
మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి
హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సెక్షన్ 8ని తెరపైకి తెచ్చారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ప్రత్యర్థి పార్టీలు విమర్శించాయి.