగుతుండగా అరుణ అనే విద్యార్థిని పరుగుపరుగున వచ్చింది. ‘అన్నా వైఎస్ చలవతోనే చదువుకుంటున్నాను. మా నాన్న కూడా మిమ్మల్ని చూసేందుకు రావాలని ఆశపడ్డారు. కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారన్నా.. ఒకసారి ఫోన్లో మాట్లాడన్నా’ అని అరుణ ఫోన్‌చేసి జగన్‌కు ఇచ్చింది. ఫోన్లో అరుణ తండ్రిని పలకరించిన జగన్ ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ‘పాపను బాగా చదివించు.. త్వరలో మంచి రోజులువస్తాయి. అందరూ చల్లగా ఉంటారు’ అని భరోసా ఇచ్చారు. అదే సెంటర్లో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న మట్టా జ్యోతిని చూసి చలించిన జగన్ వాహనం దిగి నేరుగా ఆమె ఇంటికెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆమె కష్టాలు విని అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పారు. -
ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల
చంద్రబాబును నిలదీసిన కొణతాల.. హామీలివ్వడం, వాటిని విస్మరించడం ఆయన నైజం ప్రజలపై భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించింది బాబే సాక్షి, హైదరాబాద్: ప్రతి ఎన్నికల సందర్భంగా ఇష్టమొచ్చినట్టుగా అనేక వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నవరత్నాలు పేరిట పార్టీ ప్రణాళిక విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఎన్నికలకు వాటి సంఖ్య మారుతోందే తప్ప బాబు అమలు చేసింది ఏ ఒక్కటీ లేదని ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని ఉచిత హామీలిచ్చినా ఫలితముండదని, అది 2009లో నిరూపితమైందని చెప్పారు. కొణతాల పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. - తన తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని బాబు ధైర్యంగా చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా? - ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో బియ్యం రూ.2 పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. ఖజానాపై నాలుగువేల కోట్ల భారం పడుతోందని తొలిసారి రూ.3.50కు ఆ తర్వాత రూ.5.25కు పెంచారు. - ఇది చాలదన్నట్టు పన్నుల పేరిట ప్రజలపై అదనంగా నాలుగువేల కోట్ల భారం మోపారు. - మద్యపాన నిషేధం విషయంలోనూ అలాగే వ్యవహరించారు. బెల్టు షాపులు పెట్టి ప్రతి కిళ్లీ కొట్టులో మద్యం లభించేలా చేశారు. - వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను ఎన్టీఆర్ హార్స్పవర్ రూ. 50కే అందజేస్తే దాన్ని రూ.650కి పెంచిన ఘనత బాబుది. - 1999 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. - ఆడబిడ్డ పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేయడంతో పాటు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత మంగళసూత్రాలు ఇస్తామన్నారు. చేనేతన్నలకు ఆధునిక మరమగ్గాలు, నాయూ బ్రాహ్మణులకు బ్యూటీ పార్లర్లు, రజకులకు దోబీఘాట్లు, కోటి మందికి ఉద్యోగాలంటూ వాగ్దానాల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చాక ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు. - జన్మభూమి కార్యక్రమం అంటూ రోడ్డు వేసుకోవాలంటే ప్రజలే వేసుకోవాలని, చెరువులు.. కాలువలు రైతులే తవ్వుకోవాలని, చివరకు గ్రామాల్లో దొంగలు పడుతుంటే ప్రజలే కాపలా ఉండాలంటూ చెప్పిన మహానీయుడు చంద్రబాబు. - ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనతా బాబుదే. ప్రజా ప్రతినిధులకు చెక్‌పవర్ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అలాంటి వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. -
నేటినుంచే మునిసిపల్ నామినేషన్లు
మునిసిపాలిటీల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికలు జరిగే 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోని వార్డులు, డివిజన్లకు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. వీటికి సంబంధించిన షెడ్యూలు ఇలా ఉంది.. మార్చి 10: నామినేషన్ల స్వీకరణ మార్చి 13: నగర పాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 14: మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు గడవు మార్చి 15: నామినేషన్ల పరిశీలన మార్చి 18: నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 30: పోలింగ్ ఏప్రిల్ 2: ఎన్నికల ఫలితాల ప్రకటన