ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ | Former MLA Laxma Reddy Arrested | Sakshi
Sakshi News home page

ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Published Sun, Mar 30 2014 5:23 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ - Sakshi

ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

మాచర్ల: పోలింగ్ స్టేషన్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టిన గుంటూరు జిల్లా మాచర్ల తాజా ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు. పోలింగ్ స్టేషన్లో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ బెదిరించిన సంఘటనలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అరెస్ట్కు ఆదేశించింది.  

మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా 29వ వార్డులో లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement