
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి.. కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది.
ఎమ్మెల్యే రాజాసింగ్ గారి సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్ గారితో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం. pic.twitter.com/OeqbAj4hJL
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 29, 2023
కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని వివరించారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్‌పై స్పందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్