మెదక్ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు చనిపోతానా అని టీఆర్‌ఎస్ వాళ్లు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం 10 సంవత్సరాలపాటు కష్టపడితే తనను ఒంటరిని చేసి రోడ్డున పడేశారని ఆమె వాపోయారు. తననిక ప్రజలే ఆదరించాలని కోరారు. మెదక్‌లో జరిగిన రైల్వేస్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.