సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. శనివారం ఆమె సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకు అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.
చదవండి: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్‌ఎస్‌లో అలజడి
Comments
Please login to add a commentAdd a comment