
సాక్షి, సంగారెడ్డి : రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ప్రతి పేదవానికి నెలకు ఆరు వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రాహుల్ ఇచ్చే ఆరు వేలు తీసుకుందామా? లేక కేసీఆర్ ఏడాదికోసారి ఇచ్చే నాలుగు వేలు తీసుకుందామా అని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రజలను ప్రశ్నించారు. సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో విజయశాంతి మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానన్నారు. అది ఏ పార్టీలో అన్నది ముఖ్యం కాదన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టరని అన్నారు.
ఇవి ఎంతో ముఖ్యమైన ఎన్నికలనీ.. న్యాయానికి, అన్యాయానికీ మధ్య జరగుతున్న ఎన్నికలని అన్నారు. మోదీ అన్యాయం వైపు ఉంటే రాహుల్‌న్యాయం వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలనుకుంటున్న కేసీఆర్, మోదీల కుట్రలను పటాపంచలు చేస్తామని హెచ్చరించారు. రాహుల్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని.. కానీ, మోదీ మాటివ్వడం తప్పా అమలు చేయరని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment