
తమిళ పాలిటిక్స్ పై విజయశాంతి కామెంట్
హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ముఖ్యమంత్రి ఎడప్పాడు పళనిస్వామికి సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అభినందనలు తెలిపారు. పన్నీర్ సెల్వంతో పాటు దుష్టశక్తులు సమస్యలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
శశికళ ఒంటరి పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టకుండా పార్టీని రక్షణ కవచంగా చేసుకుని 'చిన్నమ్మ' ఒకవైపు నిలబడ్డారని, దుష్టశక్తులతో కలిసి పన్నీర్ సెల్వం మరోవైపు నిలిచారని అన్నారు. తాను వ్యక్తిగతంగా వీకే శశికళకు మద్దతునిస్తానని విజయశాంతి అంతకుముందు పేర్కొన్నారు.
అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య శనివారం తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకుంది. దీంతో పన్నీర్ సెల్వం వర్గంపై శశిశళ శిబిరం పైచేయి సాధించింది.