ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యే కార్యక్రమం చేపడుతున్నట్లు జేసీ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నామని, ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆటోల ద్వారా ప్రచారం చేపడుతున్నామని అన్నారు.
ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే వారందరు ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వారు ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను ఎంపిక చేశారని, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్డులు, ధ్రువపత్రాలు 2009 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి నిర్ధారించి జారీ చేసినవై ఉండాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉండి కార్డు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల సంఘం గుర్తించి కార్డుల వివరాలిలా ఉన్నాయి.
డ్రైవింగ్ లెసైన్స్ పాస్‌పోర్టు
ఇన్‌కం ట్యాక్స్ గుర్తింపు
ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, లోకల్‌బాడీలు, పబ్లిక్‌లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోలతో ఉన్న పాస్‌పుస్తకాలు, కిసాన్‌పాస్ పుస్తకాలు
ఫొటోలతో కూడిన భూమి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాల వంటి ఆస్తి డాక్యుమెంట్లు
సంబంధిత అధికారులు జారీ చేసిన ఎస్సీ, బీసీ, ఓబీసీ సర్టిఫికెట్లు
ఫొటోలతో జారీ అయిన మాజీ సైనికుల పింఛన్ పుస్తకాలు, పెన్షన్ డాక్యుమెంట్ ఆర్డర్, ఎక్స్ సర్వీస్ మెన్‌విడో, డిపెండెంట్ సర్టిఫికెట్, వృద్ధాప్యపు, వితంతు పింఛన్ ఆర్డర్
స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో కూడిన గుర్తింపుకార్డులు
ఆయుధలెసైన్స్
ఫొటోలతో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్
జాతీయ ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన ఫొటోగురింపుకార్డు
మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్కీం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్టు కార్డులు అనుమతించనున్నారు.