కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న విజయశాంతికి.. పోలింగ్ సిబ్బంది టీఆర్ఎస్కు ఓటేయమని చెబుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తామెవరికీ ఓటేయమని చెప్పలేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నా విజయశాంతి ఆగ్రహంతో ఊగిపోయారు.