రామచంద్రాపురం (పటాన్‌చెరు): కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మెదక్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ ఆమె రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారం చెలాయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో కేసీఆర్ ప్రజలకు వివరించాలని కోరారు. మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో తాను చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేయాలని కోరారు. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అంద రిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment