
సాక్షి, హైదరాబాద్: ‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాటతప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు ఇరుస్తడా?. ఈ మాటలు హుజూరాబాద్ కొచ్చి ఎందుకు మాట్లాడలె?. మీ తీరుకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్రు’అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఎద్దేవాచేశారు.
వట్టి మాటలు కట్టిపెట్టి మొదట పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూంల హామీల మాదిరిగా దళితబంధు పేరిట కేసీఆర్ దగా చేస్తారని, ఆయన మెడలు వంచి పథకాలను అమలు చేయించడానికే బీజేపీ ఉద్యమిస్తోందని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment